Main Menu

అయ్యో..బుచ్చ‌య్య‌కి హ్యాండిస్తున్న‌ట్టేనా!

Spread the love

తెలుగుదేశం పార్టీలో ఆయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు. స్వ‌యంగా ఆయ‌న చెప్పుకున్న మాట‌ల ప్ర‌కారం చెప్పాలంటే టీడీపీలో చంద్ర‌బాబు క‌న్నా ఆయ‌నే సీన‌యర్. పార్టీ అవిర్భావం నాటి నుంచి 8 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి 5మార్లు విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌రంగా మారే ప్ర‌మాదం దాపురిస్తోంది. ఆయ‌న‌కు అవ‌కాశం అనుమానంగా మారుతోంది.

వాస్త‌వానికి రాజ‌మండ్రి అర్బ‌న్ సీటు నుంచి పోటీ చేయాల‌ని బుచ్చయ్య ఆశించారు. గ‌త ఎన్నిక‌ల్లో కూడా బీజేపీ పొత్తులో భాగంగా సిటీ సీటు క‌మ‌లానికి కేటాయించ‌డంతో బుచ్చ‌య్య రూర‌ల్ వెళ్లాల్సి వ‌చ్చింది. ఇకిప్పుడు బీజేపీతో బ్రేక‌ప్ అయిన త‌ర్వాత సిటీ త‌న‌దేన‌నే ధీమాలో ఆయ‌నుండేవారు. కానీ పార్టీ అదినేత చంద్ర‌బాబు ఆలోచ‌న వేరుగా ఉంది. బుచ్చ‌య్య‌ను ప‌రిమితం చేయాల‌నే ప్ర‌య‌త్నంలో టీడీపీ అధిష్టానం ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే అర్బ‌న్ సీటు ఆయ‌న‌కు సాధ్యం కాద‌ని చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది.

దాంతో మ‌రోసారి తాను రూర‌ల్ సీటుకే పోటీ చేస్తాన‌ని స్వ‌యంగా బుచ్చ‌య్య ప్ర‌క‌టించుకున్నారు. అయితే రూర‌ల్ సీటు కూడా ఆయ‌న‌కు అనుమాన‌మేన‌ని చెప్ప‌వ‌చ్చు. బుచ్చ‌య్య‌కు చంద్ర‌బాబుతో స‌న్నిహిత సంబంధాలు క‌నిపించ‌డం లేదు. మంత్రిప‌ద‌వి కేటాయించ‌క‌పోవ‌డంతో గ‌త ఏడాది ఆయ‌న క‌స్సుమ‌న్నారు. ఏకంగా టీడీపీని ఆయారాం..గ‌యారాంల పార్టీగా మార్చేశార‌ని మండిప‌డ్డారు. అయినా చంద్ర‌బాబు చ‌లించ‌లేదు. చివ‌ర‌కు ఇప్పుడు అర్బ‌న్ స్థానంలో అడ్డుక‌ట్ట వేసి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా చైర్మ‌న్ గ‌న్ని కృష్ణ‌ల‌ను ఇన్ఛార్జ్ లుగా నియ‌మించారు. దాంతో రూర‌ల్ మీద ఆశాభావంతో క‌నిపిస్తున్న బుచ్చ‌య్య‌కు అక్క‌డ గండిప‌డ‌కుండా చూసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా అర్బ‌న్ సీటు గ‌న్ని కృష్ణ‌కు కేటాయించిన ప‌క్షంలో బుచ్చ‌య్య ఆశ వ‌దులు కోవాల్సిందే. రెండు స్థానాలు క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి కేటాయించే అవ‌కాశం ఖ‌చ్చితంగా ఉండ‌దు. దాంతో సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన గోరంట్ల ఇక ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల్సి వ‌స్తుందేమోన‌నే అభిప్రాయం వినిపిస్తోంది.






Related News

వైసీపీ నుంచి మ‌రో నేత అవుట్

Spread the loveవైసీపీ నుంచి మ‌రో నేత జారిపోయారు. జ‌న‌సేన వైపు ప‌య‌నిస్తున్నారు. త్వ‌ర‌లోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్Read More

జనసేనలోకి వైెఎస్ అనుచరుడు

Spread the loveతూర్పు గోదావరి జిల్లాలో జనసేనలోకి వలసల పర్వం సాగుతోంది. పలువురు మాజీలు ఆపార్టీలోకి క్యూ కడుతున్నారు. తాజాగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *