Main Menu

చినరాజప్ప సీటు మారుతోంది…

chinarajapp
Spread the love

ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సీటు మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సీటు వచ్చే ఎన్నికల్లో జనసేనకు ఖాయం అనే వాదన వినిపిస్తోంది. పెద్దాపురం సీటుని పొత్తులో భాగంగా మిత్రపక్షానికి కేటాయించాల్సి వస్తే దానికి బదులుగా కాకినాడ జిల్లా కేంద్రం సీటు మీద చినరాజప్ప కన్నేసినట్టు కనిపిస్తోంది.. దానికి తగ్గట్టుగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోంది.

కాకినాడలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న వనమాడి కొండబాబుకి చినరాజప్ప ఎర్త్ పెట్టడం ఖాయంగా మారుతోంది. గడిచిన కొన్నాళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొండబాబు తీరు పట్ల చంద్రబాబు సంత్రుప్తిగా కనిిపంచడం లేదు. గడిచిన మునిసిపల్ ఎన్నికల్లో కూడా కొండబాబుకి కొంత వ్యతిరేక గాలి వీచింది. ఆయన సోదరుడి కుమారుడు కూడా ఓటమి పాలయ్యారు. దాంతో కొండబాబు మీద ప్రజాగ్రహం తీవ్రంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కు ఎసరు పెట్టడం ఖాయమనే వాదన బలపడింది. అదే సమయంలో కాకినాడ నగర టీడీపీలో వర్గపోరు కూడా కొండబాబుకి కష్టకాలం తీసుకొచ్చేలా కనిపిస్తోంది. కొండబాబు అన్నయ్య వ్యవహారం కూడా ఆయన్ని అభాసుపాలుజేస్తోంది,

దాంతో చినరాజప్ప కన్ను కాకినాడ మీద పడిందనే వాదన బలపడుతోంది.తన సీటు పెద్దాపురం నుంచి గతంలో ప్రజారాజ్యం విజయం సాధించిన నేపథ్యంలో వచ్చేసారి జనసేన పెద్దాపురం కోరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దాంతో ప్రత్యామ్నాయంగా పిఠాపురం గానీ, కాకినాడ నగరం గానీ శ్రేయస్కరం అని చినరాజప్ప అంచనా వేస్తున్నారు. ఇప్పటి నుంచే దానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. కాకినాడ కార్పోరేషన్ కోఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా తన మాటే చెల్లుబాటయ్యేలా చేసుకోవడం అందులో భాగమే అంటున్నారు.






Related News

jakkampudi

జ‌గ‌న్ మీద వారి కోపం ఎందుకు?

Spread the loveజ‌గ‌న్ కుటుంబంతో వారిది అన్యోన్య బంధం. అంది కూడా దివంగ‌త నేత‌ల వార‌స‌త్వం కావ‌డం విశేషం. అందుకుRead More

Vijayawada-huge-crowd-welcomes-to-YS-Jagan-padayatra-696x411

రాజమండ్రి వంతెన కథలో అసలు విషయమదే

Spread the loveఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా ప్రజాసంకల్ప పాదయాత్రతో వాడవాడలా సాగుతున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *