తారస్థాయిలో టీడీపీ తగాదా

tdp
Spread the love

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని టిడిపిలో గ్రూపుల పోరు రోజురోజుకూ పెరుగుతోంది. గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) ఛైర్మన్‌ గన్ని కృష్ణ, నగర మేయర్‌ రజనీ శేషసాయి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టిడిపికి చెందిన మేయర్‌ను ఆ పార్టీ వారే చులకన చేస్తున్నారు. నగర పాలక సంస్థ పాలక మండలిపై గన్ని కృష్ణ పెత్తనం చేస్తున్నారని మేయర్‌ భావిస్తున్నారు. స్థాయీ సంఘం అంశాల ఆమోదంపై గన్ని కృష్ణ ఒత్తిడి తెస్తున్నారని ఇటీవల ప్రెస్‌మీట్‌లో మేయర్‌ చిర్రుబుర్రులాడారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత గోరంట్లకు పార్టీ అధిష్టానికి మధ్య సఖ్యత చెడిందనే ప్రచారం జరిగింది. అదే సమయంలో గన్ని కృష్ణ గుడా ఛైర్మన్‌ పదవిని పొందారు. అధిష్టానం అండతో గన్ని కృష్ణ తన గ్రూపును బలపరుచుకునే పనిలో ఉన్నారనే ప్రచారం ఉంది. నగరంలో పట్టు సంపాదించడం కోసం నగరపాలనలో ఆయన జోక్యం పెరుగుతోందని మేయర్‌ భావిస్తున్నారు. ఇటీవల గన్ని కృష్ణ నివాసం ఉన్న 42వ డివిజన్‌లో ఇంటింటికీ తెలుగుదేశం నిర్వహించారు. ఇక్కడ సభా వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వైసిపి నుంచి వచ్చిన ఆదిరెడ్డి అప్పారావు, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన చల్లా శంకరరావు ఫోటోలు ఉన్నాయి. మేయర్‌ ఫోటోను ముద్రించలేదు. దీంతో మేయర్‌ కలత చెందారు. ఆదివారం జరిగిన వ్యవసాయ కళాశాల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకంపైనా ఆమె పేరు లేకపోవడంతో మనోవేదనకు గురై కంటతడి పెట్టారు. సభా వేదిక నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. తనకు జరుగుతున్న అవమానాలను మంత్రి సోమిరెడ్డికి మేయర్‌ వివరిస్తున్న సందర్భంలోనూ గోరంట్ల ఆమెపై చిర్రుబుర్రులాడటంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు.


Related News

Congress_4729

వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..

Spread the loveపోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. నిత్యం ఆందోళనలతో మీడియాలోRead More

TDP WEST PEETALA

టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి

Spread the loveతెలుగుదేశంలో ఒక సామాజికవర్గం పెత్తనం గురించి చాలాకాలంగా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే పరిస్థితులున్నాయి. చివరకు రిజర్వుడుRead More

 • బాబు మాటలతో ఎమ్మెల్యేల బేజారు
 • తెలుగుదేశం ‘తోట’లో న్యాయం లేదు…!
 • ఎమ్మెల్యేని పరుగులు పెట్టించిన జనం
 • చినరాజప్ప సీటు మారుతోంది…
 • తారస్థాయిలో టీడీపీ తగాదా
 • ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?
 • కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ
 • యనమల అవుట్..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *