Main Menu

స‌ర్వే: తూర్పు గోదావ‌రి ఏపార్టీకి సానుకూలం?

Spread the love

రాష్ట్రంలోనే అత్యంత ప్రాధాన్య‌త క‌లిగిన జిల్లా తూర్పు గోదావ‌రి. అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలు క‌లిగిన ఈ జిల్లాలో పాగా వేస్తే అధికార పీఠాన్ని సంపాదించ‌వ‌చ్చ‌న్న‌ది నానుడి. ప్ర‌స్తుతం 19 అసెంబ్లీ స్థానాలున్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీ 13, బీజేపీ 1 సీటు గెలుచుకున్నాయి. వైసీపీ 5 సీట్లు గెలుచుకుంది. కానీ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ‌డంతో ప్ర‌స్తుతం టీడీపీకి 15, వైసీపీకి 3, బీజేపీ 1 ఎమ్మెల్యే ఉన్నారు.

ఇక ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఎలా ఉంటుంద‌న్న దానిపై అప్ డేట్ ఏపీ స‌ర్వే నిర్వ‌హించింది. అయితే జ‌న‌సేన ప్ర‌భావాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఈ ఫ‌లితాల్లో పెనుమార్పులు ఉంటాయి. కానీ గ‌డిచిన ఎన్నిక‌ల ప్రాతిపాదిక‌న ప‌వ‌న్ పార్టీని ప్ర‌త్యేకంగా కాకుండా అధికార కూట‌మిలో భాగ‌స్వామిగా చూస్తూ ఈ స‌ర్వే నిర్వ‌హించాము. దాని ప్ర‌కారం మండ‌పేట‌, రామ‌చంద్రాపురం, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పాల‌క కూట‌మికి అనుకూల‌త క‌నిపించింది. అందులో మండ‌పేట‌, ఆర్సీ పురం టీడీపీ సిట్టింగ్ స్థానాలు కావ‌డం విశేషం. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు.

ఇక వైసీపీకి తుని, రంప‌చోడ‌వ‌రం సిట్టింగ్ సీట్ల‌తో పాటు పిఠాపురం, ప్ర‌త్తిపాడు, కాకినాడ రూర‌ల్, రాజోల అన‌ప‌ర్తిలో మొగ్గు క‌నిపిస్తోంది. బ‌ల‌మైన నాయ‌కులుండ‌డం, సామాజిక స‌మీక‌ర‌ణాలు వైసీపీకి క‌లిసొచ్చేలా క‌నిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద వ్య‌తిరేక‌త బ‌లంగా ఉండ‌డం వైసీపీకి అనుకూలంగా మారుతోంది.

మిగిలిన స్థానాలు జ‌గ్గంపేట‌, పెద్దాపురం, కాకినాడ సిటీ, ముమ్మిడివ‌రం, పి గ‌న్న‌వ‌రం, రాజాన‌గ‌రం, అమ‌లాపురం, కొత్త‌పేట‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో హోరా హోరీ పోరు త‌ప్పేలా లేదు. వాటిలో పి గ‌న్న‌వ‌రం, ముమ్మిడివ‌రం, కొత్త‌పేట‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం రూర‌ల్ లో విప‌క్షానికి మొగ్గు అవ‌కాశాలున్నాయి. కానీ ఆపార్టీలో అనైక్య‌త‌, నాయ‌క‌త్వ స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఇక జ‌గ్గంపేట‌, అమ‌లాపురం, పెద్దాపురం, రాజాన‌గ‌రం, కాకినాడ సిటీలో విప‌క్ష వైఫ‌ల్యం టీడీపీకి కొంత అనుకూల‌త‌ను సూచిస్తోంది. ఈ తొమ్మిది చోట్లా ఫ‌లితాలు అనూహ్యంగా ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది.






Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *