వీధికెక్కిన జనసేన విబేధాలు

ganta swarupa
Spread the love

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా తయారయ్యింది జనసేన పరిస్థితి. కమిటీ లేదు, నాయకత్వం లేదు గానీ ఆధిపత్య పోరు మాత్రం షురూ అయ్యింది. దాంతో ఆ పార్టీ పరువు గోదావరి పాలవుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన ఓ మహిళా నేతను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో సాగిస్తున్న వ్యవహారం చివరకు పోలీసులకు చేరింది. జనసేన అభిమానులుగా చెప్పుకుంటూ గతంలో పలువురిని బ్లాక్ మెయిల్ చేసిన నేతల భాగోతం మరచిపోకముందే ఇప్పుడు పార్టీలో పదవులు కోసం రాజమహేంద్రవరం నాయకురాలిని బద్నాం చేసే ఎత్తులు వేయడం చివరకు కేసులకు దారితీసింది.

రాజమహేంద్రవరానికి చెందిన మహిళా నాయకురాలు జనసేన సేవాదళ్ పేరుతో చాలాకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గంటా స్వరూప చేస్తున్న కార్యక్రమాలు ఆపార్టీ అధినేత ద్రుష్టికి చేరాయి. త్వరలో ఆమెకు రాష్ట్రస్థాయిలో పదవి కట్టబెట్టడం ఖాయమనే వాదన వినిపిిస్తోంది. మహిళా విభాగానికి ఆమెను ఎంచుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దాంతో ఆమెకు పోటీగా ఉన్న వర్గం గంటా స్వరూపను లక్ష్యం చేసుకుని సోషల్ మీడియా లో ఫేక్ అకౌంట్లతో దాడి మొదలు పెట్టింది. తప్పుడు రాతలతో బ్లాక్ మెయిల్ కి దిగింది.

కొంతకాలంగా సహిస్తున్న గంటా స్వరూప చివరకు పోలీసులను ఆశ్రయించింది. బాపట్లకు చెందిన జనసేన మహిళా నాయకురాలితో పాటు మరో ఆరుగురిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఈ వ్యవహారంలో గతంలో జనసేన నాయకుడిగా ప్రచారం చేసుకుని, చివరకు పార్టీ అధికారికంగా అతడితో సంబంధం లేదని ప్రకటించే వరకూ వ్యవహారం నడిపిన వ్యక్తి పాత్ర ఉందనే వాదన వినిపిస్తోంది.






Related News

chinthamaneni

చిక్కుల్లో చింత‌మ‌నేని

Spread the loveవివాదాస్ప‌ద ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ను స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం నాటి ఓ కేసు ఆయ‌నRead More

thota chandrasekhar

పవన్ కళ్యాణ్ గూటిలో జగన్ అనుచరుడు

Spread the loveజనసేన అధినేత జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ సమావేశం ముగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీదRead More

 • కాపు రిజర్వేషన్ల ఆశలపై నీళ్లు
 • టీడీపీలో రాజుకున్న అంతర్యుద్ధం
 • వీధికెక్కిన జనసేన విబేధాలు
 • వైసీపీపై అలిగిన మాజీ మంత్రి
 • వైసీపీ సీనియర్ కి వలవేసిన టీడీపీ
 • వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..
 • టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి
 • బాబు మాటలతో ఎమ్మెల్యేల బేజారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *