Main Menu

చిక్కుల్లో చింత‌మ‌నేని

chinthamaneni
Spread the love

వివాదాస్ప‌ద ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ను స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం నాటి ఓ కేసు ఆయ‌న మెడ‌కు చుట్టుకుంటోంది. చివ‌ర‌కు ప‌దవీగండం పొంచి ఉండ‌డంతో ఆయ‌న తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దాని నుంచి గ‌ట్టెక్క‌డం కోసం హైకోర్ట్ ని ఆశ్ర‌యించ‌క త‌ప్ప‌ని స్థితి దాపురించింది.

గ‌తంలో వ‌ట్టి వ‌సంత‌కుమార్ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో దెందులూరులో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌నపై దురుసుగా ప్ర‌వ‌ర్తించిన కేసులో చింత‌మ‌నేనికి ఇటీవ‌ల శిక్ష ప‌డింది. భీమ‌డోలు కోర్ట్ ఆయ‌న్ని దోషిగా తేల్చింది. శిక్ష కూడా ఖ‌రార‌య్యింది. అది ఆయ‌న ప‌ద‌వికి ఎసరు తెచ్చేలా క‌నిపిస్తోంది. 2ఏళ్ళ‌కు పైబ‌డిని కేసులో దోషిగా తేలితే చ‌ట్ట‌స‌భ‌ల్లో కొన‌సాగే అర్హ‌త కోల్పోతారు. ఇప్పుడు చింత‌మ‌నేనికి ప‌ద‌వీచ్యుతుడిని చేసేలా శిక్ష ఖాయం కావ‌డంతో ఆయ‌న్ని ఇర‌కాటంలో నెట్టింది.

ప‌లు కేసుల్లో ఇరుకున్న‌ప్ప‌టికీ వాటి నుంచి గ‌ట్టెక్కుతూ అనేకమంది అధికారులు, ప్ర‌జ‌ల‌పై కూడా దాడుల‌కు తెగ‌బ‌డిన నాయ‌కుడిగా చింత‌మ‌నేనికి పేరుంది. కానీ వ‌ట్టి వ‌సంత‌కుమార్ కేసు మాత్రం ఆయ‌న ప‌ద‌వికి గండం తెచ్చే స్థాయికి తీసుకురావ‌డంతో విప‌క్షం దూకుడు పెంచింది. ఒత్తిడి పెంచ‌డానికి త‌గ్గ‌ట్టుగా ప్ర‌భుత్వ విప్ గానూ, ఎమ్మెల్యేగానూ చింత‌మ‌నేనిపై వేటు వేయాలంంటూ డిమాండ్ చేస్తోంది. కోర్ట్ తీర్పు ఆధారంగా తక్ష‌ణం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతోంది. తాజాగా వైసీపీ నేత‌లు అసెంబ్లీ కార్య‌ద‌ర్శిని క‌లిసి వినతిప‌త్రం అందించ‌డంలో అందులో భాగంగానే అని చెప్ప‌వ‌చ్చు. హైకోర్ట్ ని ఆశ్ర‌యించిన‌ప్ప‌టికీ చింత‌మ‌నేనికి స‌కాలంలో స్టే ల‌భించ‌క‌పోతే మాత్రం ఆయ‌న వేటు ఖాయంగా మారింది. దాంతో ఆయ‌న మెడ మీద క‌త్తి వేలాడుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.






Related News

chinthamaneni

మ‌ళ్లీ చింత‌మ‌నేని దౌర్జన్యం

Spread the loveప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింత‌మనేని ప్ర‌భాక‌ర్ రెచ్చిపోతూనే ఉన్నారు. ఇప్ప‌టికే అనేక‌మందిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించి వార్త‌ల‌కెక్కినRead More

jakkampudi

జ‌గ‌న్ మీద వారి కోపం ఎందుకు?

Spread the loveజ‌గ‌న్ కుటుంబంతో వారిది అన్యోన్య బంధం. అంది కూడా దివంగ‌త నేత‌ల వార‌స‌త్వం కావ‌డం విశేషం. అందుకుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *