ఏపీకి ఇది అన్యాయం కదా..

train
Spread the love

ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేయడానికే కేంద్రం కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. అనేక భారీ ప్రాజెక్టులే కాదు..చిన్న చిన్న అంశాలను కూడా ఛీ పొమ్మంటోంది. ఏపీకి టోపీ పెట్టిన అనుభవంతో తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రత్యేక హోదా విషయంలోనూ, రైల్వే జోన్ వ్యవహారంలోనూ ఆంధ్రప్రదేశ్ లపై నీళ్లు జల్లిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి అలాంటి నిర్ణయమే ప్రకటించింది. దానికి టీడీపీ ప్రభుత్వ వైపల్యం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. కేంద్రం పదే పదే తనకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నా నిలదీసి అడగలేని టీడీపీ నాయకత్వ వైపల్యం ఏపీకి అన్యాయం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.

తాజాగా గోదావరి జిల్లాల్లో కీలక కేంద్రం కాకినాడను మెయిన్ లైన్ లో కలపాలన్న డిమాండ్ ను కేంద్రం తోసిపుచ్చింది. తాత్కాలికంగా ఆ ప్రతిపాదనను ఆంబుయెన్స్ లో పెడుతున్నట్టు ప్రకటించింది. కేంద్ర రైల్వేశాఖ నిర్ణయంతో కాకినాడ వాసుల కలలు కల్లలు కాబోతున్నాయి. ఇప్పటికే సామర్లకోట నుంచి కాకినాడకు రైల్వే లైన్ ఉంది. దానిని పిఠాపురం వరకూ పొడిగిస్తే జిల్లా కేంద్రం కాకినాడ మెయిన్ లైన్ లోకి వచ్చేస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంత నగరం, స్మార్ట్ సిటీ , పారిశ్రామికంగా పురోభివ్రుద్ధిలో ఉన్న నగరాన్ని మెయిల్ లైన్ లో కలుపుతామని ఎన్నికల నాడు టీడీపీ, బీజేపీ రెండు పార్టీల నేతలు ప్రచారం చేశాయి. నిధులు కూడా కేటాయిస్తున్నామని కాకినాడ ఎంపీ తోట నరసింహం ప్రకటనలు చేశారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు లాభదాయకం కాదంటూ ఆ ప్రాజెక్ట్ ని మూలకు నెట్టేయడం నిజంగా గోదావరి వాసులకు నిరాశకరమైన విషయం.

ఇప్పటికే రైల్వేజోన్ వ్యవహారం నీరుగార్చేశారు. ఇక ఇప్పుడు మరో ప్రధాన ప్రాజెక్ట్ ని కూడా కాదంటున్నారు. మొత్తంగా కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు సర్కారు తీరు అసలుకే ఎసరు తెచ్చేలా మారుతుందన్న అభిప్రాయానికి తగ్గట్టుగా నిర్ణయాలు కనిపిస్తున్నాయి.


Related News

west godavari

గోదారోళ్లకు చంద్రబాబు ద్రోహం చేశారా

Spread the loveఇదే ప్రశ్న ఉదయిస్తోంది. గోదావరి జిల్లా రైతాంగం ఇప్పుడు బిక్కమొఖాలు వేయాల్సి వస్తోంది. గోదావరి నదీ నీటిRead More

chinthamaneni

పశ్చిమలో టీడీపీకి ఎదురుదెబ్బ

Spread the loveతెలుగుదేశం పార్టీలో విబేధాలు చివరకు ముదిరి పాకాన పడుతున్నాయి. పలువురు కీలకనేతలు పార్టీని వీడాల్సి వస్తోంది. తాజాగాRead More

 • మళ్ళీ ఖాకీల మధ్య కాపు నేత
 • ఏపీకి ఇది అన్యాయం కదా..
 • బాబుతో పీతల సుజాత వైరం ముదిరింది…
 • యనమల సీన్ అయిపోయిందా..?
 • టీడీపీలో కుర్చీలాట‌
 • నీళ్లేవి బాబు..!
 • ఆర్ నారాయణ మూర్తిని అడ్డుకున్నారు
 • ముద్రగడ మాట మార్చేశారా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *