Main Menu

జనసేనలోకి వైెఎస్ అనుచరుడు

Spread the love

తూర్పు గోదావరి జిల్లాలో జనసేనలోకి వలసల పర్వం సాగుతోంది. పలువురు మాజీలు ఆపార్టీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా వైెెఎస్ఆర్ తో పాటు రాజకీయ పయనం సాగించిన మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి కూడా జనసేన కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ముత్తా గోపాలక్రుష్ణతో కలిసి ఆయన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి గతంలో సంపర నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989, 2004 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. వైెఎస్ తో సన్నిహితంగా మెలిగారు. వివాదరహితుడిగా సాగిపోయారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రస్తుతం ఆయన సొంత మండలం పిఠాపురం నియోజకవర్గంలో ఉండడంతో అక్కడ సీటు గ్యారంటీ లభించలేదు. దాంతో ఆయన జనసేన వైపు మొగ్గుచూపినట్టు కనిపిస్తోంది.

సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన ప్రస్తుతం జనసేనలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కుతుందా అన్నది చర్చనీయాంశం అవుతోంది. పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం కీలకంగా ఉంటుంది. గతంలో ప్రజారాజ్యం కూడా ఇక్కడ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కాపుయేతరలకు టికెట్ ఇవ్వడం ద్వారా కాపు ఓట్లు కూడా దక్కించుకుని విజయం సాధించాలన్న లక్ష్యంతో పవన్ ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే అనిశెట్టి బుల్లబ్బాయిరెడ్డి లాంటి వారి హవాకి కాలం చెల్లింది కాబట్టి, వారితో పెద్దగా రాజకీయ ప్రయోజనం ఒనగూరే అవకాశం ఉండదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఏమయినప్పటికీ సీనియర్లు పార్టీలో చేరడం ద్వారా జనసేనకు జవసత్వాలు ఒనగూరే అవకాశం కనిపిస్తోంది.






Related News

హర్ష‌కుమార్ అటు మొగ్గు చూప‌డానికి కార‌ణం అదే..!

Spread the loveమాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ కూడా మ‌రో అడుగు వేస్తున్నారు. త్వ‌ర‌లో కొత్త కండువా క‌ప్పుకోబోతున్నారు. ఇప్ప‌టికే గ‌డిచినRead More

మ‌ళ్లీ చింత‌మ‌నేని వీరంగం, ప‌గోలో వివాదం

Spread the loveవివాదాస్ప‌ద ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రోసారి వీరంగం చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు శాస‌న‌స‌భ్యుడు త‌న స్థాయికిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *