బెట్టింగ్, భూ ఆక్రమణే బాబు ఎజెండా

CHANDRABABU
Spread the love

ఏపీ సీఎం ఎజెండా మార్చేశారు. కాకినాడ ఎన్నికల నేపథ్యంలో ఆయన క్రికెట్ బెట్టింగ్ ని ప్రధానాస్త్రంగా మార్చుకున్నారు. నంద్యాలలో పోలింగ్ కి ముందే ఈ అంశాన్ని నెల్లూరులో రాజేసి ఇప్పుడు కాకినాడలో పీక్ స్టేజ్ కి తీసుకెళ్లారు. క్రికెట్ బెట్టింగ్ ని విపక్షానికి ముడిపెట్టి వైసీపీకి ఓటేస్తే ప్రజలను క్రికెట్ బెట్టింగ్ లో అమ్మేస్తారని సీఎం వ్యాఖ్యానించే స్థాయికి వెళ్లారు. ప్రజలను విపక్షం బెట్టింగ్ లో అమ్మేస్తుంటే అసలు అధికారం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఎక్కడికి పోయింది..ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్న ప్రశ్నకు బహుశా సమాధానం ఉండకపోవచ్చు. ప్రజలు దాని గురించి ఆలోచించరని చంద్రబాబు ధీమా కావచ్చు.

వాస్తవానికి రాజకీయ పార్టీలలో ప్రధానంగా అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లకు అండగా ఉంటున్నారనడంలో సందేహం లేదు. ఇరు పార్టీల ప్రధాన నేతల అనుచరులే బెట్టింగ్ ముఠాలకు ఆధ్యులు. వారి అండదండలతోనే క్రికెట్ బెట్టింగ్ విస్తరిస్తోంది. పోలీసులు కూడా అడపాదడపా దాడులు చేస్తున్నామని ఫోటోలకు ఫోజులిచ్చి చేతులు దులుపుకోవడం తప్ప బెట్టింగ్ భూతాన్ని అడ్డుకోలేని పరిస్థితి ఈ రాజకీయాల వల్లే కనిపిస్తోంది. దానికి ఎవరూ మినహాయింపు కాదు. కానీ చంద్రబాబు మాత్రం క్రికెట్ బెట్టింగ్ అంతా వైసీపీ వాళ్లే చేస్తున్నారంటూ చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. వైసీపీ ఎమ్మెల్యేలకు నెల్లూరులో నోటీసులిచ్చి నంద్యాలలో ప్రబావం చూపాలని ఆశించిన చంద్రబాబు అక్కడ పెద్దగా ఫలితం రాకపోయినా అదే సీన్ కాకినాడలో రిపీట్ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీలు బిజీగా ఉన్న సమయంలో క్రికెట్ బెట్టింగ్ ని తెరమీదకు తెచ్చి, అందులో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఉన్నారంటూ తన అనుకూల మీడియాలో కథనాలు ఇచ్చి, చివరకు 9మందిని అరెస్ట్ చేసి దానిని ఎన్నికల ప్రచారాస్త్రం చేసుకోవడం విశేషమే. అరెస్ట్ అయిన వారంతా టీడీపీ నేతలకు, చివరకు హోం మంత్రికి కూడా సన్నిహితులేనిన చెబుతున్నప్పటికీ సీఎం మాత్రం వైసీపీకి అంటగట్టే పని సాగించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.

ఇక దానికితోడుగా భూ ఆక్రమణల పర్వం తెరమీదకు తెచ్చారు. కాకినాడలో వైసీపీ నేతలే భూ ఆక్రమణలకు పాల్పడినట్టు ఆయన ఆరోపించారు. కోట్ల రూపాయల ఖరీదైన స్థలాలు కాజేస్తే మూడున్నరేళ్ల చంద్రబాబు పాలనలో ఏం చేశారన్నది ఆయన కూడా సమాధానం చెప్పలేరేమో కానీ విమర్శలు మాత్రం చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వనమాడి కొండబాబు భూ ఆక్రమణల చిట్టా చాలా పొడవుగా ఉంది. మహాలక్ష్మి నగర్ లో ఏకంగా 20 ఎకరాల విలువైన భూమిని కొండబాబు కాజేసిన వైనం కలకలం రేపుతోంది. కానీ చంద్రబాబు మాత్రం కొండబాబుని పక్కన పెట్టుకుని మరోడెవరో భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆరోపణలు చేయడం సామాన్యుడిని సైతం విస్మయానికి గురిచేస్తోంది.

దాంతో బెట్టింగ, భూ ఆక్రమణలు తెరమీదకు తీసుకురావడం ద్వారా వైసీపీ నేతలంతా నేరగాళ్లేనని చిత్రీకరించడానికి చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నమే చంద్రబాబు మరోసారి చేసినట్టు స్పష్టమవుోతంది. జగన్ వ్యాఖ్యలను ప్రస్తావించి అలాంటి ఆలోచన రేకెత్తించడానికి బాబు ప్రయత్నించారు. దానికి తోడుగా ఈ రెండు విషయాలను ప్రధానాస్త్రాలుగా మార్చుకున్నారు. కానీ ఫలితం ఉంటుందా అంటే మాత్రం సందేహమే.


Related News

maddala sunita in ycp

వైసీపీలోకి మరో మాజీ ఎమ్మెల్యే

Spread the loveఇటీవల పలువురు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పలువురు నేతలు వైసీపీRead More

East_Godavari_district

తూర్పున మరో తగాదా

Spread the loveతూర్పు గోదావరి జిల్లా వ్యవహారాల్లో మరో తగాదా తెరమీదకు వచ్చింది. చాలాకాలంగా పెద్దాపురంలో చాపకింద నీరులా ఉన్నRead More

 • చిక్కులు కొనితెచ్చుకున్న చినరాజప్ప
 • జగన్ కి కొత్త సమస్యలు షురూ
 • ప‌శ్చిమ టీడీపీలో చిచ్చు ..
 • రాధాకృష్ణ‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన బిరుదు…!
 • చిన‌రాజ‌ప్ప‌కి స్కెచ్ వేస్తున్న సొంత పార్టీ
 • జ‌గ‌న్ కి జై కొట్టిన మ‌రో సినీ న‌టుడు
 • కీల‌క ప్రాంతంలో వైసీపీ ఉక్కిరిబిక్కిరి
 • టీడీపీకి జ‌న‌సేన షాక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *