Main Menu

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the love
  • 31
    Shares

గోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్ గా సాగుతుంటారు. కానీ ఇప్పుడు త‌మ ఓటు హ‌క్కు వినియోగంలో త‌మ‌కు తామే సాటి అని చెప్పుకుంటున్నారు. వాస్త‌వానికి సాధార‌ణ ఎన్నిక‌ల్లో గోదావ‌రి ఓట‌ర్లు ఎవ‌రిని గెలిపిస్తే వారికే రాష్ట్రంలో అధికార పీఠం ద‌క్క‌డం ఆన‌వాయితీగా చెప్ప‌వ‌చ్చు. అదే మండ‌లి పోరులో గోదారోళ్ల తీర్పు మ‌రింత చారిత్రాత్మ‌కం అవుతుంది.

రెండేళ్ల క్రితం ఉపాధ్యాయుల శాస‌న‌మండ‌లి స్థానానికి జ‌రిగిన పోటీలో ఓ సాధార‌ణ అధ్యాప‌కుడు విజ‌యం సాధించారు. కార్పోరేట్ ఉద్దండుడితో పోటీ ప‌డి, ప్ర‌లోభాల‌ను ఎదురించి పై చేయి సాధించారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం గోదారోళ్ల నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌, ప్ర‌జా సేవ‌కు ప‌ట్టం క‌ట్టే ధోర‌ణి అంటూ వేనోళ్ల కొనియాడారు. గోదావ‌రి తీర ఉపాధ్యాయుల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కింది. వ‌ర్త‌మానంలో రాము సూర్యారావు లాంటి వారిని శాస‌న‌మండ‌లికి పంపించిన వారిని ప్ర‌తీ ఒక్క‌రూ కొనియాడారు.

అలాంటి గోదావ‌రి జిల్లాల ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెట్టే య‌త్నాలు మొద‌ల‌యిన‌ట్టు స‌మాచారం. చివ‌రి ప్ర‌య‌త్నంలో భాగంగా ఇప్ప‌టికే అనేక చోట్ల తాయిలాల పంపిణీ కూడా ప్రారంభ‌మ‌య్యాయి. న‌గ‌దు రూపంలో పంపిణీ సాగిస్తున్న‌ట్టు పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అయినా గోదారోళ్లంటే ఏంటో చూపించ‌డం అనివార్యం అని భావిస్తున్నారు. జైలు జీవితం అనుభ‌వించిన త‌ర్వాత నీతి మాట‌లు, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా ఉండి సూక్తిముక్తావ‌ళి వ‌ల్లించే మేక‌వ‌న్నె పులుల గురించి ప‌ట్ట‌భ‌ద్రులు ప‌సిగ‌ట్ట‌లేర‌నుకోవ‌డం అవివేకం అని కొంద‌రు చెబుతున్నారు. త‌న సంస్థ‌ల్లో త‌న కుల‌స్తుల‌కే ఉద్యోగాలిచ్చుకునే వ్య‌క్తి కూడా అంబేద్క‌ర్ బోధ‌న‌ల గురించి, ప‌నిచేస్తున్న వారికి అర‌కొర వేత‌నాలు, విద్యార్థుల నుంచి ముక్కు పిండి ఫీజులు వ‌సూలు చేస్తూ వివేకానందుని వ్యాఖ్య‌లు ప్ర‌స్తావించ‌డం విశేషంగా చెబుతున్నారు.

కానీ పాత క‌థ పున‌రావృతం కాబోతోంద‌ని అంచ‌నాలు పెరుగుతున్నాయి. 2015 ప‌రిస్థితే 2019లో కూడా క‌నిపిస్తోంది. గోదారోళ్లంటే నిజాయితీప‌రుల‌ని మ‌రోసారి నిరూపించుకోవ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. ఈసారి ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంలో మ‌రో కార్పోరేట్ విద్యాసంస్థ‌ల య‌జ‌మాని జిమ్మిక్కుల‌ను అధిగ‌మించి, జ‌నం మ‌నిషి ఇళ్ల వెంక‌టేశ్వ‌ర‌రావుకి విజ‌యం క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా తామేంటో నిరూపించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌లోభాలతో ప‌నికాద‌ని గుర్తించి, గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల‌ను మ‌భ్య పెట్టలేమ‌ని నిర్ణ‌యించుకున్న కార్పోరేట్ సంస్థ య‌జ‌మాని తానే నిజాయితీప‌రుడిన‌ని ప్ర‌చారం చేసుకుంటున్న తీరు ప‌ట్ల ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. వృద్ధ పులి శాఖాహారిగా మారాన‌ని మ‌భ్య పెట్టి, ద‌గ్గ‌ర‌కి వ‌చ్చిన వారిని వ‌శం చేసుకున్న రీతిలో ఇప్పుడు కార్పోరేట్ ఆదిత్యుడి క‌థ‌లు ఉన్నాయ‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. అందుకే గోదారోడి గెలుపు ఖాయ‌మ‌ని, నిజాయితీప‌రుడికి ఓటు అనివార్య‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌ద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది.


Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the love46Sharesతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the love31Sharesగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *