వైసీపీలోకి సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య

CHEGONDI
Spread the love

పలువురు సీనియర్లు వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సినీయిర్ నేత చేగొండి హరిరామజోగయ్య కూడా చేరిపోయారు. త్వరలోనే ఆయన జగన్ గూటిలో చేరడానికి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. అయితే ఆయన వారసుడిగా చేగొండి సూర్యప్రకాశ్ రాజకీయ భవితవ్యం కోసమే ఆయన మరోసారి రాజకీయాల్లో క్రియాశీలం అవుతారని చెబుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం హరిరామజోగయ్య ఆరోగ్యం అంత సహకరించడం లేదు. అయినప్పటికీ ఆయనకు కొంత ఆదరణ ఉంది. ముఖ్యంగా కాపు సామాజికవర్గంలో ఆయనకు ఫాలోయింగ్ ఉంది. కొద్దిరోజుల క్రితం ఆయన రాసిన పుస్తకంలో చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రంగా హత్యకు సంబంధించి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఆ తర్వాత కాపు ఉద్యమంలో ముద్రగడకి జోగయ్య మద్ధతు పలికారు. చివరకు ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా వైసీపీ వైపు మరలడం ఆసక్తిగా మారుతోంది.

వచ్చే ఎన్నికల్లో హరిరామజోగయ్య వారసుడు పాలకొల్లు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. చేగొండి సూర్యప్రకాశ్ వ్యాపారరంగంలో ప్రయత్నించినప్పటికీ రాజకీయాల మీద ఆసక్తితోనే ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది. దాంతో సూర్యప్రకాశ్ కి టికెట్ కోసం హరిరామజోగయ్య చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశించిన తర్వాత పార్టీ కండువా కప్పుకునే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం పాలకొల్లు నుంచి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు ప్రజల్లో కొంత ఆదరణ ఉంది. లోకేష్ కి సన్నిహితుడు. వచ్చే సారి కూడా ఆయన రంగంలో దిగడం ఖాయం. గడిచిన ఎన్నికల్లో వైసీపీ తరుపున మేకా శేషుబాబు పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో గణబాబుకి టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా చేగొండి ముందుకు రావడంతో సూర్యప్రకాశ్ కి సీటు దక్కవచ్చని చెబుతున్నారు.

అయితే సూర్యప్రకాశ్ అభ్యర్థిత్వం సరైనదేనా అంశం మీద భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ రాబోయే రోజుల్లో ఏమేరకు పుంజుకుంటారన్నదానిని బట్టి సూర్యప్రకాశ్ కి టికెట్ దక్కవచ్చని చెబుతున్నారు. హరిరామజోగయ్య అనుభవం ఆయనకు ఉపయోగపడితే కొంత ప్రయోజనం దక్కవచ్చు.






Related News

7500_Deputy CM Chinarajappa

చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ

Spread the loveఇదో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌య్యింది. గ‌తంలో ఎమ్మెల్సీగా మాత్ర‌మే ప‌నిచేసిన ఆయ‌న తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావ‌డంతోనేRead More

636593328862218666

జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు

Spread the loveఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ప్ర‌భుత్వ ప‌క్షం ఇప్ప‌టికే ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో స‌త‌మ‌తం అవుతోంది. మ‌రోవైపు విప‌క్షRead More

  • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
  • టీడీపీకి జ‌న‌సేన షాక్
  • ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా మాజీ మంత్రి!
  • వైసీపీలోకి సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య
  • టీడీపీకి క్లారిటీ వ‌చ్చేసింది…
  • గోదావ‌రిలో టీడీపీకి పెద్ద గండి…!
  • టీడీపీ ఎమ్మెల్యేకి త‌ప్పిన ముప్పు
  • జ‌న‌సేనానికి ముద్ర‌గ‌డ మ‌ద్ధ‌తు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *