Main Menu

చింత‌మ‌నేనిపై సినీ న‌టి

Spread the love

టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌ళ్లీ వివాదాల్లోకి వ‌చ్చారు. ఈసారి ఆయ‌న తీరు మీద ఓ సినీ న‌టి ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. చింత‌మ‌నేని అనుచ‌రులు త‌న‌ను వేధిస్తున్నారంటూ ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం అటు టాలీవుడ్, ఇటు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

సినీ న‌టి అపూర్వ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చింత‌మ‌నేని మీద సీరియ‌స్ కామెంట్స్ చేశారు. చంద్ర‌బాబు పాల‌న‌కు వ్య‌తిరేకంగా ఆమె వ్యాఖ్య‌లున్నాయి. క‌మ్మ సామాజిక‌వ‌ర్గం త‌ల‌వంచుకునేలా చంద్ర‌బాబు పాల‌న ఉందంటూ అదే సామాజిక‌వ‌ర్గానికి చెందిన అపూర్వ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశాల‌య్యాయి. ఆ సంద‌ర్భంగానే చింత‌మ‌నేని వంటి వారిని క‌ట్ట‌డి చేయ‌కుండా, చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేని ప‌రిస్థితి తీసుకొచ్చార‌ని మండిప‌డ్డారు.

దాంతో చింత‌మ‌నేని అనుచ‌రుల‌కు ఆగ్ర‌హం వ‌చ్చింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా అపూర్వ చేసిన కామెంట్స్ తో ఆమెను ట్రోల్ చేసే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. దాంతో ఆమె చివ‌ర‌కు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారని సినీ నటి అపూర్వ సైబర్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఈ సంద‌ర్భంగా మీడియా ముందు ఆపూర్వ త‌న ఆవేద‌న వెలిబుచ్చారు. సోషల్ మీడియాలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఎమ్మెల్యే చింతమనేని మంచి వ్యక్తి అంటూనే అనుచరులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించ‌డం విశేషం. ఆరోపణల్లో ఒక్కటి నిజం ఉన్నా, తనను నడి రోడ్డుపై ఉరి తీయవచ్చన్నారు. మానసికంగా వేధిస్తున్న వారిపై చర్య తీసుకోవాల్సిందిగా తాను సైబర్ క్రైమ్ పోలీసులను కోరానని ఆమె చెప్పారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన అనుచరులు వేధిస్తున్నారని అపూర్వ మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు.






Related News

మ‌ళ్లీ చింత‌మ‌నేని ప్ర‌తాపం..!

Spread the loveప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు ఎంఎల్‌ఎ, ప్రభుత్వ విప్‌, చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి రైతుల‌పైRead More

బాబు ప‌రిచ‌యం చేసిన నాయ‌కురాలే..షాకిచ్చింది

Spread the loveఏపీ సీఎం కి ఇటీవ‌ల పరిస్థితులు క‌లిసిరావ‌డం లేదు. అన్నింటా అన‌నుకూల ఫ‌లితాలే ఎదుర‌వుతున్నాయి. తాజాగా కాకినాడ‌లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *