Main Menu

జ‌గ‌న్, బాబు రెండుప‌డ‌వ‌ల‌పై కాళ్లేసిన సునీల్!

Spread the love

వైసీపీ నేత చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ ఊగిస‌లాట‌లో ఉన్నారు. తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. టీడీపీ నేత‌లు ఆయ‌న మీద పెద్ద స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నారు. త‌క్ష‌ణం పార్టీ మారాల‌ని కోరుతున్న‌ట్టు తెలుస్తోంది. కానీ సునీల్ మాత్రం ఆచితూచి అడుగులేయాల‌ని చూస్తున్నారు. వాస్త‌వానికి ఆయ‌న వైసీపీ ని వీడిపోవాల‌ని దాదాపుగా నిర్ణ‌యించుకున్నారు. కానీ తెలుగుదేశంలో త‌న భ‌విష్య‌త్తు మీద క‌ల‌వ‌ర‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. వైసీపీ నేత‌లు కూడా ఆయ‌న్ని బుజ్జ‌గించాల‌ని ఓ ద‌శ‌లో ప్ర‌య‌త్నించినా ప్ర‌స్తుతం మాత్రం పూర్తిగా సునీల్ నిర్ణ‌యానికే వ‌దిలిపెట్టామ‌ని చెబుతున్నారు.

విదేశాల్లో వ్యాపారాలు చేసి 2009లో చ‌ల‌మ‌ల‌శెట్టి సునీల్ రాజ‌కీయ తెరంగేట్రం చేశారు. అప్పుడు ప్ర‌జారాజ్యం పార్టీ ద్వారా ఆయ‌న ఎన్నిక‌ల రంగంలో దిగారు. కాకినాడ ఎంపీ సీటుకి పోటీ చేశారు. గ‌ట్టి పోటీ ఎద‌ర్కొని ఎంఎం ప‌ళ్లంరాజు చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత వైసీపీలో చేరారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో తోట న‌ర‌సింహం చేతిలో అతి స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. కేవ‌లం 2,300 ఓట్లు తేడాతో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. ఆ త‌ర్వాత కూడా వైసీపీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయినా ఆయ‌న సంతృప్తిగా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల కొంద‌రు నేత‌ల‌తో నిత్యం త‌గాదా త‌ప్ప‌డం లేదు. పైగా ఆయ‌న కోరిన‌ట్టు జ‌గ‌న్ కూడా అనేక విష‌యాల్లో అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా జ‌గ్గంపేట ఎమ్మెల్యే సీటుని త‌న స‌మీప బంధువు ముత్యాల శ్రీనివాస్ కి కేటాయించాల‌ని సునీల్ కోరుతున్నారు. కానీ జ‌గ‌న్ అంచ‌నాలు వేరుగా ఉన్నాయి. దాంతో అక్క‌డ నుంచి కొత్త నేత కోసం జ‌గ‌న్ వెదుకుతున్నారు. దాంతో కింద స్థాయి నేత‌ల‌తో విబేధాలు, అధినేత వ‌ద్ద త‌న మాట చెల్లుబాటు కాక‌పోవ‌డంతో చ‌ల‌మ‌ల‌శెట్టి ఇక చెక్కేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

అయితే తెలుగుదేశం నేత‌లు మాత్రం ఆయ‌న్ని బ‌ల‌ప‌శువుని చేయాల‌ని చూస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో మూడో అభ్య‌ర్థిగా బ‌రిలో దింపే యోచ‌న‌లో ఉన్న‌ట్టు ఇప్ప‌టికే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అదే జ‌రిగితే సునీల్ కి మ‌రో ప‌రాభ‌వం త‌ప్ప‌దు. ఇప్ప‌టికే రెండు ఓట‌ముల‌తో నిరాశ‌తో ఉన్న ఆయ‌న‌కి మూడో ఓట‌మి కెరీర్ ప‌రంగా అడ్డంకి అవుతుంది. అందుకుతోడు రాజ్య‌స‌భ సీటులో ఓట‌మి పాల‌యినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాకినాడ ఎంపీ సీటు ఆయ‌న‌కే ఖాయం చేయ‌డానికి టీడీపీ అధినేత ఆఫ‌ర్ ఇచ్చారు. అయినా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పొత్తుల నేప‌థ్యంలో కాకినాడ సీటు జ‌న‌సేన‌కి పోతే త‌న ప‌రిస్థితి ఏమిట‌నే బెంగ సునీల్ లో క‌నిపిస్తోంది. దాంతో టీడీపీ వైపు వెళ్లాలా లేదా అనే విష‌యంలో ఆయ‌న ఎటూ తేల్చుకోలేక స‌త‌మ‌తం అవుతున్నారు. చివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అన్న‌ది స‌న్నిహితుల‌కు కూడా అంతుబ‌ట్ట‌కుండా ఉంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం రాజ‌కీయంగా సునీల్ భ‌విత‌వ్యానికి కీల‌కంగా మార‌బోతోంది.


Related News

ఫిబ్ర‌వ‌రి నాటికి క్లారిటీ వ‌స్తుందంటున్న ప‌వ‌న్

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌ర్య‌ట‌న‌లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ఉత్త‌రాంధ్ర‌, గోదావ‌రి జిల్లాల యాత్ర‌లు ముగించుకుని ప్ర‌స్తుతం రాయ‌ల‌సీమ‌లోRead More

ఆపార్టీలోనే చేర‌తానంటున్న వ‌ట్టి

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌ల్లో ఒక‌రిగా పేరున్న వ‌ట్టి వ‌సంత‌కుమార్ కి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో గ‌ట్టిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *