టీడీపీ ఎమ్మెల్యేకి త‌ప్పిన ముప్పు

chintamaneni-prabhakar
Spread the love

వేటు ఉచ్చులో ఇరుక్కున్న టీడీపీ ఎమ్మెల్యే బ‌య‌ట‌ప‌డ్డారు. భీమ‌డోలు కోర్ట్ వేసిన శిక్ష‌తో విల‌విల్లాడిన దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కి ఊర‌ట ల‌భించింది. నిర్ధోషిత్వం కాక‌పోయినా తాత్కాలికంగా శిక్ష నిలుపుద‌ల చేయ‌డంతో ఆయ‌న ఊపిరిపీల్చుకున్నారు. అసెంబ్లీ స‌భ్య‌త్వం విష‌యంలో ఆయ‌న మీద వేటు వేసే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు.

2012లో రచ్చబండ కార్యక్రమంలో అప్పటి మంత్రి వట్టి వసంత కుమార్‌పై దాడి చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో గత నెల భీమడోలు కోర్టు దోషిగా నిర్ధారించి 2 సంవత్సవరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పును హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఆదేశాలు జారీచేశారు. ఈ కేసులో చింతమనేని భీమడోలు మెజిస్ర్టేట్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఏలూరులోని జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి కోర్టులో అప్పీలు చేశారు. దాన్ని విచారించిన సెషన్స్‌ జడ్జి జైలు శిక్షను నిలుపుదల చేశారు. మెజిస్ర్టేట్‌ కోర్టు దోషిగా నిర్ధాంచిన అంశంపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. సెషన్స్‌ కోర్టు ఆదేశాలపై చింతమనేని హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున సీనియర్‌ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదించారు. జిల్లా సెషన్స్‌ జడ్జి జైలుశిక్షను మాత్రమే నిలుపుదల చేశారని, నిర్ధోషిత్వంపై ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్యేకి పెద్ద ముప్పు త‌ప్పింద‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ మెడ మీద క‌త్తి మాత్రం వేలాడుతుంటుంది. ముఖ్యంగా ఆయ‌న దాడికి పాల్ప‌డిన‌ట్టు పూర్తిస్థాయి ఆధారాలున్న నేప‌థ్యంలో ఆయ‌న మీద ఎప్ప‌టికైనా వేటు ప‌డ‌వ‌చ్చ‌నే అభిప్రాయం ప‌లువురిలో వినిపిస్తోంది.


Related News

narsapuram

ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..

Spread the loveప్ర‌శాంత ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో చిచ్చు రాజుకుంది. ప‌చ్చ‌పార్టీ వ్య‌వ‌హారాల్లో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. కీల‌క జిల్లాలో పార్టీRead More

abn md radha krishna

రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!

Spread the loveప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. జ‌న‌సేన అధినేత తీరు రోజురోజుకి చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ట్విట్ట‌ర్ వేదిక‌గాRead More

 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
 • టీడీపీకి జ‌న‌సేన షాక్
 • ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి!
 • వైసీపీలోకి సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య
 • టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…
 • గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *