కాపు రిజర్వేషన్ల ఆశలపై నీళ్లు

27867945_10215477045429638_4316365088556153583_n
Spread the love

కాపు రిజర్వేషన్లకు మళ్లీ బ్రేక్ పడింది. చంద్రబాబు ఆడంబరంగా ప్రకటించిన 5శాతం రిజర్వేషన్లు అసలు సాధ్యం కాదని తేలిపోయింది. 50శాతానికి మించి రిజర్వేషన్లు సాధ్యం కాదని కేంద్రం తేల్చేసింది. దాంతో ఏపీలో కాపులను బీసీల్లో చేరుస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లుబాటు కాదని తేలిపోయింది. ఈ విషయంలో కేంద్రం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఈ విషయాన్ని స్పష్టం చేసేసింది. 50శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తామనడం మోసగించడమేనని గతంలో మోడీ గుజరాత్ ఎన్నికల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అప్పుడే చాలామంది కాపు రిజర్వేషన్ల తీర్మానం గురించి అనుమానం వ్యక్తం చేశారు. ఉపయోగపడే నిర్ణయం కాదని వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు మాత్రం కాపుల పట్ల టీడీపీ చిత్తశుద్ధితో రిజర్వేషన్ల ప్రకటన చేసిందని, 9 వ షెడ్యూల్ లో పెట్టడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. కానీ తీరా చూస్తే చంద్రబాబు ఆశించిన దానికి భిన్నంగా, గతంలో మోడీ చేసిన ప్రకటనకు తగ్గట్టుగానే కేంద్రం కౌంటర్ లేఖ పంపించింది. కాపుల రిజర్వేషన్ల విషయంలో 50శాతానికి మించి అవకాశం లేదని తేల్చేసింది.

దాంతో చంద్రబాబుకి ఇప్పుడు రాజకీయంగా సమస్య ఏర్పడబోతోంది. వాస్తవానికి ఆయన ఈ తప్పిదాన్ని కేంద్రంలోని బీజేపీ మీద నెట్టడానికి తగ్గట్టుగా పథక రచన చేశారు. కాపులను బీసీలుగా అంగీకరిస్తూ అదనంగా చేసిన 5శాతం రిజర్వేషన్లు అంగీకరించదని ఆయన ముందుగానే అంచనా వేశారు. అయితే టీడీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసినా కేంద్రం సహకరించలేదనే అభిప్రాయం రావడానికి తగ్గట్టుగా ఆయన విపక్షం లేని అసెంబ్లీ సమావేశాలను ఆయుధంగా మలచుకున్నారు. అదేసమయంలో ఇప్పటికే ఏపీకి కేంద్రం తగిన సహాయం అందించడం లేదనే వాదన బలపడుతున్న నేపథ్యంలో తాజాగా కాపు రిజర్వేషన్ల విషయంలో కూడా ఏపీ ప్రతిపాదనలను తోసిపుచ్చింది.

ఇది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. తెలుగుదేశానికి కొత్త తలనొప్పులు ఖాయంగా పలువురు భావిస్తున్నారు. సాధ్యం కాదని తెలిసినా చంద్రబాబు కుయత్నం చేశారని కొందరు విమర్శిస్తున్నారు. దాంతో ముద్రగడ పద్మనాభం ఉద్యమం మరోసారి తెరమీదకు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. దీని నుంచి గట్టెక్కే యత్నంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.


Related News

chinthamaneni

చిక్కుల్లో చింత‌మ‌నేని

Spread the loveవివాదాస్ప‌ద ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ను స‌మ‌స్య‌లు చుట్టుముడుతున్నాయి. ఐదేళ్ల క్రితం నాటి ఓ కేసు ఆయ‌నRead More

thota chandrasekhar

పవన్ కళ్యాణ్ గూటిలో జగన్ అనుచరుడు

Spread the loveజనసేన అధినేత జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ సమావేశం ముగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీదRead More

 • కాపు రిజర్వేషన్ల ఆశలపై నీళ్లు
 • టీడీపీలో రాజుకున్న అంతర్యుద్ధం
 • వీధికెక్కిన జనసేన విబేధాలు
 • వైసీపీపై అలిగిన మాజీ మంత్రి
 • వైసీపీ సీనియర్ కి వలవేసిన టీడీపీ
 • వైసీపీకి చేతగానిది..కాంగ్రెస్ చేస్తోంది..
 • టీడీపీలో చిచ్చుపెట్టిన జన్మభూమి
 • బాబు మాటలతో ఎమ్మెల్యేల బేజారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *