టీడీపీలో రాజుకున్న అంతర్యుద్ధం

gorantla buchayya
Spread the love

తెలుగుదేశం పార్టీకి రాజమహేంద్రవరంలో కొత్త తలనొప్పులు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే సోము వీర్రాజుతో టీడీపీ తగాదా వీధికెక్కింది. టీడీపీ, బీజేపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకునే వరకూ వచ్చింది. ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య వివాదం రసాభసాగా మారింది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కలకలం రేపింది.

రాజమహేంద్రవరం మునిసిపల్ కౌన్సిల్ వేదికగా ఈ ఇద్దరు నేతలు తగాదా పడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒకరి సవాల్‌కు మరొకరు ప్రతి సవాల్ విసురుకున్నారు. అంతేగాక ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ తన జేబులో ఉన్నారంటూ ఆదిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడని ఆరోపించారు. అయితే… దీనికి స్పందించిన ఎమ్మెల్సీ ఆదిరెడ్డి మాట్లాడుతూ… అనవసర ప్రచారాలు చేసుకునే ఖర్మ తనకు లేదన్నారు. దాంతో ఈ ఇద్దరి వ్యవహారం రాజమహేంద్రవరం టీడీపీలో అంతర్గత పోరుని తారస్థాయికి చేర్చింది.

బుచ్చయ్య, ఆదిరెడ్డి ఒకనాడు కలిసి మెలిసి సాగేవారు. కానీ ఎర్రన్నాయుడి వియ్యంకుడిగా తన పలుకుబడితో రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ ఆశావాహుల జాబితాలోకి రావడంతో ఆదిరెడ్డితో బుచ్చయ్య తగాదా మొదలయ్యింది. దాంతో ఎర్రన్న మరణం తర్వాత ఆదిరెడ్డి అప్పారావు వైసీపీ గూటికి చేరారు. అక్కడ జగన్ ఆశీస్సులతో ఎమ్మెల్సీ కాగలిగారు. కానీ మళ్లీ పార్టీ ఫిరాయించి సొంతగూటికి చేరిపోయారు. అయినా బుచ్చయ్యతో వివాదం మాత్రం సమసిపోలేదు. మరోసారి వారి తగాదా తెరమీదకు వచ్చి రాజమహేంద్రవరం టీడీపీని అభాసుపాలుజేస్తోంది. ఇప్పటికే అనేకమార్లు వీరిద్దరూ వీధుల్లోనే వీరంగం చేశారు. తాజాగా మరోసారి అలాంంటి పరిణామాలు ఎదురుకావడంతో తెలుగుతమ్ముళ్లు తలనొప్పిగా భావిస్తున్నారు.


Related News

maddala sunita in ycp

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే

Spread the loveఇటీవల పలువురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పలువురు నేతలు వైసీపీRead More

East_Godavari_district

తూర్పున మరో తగాదా

Spread the loveతూర్పు గోదావరి జిల్లా వ్యవహారాల్లో మరో తగాదా తెరమీదకు వచ్చింది. చాలాకాలంగా పెద్దాపురంలో చాపకింద నీరులా ఉన్నRead More

 • చిక్కులు కొనితెచ్చుకున్న చినరాజప్ప
 • జగన్ కి కొత్త సమస్యలు షురూ
 • ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..
 • రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!
 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
 • టీడీపీకి జ‌న‌సేన షాక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *