మళ్ళీ ఖాకీల మధ్య కాపు నేత

mudragada-and-wife
Spread the love

ఏపీలో మరోసారి కాపు కలకలం మొదలవుతోంది. కాపు ఉద్యమం మీద నిర్బంధానికే చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. రిజర్వేషన్ల మీద చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని నిలువురించాలనే సర్కారు నిర్ణయించింది. దానికి తగ్గట్టుగా ముద్రగడ స్వగ్రామం మరోసారి ఖాకీల మధ్య కాపు నేత అన్నట్టుగా మారిపోతోంది.

గతంలో అమరావతికి పాదయాత్ర అంటూ బయలుదేరిన ముద్రగడను ఆయన ఇంటి గేటు ముందే అడ్డుకున్నారు. సుమారు నెల రోజుల పాటు పోలీసుల మధ్య కిర్లంపూడి కనిపించింది. కానీ చివరకు ముద్రగడ యాత్రను అడ్డుకోలేకపోయారు. ఆయన తాను అనుకున్నట్టుగానే పోలీసులను చేధించి పాదయాత్ర ప్రారంభించారు. మధ్యలో అడ్డుకున్నప్పటికీ ముద్రగడ పంతమే నిలిచింది. అయినా ఈసారి పాదయాత్రను విరమించుకుని ఆత్మీయ పలకరింపు కోసం ముద్రగడ బయలుదేరారు. కోనసీమలో రెండు రోజుల పాటు కాపు నేతలను కలుసుకునే కార్యక్రమం రూపొందించారు. దానిని కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. ముద్రగడను ఎలాంటి యాత్రలకు అనుమతించేది లేదని చెబుతోంది.

దాంతో కాపు ఉద్యమం మీద ఖాకీలను ప్రయోగిస్తున్న నేపథ్యంలో కిర్లంపూడి మరోసారి కాక మీద కనిపిస్తోంది. ముద్రగడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే చర్చ మొదలయ్యింది.






Related News

chinarajapp

చినరాజప్ప సీటు మారుతోంది…

Spread the loveఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సీటు మారుతున్నారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచిRead More

tdp

తారస్థాయిలో టీడీపీ తగాదా

Spread the love తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని టిడిపిలో గ్రూపుల పోరు రోజురోజుకూ పెరుగుతోంది. గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీRead More

  • ఏపార్టీ అయినా సరే అంటున్న తోట మాటల్లో ఏముందో?
  • కష్టాలు కొనితెచ్చుకుంటున్న వైసీపీ
  • యనమల అవుట్..
  • 22వ వికెట్ పడింది…
  • సంక్షోభంలో టీడీపీ
  • వైసీపీది తప్పే…
  • టీడీపీ ఎమ్మెల్యేల కొట్లాట
  • ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *