Main Menu

మ‌ళ్లీ చింత‌మ‌నేని ప్ర‌తాపం..!

Spread the love

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్‌, చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి రైతుల‌పై వీరంగం చేశారు. నోటికి ప‌ని చెప్పారు. పోలీసుల‌ను ఉసిగొల్పారు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలోని పెదపాడు మండలం వట్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద జన్మభూమి స‌భ‌లో త‌మ‌కు న్యాయం కావాల‌ని కోరినందుకు చిందులు వేశారు.

రక్షణ రంగ పరిశ్రమ వల్ల భూములు కోల్పోయిన రైతులు ఫ్లకార్డులతో ఒకపక్కగా నిలుచున్నారు. అక్కడికి చేరుకున్న ఎంఎల్‌ఎ చింతమనేని ‘నా కొడుకుల్లారా..’ అంటూ బూతులు తిట్టారు. ఎందుకు తిడుతున్నారని రైతులు ప్రశ్నించడంతో తహశీల్దార్‌, పోలీసులనుద్దేశించి ‘వీరిపై కేసులు పెట్టి వీళ్ల అంతు చూడాలి. ఏ ఒక్కరినీ వదలబోను’ అంటూ విరుచుకుపడ్డారు. ఎంఎల్‌ఎ చెప్పడమే ఆలస్యమైనట్లు రైతులపై పోలీసులు బెదిరింపులకు దిగారు. 12 మందిపై కేసులు నమోదు చేశారని రైతులు చెబుతున్నారు. ఇద్దరు రైతులను ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. రైతుల్లో ఒకరికి ఫోన్‌ చేసి మీరంతా పోలీస్‌స్టేషన్‌కు రావాలని హుకుం జారీ చేశారు. మేరుగు పౌలు, కోటే రవి, మలపు మరియన్న, లూర్దుయా, నంబూరు తంబి, తిరిగే ఏసుబాబు, కిషోర్‌, పేట్ల ఏసు, మెన్నం పురుషోత్తం, కారెం బాబూరావు, గంధం చిన్నోడు, మేడపల్లి ఛార్లెస్‌పై కేసు పెట్టినట్లు తెలిసింది. గ్రామంలో పోలీసులు కలియతిరుగుతూ బెదిరింపులకు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అరెస్టులు చేయడం, వేధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఏలూరు త్రీటౌన్‌ ఎస్‌ఐ పైడిబాబును వివరణ కోరగా పెదపాడు తహశీల్దార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.


Related News

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the loveతెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్Read More

మ‌ళ్లీ గోదారోడే..!

Spread the loveగోదారోళ్లంటే అనురాగాల‌కు, అప్యాయ‌త‌ల‌కు పేరు అని చెబుతారు. ఆతిథ్యానికి పెట్టింది పేరుగా క‌నిపిస్తారు. హాస్యానికి, వ్యంగ్యానికి కేరాఫ్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *