Main Menu

హ‌ర్ష‌కుమార్ కి అలా… స‌బ్బం హ‌రికి ఇలా!

Spread the love

తెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్య నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏకంగా కాళ్లు మొక్కిన నేత‌ల‌ను కూడా క‌నిక‌రించ‌లేదు. జ‌గ‌న్ బాట‌లో సాగిన‌ట్టుగా క‌నిపించింది. చివ‌రి నిమిషంలో పార్టీలు మారిన ప‌లువురు పెద్ద త‌ల‌కాయ‌ల‌ను జ‌గ‌న్ లెక్క‌చేయ‌లేదు. సీనియ‌ర్ల‌ను సైతం ప‌క్క‌న పెట్టేశారు. అదే దారిలో చంద్ర‌బాబు కూడా వ్య‌వ‌హ‌రించారు. అయితే ఇంకా పార్టీలో చేర‌ని నేత‌కు టికెట్ కేటాయించ‌డం మాత్రం విస్మ‌య‌క‌రంగా మారింది.

అమ‌లాపురం మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. సుదీర్ఘ‌కాలంగా తాను ఎవ‌రిని వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారో, అదే చంద్ర‌బాబు కాళ్లు కూడా మొక్కారు. అయినా క‌నిక‌రించ‌లేదు. ఆఖ‌రికి అమ‌లాపురం అసెంబ్లీ సీటు ఇస్తామ‌ని చెప్పినా దానికి కూడా మొండిచేయి చూపారు. చంద్ర‌బాబుని తాను ఇన్నాళ్లు ఒక‌వైపే చూశాన‌ని చెప్పుకొచ్చిన హ‌ర్ష‌కుమార్ కి టీడీపీ అధినేత అస‌లు ఝ‌ల‌క్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు హ‌ర్ష‌కుమార్ ఖంగుతినాల్సి వ‌చ్చింది. ఈ ప‌రిణామం ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో అస‌లు పెద్ద హ‌ర్డిల్ గా మారింది.

అదే స‌మయంలో తెలుగుదేశం పార్టీలో చేర‌కుండానే ఒక‌నాటి హ‌ర్ష‌కుమార్ స‌హ‌చ‌రుడు స‌బ్బం హ‌రికి టికెట్ ద‌క్కింది. టీడీపీ వాణీ వినిపిస్తున్న‌ప్ప‌టికీ నేరుగా పార్టీ స‌భ్య‌త్వం తీసుకున్న దాఖ‌లాలు లేవు. అయినా స‌బ్బం హ‌రి భీమిలి అభ్య‌ర్థిత్వం ఖ‌రారు చేసుకున్నారు. ఆయ‌న తొలుత విశాఖ ఉత్త‌రం, అన‌కాప‌ల్లి ఎంపీ, మాడుగుల ఎమ్మెల్యే సీట్లు ఆశించారు. కానీ ఆయ‌న‌కు చివ‌ర‌కు భీమిలి ద‌క్కింది. అక్క‌డ ఏమేర‌కు ముంద‌డుగు వేయ‌గ‌ల‌ర‌న్న‌ది సందేహంగా క‌నిపిస్తోంది. అయినా హ‌ర్ష‌కుమార్ మొండిచేయి చూపి, హ‌రికి టికెట్ ఇవ్వ‌డం వెనుక చంద్ర‌బాబు వ్యూహాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.






Related News

గెలిచినా అది మానేది లేదంటున్న నాగ‌బాబు!

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోద‌రుడు ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో న‌ర్సాపురం ఎంపీ సీటుకి పోటీ ప‌డిన సంగ‌తిRead More

Latest Survey: ప‌గోలో ఎవ‌రిది పై చేయి?

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు ప్ర‌త్యేక ప్ర‌ధాన్య‌త ఉంది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ హ‌వాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *