తాడేపల్లిగూడెం తగాదాకి మూలం అక్కడే!

తాడేపల్లిగూడెంలో వేడి రాజుకుంది. మాజీ మంత్రి, జెడ్పీ చైర్మన్ మధ్య వివాదంతో వేడెక్కింది. నాలుగేళ్ల పాటు మిత్రపక్షాలగా ఉన్నప్పటికీ తాడేపల్లిగూడెంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించలేదు. నిత్యం పైడికొండల మాణిక్యాలరావుతో టీడీపీ నేత ముళ్లపూడి బాపిరాజుకే తగాదా కొనసాగేది. అయితే బీజేపీ నుంచి మంత్రిగా ఉండడంతో మాణిక్యాలరావు మాట చెల్లుబాటయ్యేది.
గత ఆరు నెలలుగా మంత్రి పదవి పోవడంతో మాణిక్యాలరావు మాటను ఖాతరు చేసే వాళ్లే లేకపోయారు. దాంతో అభివృద్ధి విషయంలో మాజీ మంత్రికి, జెడ్పీ చైర్మన్ కి మధ్య ఉన్న వివాదం మరింత రాజుకుంది. చివరకు బహిరంగ చర్చ పేరుతో ఇరువురు నేతలు సవాళ్లకు సిద్ధపడడంతో అరెస్టులు, అడ్డగింతలు, గోడదూకడం, గందరగోళంతో కలకలం రేగింది. చివరకు తాడేపల్లిగూడెం పోలీసులకు ఈ పరిణామం చెమటలు పట్టించింది.
వెంకట్రామగూడెంలో బహిరంగ చర్చకు సిద్ధమంటూ బాపిరాజు సవాల్ చేయడం , మాణిక్యాలరావు సై అనడంతో వ్యవహారం చినికిచినికి గాలివానలా మారింది. అయితే పోలీసుల జోక్యంతో కాస్త చల్లారినప్పటికీ గత ఎన్నికల్లో టికెట్ దక్కకుండా చేశారన్న దుగ్ధతో రగిలిపోతున్న బాపిరాజుతో మాణిక్యాలరావు వివాదం ఇప్పుడిప్పుడే చల్లారే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.
Related News

చింతమనేని వీడియో: మార్ఫింగ్ ఎక్కడా?
Spread the loveదెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని మాటలు మంటలు రేపాయి. చంద్రబాబు సర్కారుని చిక్కుల్లో నెట్టాయి. ఎస్సీలRead More

బాబుకి తలనొప్పిగా మారిన నోటిదురుసు ఎమ్మెల్యే
Spread the loveఏపీ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ వ్యవహారం నిత్యం సంచలనంగానే ఉంటుంది. ఆయన నోరు, చేతలు కూడాRead More