Main Menu

వాళ్లిద్ద‌రికీ టికెట్ లేద‌ని చెప్పిన చంద్ర‌బాబు..!

chandrababu-naidu-not-sure-if-andhra-will-get-special-status
Spread the love

ఏపీలో ఎన్నిక‌లు ఇప్పుడు చంద్ర‌బాబుని చిక్కుల్లో ప‌డేశాయి. రాకూడ‌ద‌నుకున్న ఎన్నిక‌లు, రాకూడ‌ని టైమ్ లో రావ‌డంతో ఆయ‌న గ‌ట్టెక్క‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. శాస‌న‌స‌భ‌కు నంద్యాల‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌లే కాకుండా స్థానిక సంస్థ‌ల‌కు కాకినాడ‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు కూడా ఆయ‌న‌కు అగ్నిపరీక్ష‌గా మారాయి. అస‌లే అసంతృప్తి సెగ‌లు క‌క్కుతున్న స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లో ఓట్లు సంపాదించ‌డం స‌ర్కారు వారికి అంత సులువు కాదు. తాయిలాలు ప్ర‌యోగించినా, ఇత‌ర అభివృద్ధి మంత్రాలు జ‌పించినా ఫ‌లితాలు ప్ర‌శ్నార్థ‌క‌మే. అదే ఇప్పుడు క‌ల‌వ‌ర‌పాటుకి గురిచేస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

అందుకే కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల‌ను కూడా ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. చిన్న ఎన్నిక‌లే అయినా స‌వాల్ గా తీసుకున్నారు. ఏమాత్రం తేడా వ‌చ్చినా విప‌క్షానికి ఊపిరిపోసిన‌ట్ట‌వుతుంద‌ని భావిస్తున్నారు. అందుకే తూర్పు గోదావ‌రి జిల్లా ఎన్నిక‌ల బాధ్య‌త‌ల‌ను ఇద్ద‌రు మంత్రుల‌కు అప్ప‌గించారు. నంద్యాల‌లో డ‌జ‌ను మంది మంత్రులు, అంత‌కు రెండింత‌లు ఎమ్మెల్యేలున్న‌ట్టే కాకినాడ‌లో ఇద్ద‌రు మంత్రుల‌ను మోహ‌రించారు. వారికితోడు ఇన్ఛార్జ్ మంత్రి క‌ళా వెంక‌ట్రావుకి కూడా బాధ్య‌త అప్ప‌గించారు. మ‌రో 15మంది ఎమ్మెల్యేల‌ను కూడా న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నిక‌ల బాధ్య‌త తీసుకోవాల‌ని ఆదేశించారు.

అదే స‌మ‌యంలో న‌గ‌ర కార్పోరేష‌న్ ఎన్నిక‌ల ప‌రిధిలోని ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు ఆయ‌న క్లాస్ తీసుకున్నారు. ఇటీవ‌ల పురుషోత్త‌ప‌ట్నం ప‌నుల ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన సీఎం ద‌గ్గ‌ర‌కి ఎమ్మెల్యేలు, మంత్రులు రావ‌డంపై బాబు క‌స్సుమ‌న్నారు. బ‌స్సులో కూర్చోబెట్టి అంద‌రికీ పాఠం చెప్పారు. ప్రాధాన్య‌త వివ‌రించారు. ఏమాత్రం లైట్ తీసుకున్నా మునిగిపోతామ‌ని హిత‌బోధ చేశారు. అదే స‌మ‌యంలో టీడీపీకి ఐదుగురు ఎక్స్ అఫీషియో స‌భ్యులున్నారు కాబ‌ట్టి, కార్పోరేష‌న్ త‌మ‌దేన‌నే ధీమా వ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల్లో ఎమ్మెల్యేల ప‌ట్ల వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉంద‌ని త‌న ద‌గ్గ‌ర ఉన్న నివేదిక‌ను బయ‌ట‌పెట్టారు. అదే స‌మ‌యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండ‌బాబు, రూర‌ల్ ఎమ్మెల్యే పిల్లి అనంత‌ల‌క్ష్మికి ప్ర‌త్యేక హెచ్చ‌రిక‌లు కూడా జారీ అయ్యాయి. ఫ‌లితాలు ఏమాత్రం తారుమార‌యినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఉండ‌వ‌ని ఆయ‌న సూటిగా చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది.

దాంతో సీఎం ప‌రిస్థితి గ‌మ‌నించిన ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న తో పాటు ముందుకెళ్ల‌కుండా హుటాహుటీన వెనుదిరిగారు. కాకినాడ‌లో సామాజిక‌వ‌ర్గాల వారీగా కుస్తీలు ప‌డుతున్నారు. కానీ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డ‌మే కాకుండా, ప్ర‌త్య‌ర్థులంతా వైసీపీ జెండా కింద ఏక‌మ‌వుతుండ‌డం కూడా పాల‌క‌పార్టీని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. ఈ స‌మ‌స్య ఇప్పుడు ఎమ్మెల్యేల‌కు ఇబ్బందిక‌రంగా మారుతోంది. అస‌లే రూర‌ల్ ఎమ్మెల్యే వ్య‌వ‌హారంలో భ‌ర్త పెత్త‌నం, సిటీ ఎమ్మెల్యే విష‌యంలో అన్న పెత్త‌నం క‌లిసి ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హాన్ని పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎటుదారితీస్తాయ‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.


Related News

tdp

టీడీపీకి షాకిచ్చిన కాపు కార్పోరేష‌న్ డైరెక్ట‌ర్

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల్లో తిరుగులేని ఆధిప‌త్యం చాటుకున్న టీడీపీకి ఇప్పుడు క‌ష్టాలు త‌ప్పేలా లేవు. వ‌రుస‌గా ప‌శ్చిమ గోదావ‌రిRead More

gorantla buchayya

అయ్యో..బుచ్చ‌య్య‌కి హ్యాండిస్తున్న‌ట్టేనా!

Spread the loveతెలుగుదేశం పార్టీలో ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు. స్వ‌యంగా ఆయ‌న చెప్పుకున్న మాట‌ల ప్ర‌కారం చెప్పాలంటే టీడీపీలో చంద్ర‌బాబుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *