Main Menu

చింత‌మ‌నేని వీడియో: మార్ఫింగ్ ఎక్క‌డా?

Spread the love

దెందులూరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని మాట‌లు మంట‌లు రేపాయి. చంద్ర‌బాబు స‌ర్కారుని చిక్కుల్లో నెట్టాయి. ఎస్సీల ప‌ట్ల చింత‌మ‌నేని వైఖ‌రితో స‌మ‌స్య‌లు త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు టీడీపీలో ఒక్క ఎస్సీ సామాజిక‌వ‌ర్గ నేత కూడా నోరు మెద‌ప‌లేని ప‌రిస్థితి దాపురించింది. ఈ ప‌రిస్థితుల్లో టీడీపీ నేత‌లు ఎదురుదాడి ప్రారంభించారు. అందులో భాగంగానే నేరుగా సీఎం రంగంలోకి వ‌చ్చారు. చింత‌మ‌నేని వ్యాఖ్య‌లు వ‌క్రీక‌రించారంటూ, వీడియో మార్ఫింగ్ చేశారంటూ విమ‌ర్శించారు.

సీఎం మాట‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా పోలీసులు తెర‌మీద‌కు వ‌చ్చారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో వైసీపీ కార్య‌క‌ర్త‌ను అరెస్ట్ చేశారు. గ‌త ఏడాది జ‌న్మ‌భూమి స‌భ‌లో ఎమ్మెల్యే వ్యాఖ్య‌ల‌ను క‌ట్ చేసి 30 సెకన్ల వీడియోతో అపోహ‌లు క‌ల్పించే రీతిలో, కొన్ని వ‌ర్గాల మ‌ధ్య వైష‌మ్యాలు రెచ్చ‌గొట్టే రీతిలో వ్య‌వ‌హ‌రించాల‌ని అభియోగాలు న‌మోదు చేశారు. అరెస్టులు కూడా చేశారు.

అయితే తాను ఆ మాట‌లు అన‌లేద‌ని చింత‌మ‌నేని కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ చెప్ప‌లేదు. అయినా దానిని మార్ఫింగ్ అంటూ ముఖ్య‌మంత్రి ముందుకొచ్చారు. పోలీసులు చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. ఇది ప్ర‌భుత్వ ధోర‌ణికి అద్దంప‌డుతోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజ‌కీయ కార‌ణాల‌తో సీఎం ప్ర‌త్యారోప‌ణ‌ల‌కు దిగిన‌ప్ప‌టికీ మార్ఫింగ్ జ‌రిగిందంటూ పోలీసులు నిర్ధార‌ణకు రావ‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. మార్ఫింగ్ అంటే మాట‌లా, వీడియోనా అనేది అర్థం కాని విష‌యంగా మారింది. నిజంగానే వీడియో క‌ట్ చేసి 30 సెక‌న్లు సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తే అది నేర‌మా..అవ‌స‌ర‌మైనంత మేర‌కు, అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలున్నంత వ‌ర‌కూ వీడియోని ప్ర‌సారం చేయ‌డం త‌ప్పా..ఒక‌వేళ గ‌త ఏడాదిదే అనుకున్నా ఇప్పుడు పోస్ట్ చేస్తే త‌ప్పు ఎలా అవుతుంద‌న్న‌దే అంతుబ‌ట్ట‌ని విష‌యంగా మారింది.

మొత్తంగా ప్ర‌భుత్వం త‌మ నేత‌ను స‌మ‌ర్థించుకోవ‌డానికి కొన్ని అడుగులు వేస్తుంటే, పోలీసులు అందుకు త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విష‌యం స్ప‌ష్టం అవుతోంది.






Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *