Main Menu

వినోదంలో వైస్క్రీన్స్ న్యూ ట్రెండ్

Spread the love

వ్యాపార రంగంలో వినూత్న ఒరవడి వైస్క్రీన్స్‌. భారతదేశంలోనే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంస్థ వైస్క్రీన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌. దీని సృష్టికర్త రత్నకుమార్‌ యార్లగడ్డ. విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్లో రెండు మినిప్లెక్స్‌ థియేటర్లతో ప్రారంభమైన వైస్క్రీన్స్‌ ఇప్పుడు ఆధునిక, సంప్రదాయ కలయికగా ఆంధ్రప్రదేశ్‌ అంతటా వైఎస్‌టిడి సెంటర్ల రూపంలో వ్యాపార కార్యకలాపాల్ని విస్తరిస్తోంది. ప్రతి మండల కేంద్రంలో, నగర పంచాయతీల్లో, మండలాల్లో, మున్సిపాలిటీల్లో వైఎస్‌టిడి సెంటర్ల ఏర్పాటు కార్యక్రమం శరవేగంగా సాగుతోంది.

పెట్టుబడిదారుడికి పూర్తి భరోసా కల్పించడంలో ఇప్పటికే సక్సెస్‌ అయ్యింది వైస్క్రీన్స్‌.మండలానికో పారిశ్రామిక వేత్తని తయారు చేస్తూ, వేలాదిమంది యువతకి ఉపాధి అందించేందుకు కృషి చేస్తున్న వైస్క్రీన్స్‌తో ఎవరైనా భాగస్వాములు కావొచ్చు. ఇందుకు కావాల్సినదంతా వైఎస్‌టిడి సెంటర్ల నిర్మాణం కోసం ఎకరా నుంచి 3ఎకరాల వరకు స్థలం. స్థానికులు ఎవరైనా స్థలం అమ్మాలనుకున్నా లేదా లీజుకి ఇవ్వదలచుకున్నా కింది నెంబర్లకి సంప్రదించొచ్చు. ఫ్రాంచైజీ మరియు జాయింట్‌ వెంచర్‌కి కూడా అవకాశం ఉంటుంది.

2 మిని థియేటర్లు, మిని సూపర్‌ మార్కెట్లురిటైల్‌ బ్రాండ్స్‌, మీ సేవ సెంటర్‌, ఫుడ్‌ కోర్ట్‌బ్యాంక్‌ / ఎటిఎం, గేమింగ్‌ జోన్‌డిజిటల్‌ హెల్త్‌ సెంటర్‌బిజినెస్‌ సెంటర్‌e- లెర్నింగ్‌ వైస్క్రీన్స్‌ ప్రస్థానంగ్రామీణ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసేందుకు ఆవిర్భవించిన వైస్క్రీన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌ సంస్థ…దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతూ రెండో వసంతంలో అడుగుపెట్టింది. గత ఏడాది జూన్‌ 6న విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్లో రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన

ఇవాళ్టికి మరో 19 సెంటర్లలో నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకుంది. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో 600 గజాల స్థలంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన వైస్క్రీన్స్‌ ఇవాళ కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకి మోడల్‌ ప్రాజెక్ట్‌గా మారింది. భారతదేశంలోనే తొలిసారిగా నూతన ఒరవడిని, నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చిన వైస్క్రీన్స్‌ ప్రాజెక్ట్‌ని పొరుగు రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసించారు. వలసలు కాదు..యువత ఎదగాలిఇదే వైవీ రత్నకుమార్‌ సంకల్పం గ్రామీణ యువభారతాన్ని పటిష్టం చేయాలనే దృఢసంకల్పంతో ముందుకెళుతున్నారు వైస్క్రీన్స్‌ అధినేత యార్లగడ్డ రత్నకుమార్‌. స్థానిక యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, ఉపాధి కోసం ఎక్కడికో వలసలు పోకుండా నిరోధించగలుగుతున్నారు.

వైస్క్రీన్స్‌తో ప్రభుత్వానికి ఆదాయంతక్కువ టిక్కెట్‌ రేటుతో ఎక్కువ వినోదాన్ని అందించడమే వైస్క్రీన్స్‌ లక్ష్యం. రాష్ట్రవ్యాప్తంగా మినిప్లెక్స్‌ థియేటర్ల ద్వారా వేలాదిమంది యువతకి ఉపాధినందించడం సమాంతరంగా సాగుతున్నాయి. సాధారణంగా పారిశ్రామిక వేత్తలకి ప్రభుత్వాలు రాయితీలు కల్పిస్తాయి. కాని ఇక్కడ రత్నకుమార్‌ కాన్సెప్ట్‌లో ప్రభుత్వానికి, యువతకి మేలు జరుగుతోంది. అదీ మామూలుగా కాదు. కోట్లాది రూపాయలు అద్దెలు, ట్యాక్స్‌ చెల్లింపుల ద్వారా ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్‌ వ్యక్తుల నిరర్థక ఆస్తుల్ని వినియోగించుకొని, వాటిని తన వ్యాపార నైపుణ్యతతో లాభాల బాట పట్టించాలనే కాన్సెప్ట్‌లో సక్సెస్‌ అయ్యారు.

670 మండలాల్లో YSTD సెంటర్లు..
ఆశించిన స్థాయిలో ఫలితాలను చూపిస్తూ… పెట్టుబడిదారుల్లో ఎప్పటికప్పుడు నూతనోత్సాహాన్ని నింపుతూ ప్రభుత్వ సహకారం తీసుకోకుండా శరవేగంగా దూసుకుపోతోంది వైస్క్రీన్స్‌. విద్య, యువత ఉపాధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ప్రోత్సాహం, టెక్నాలజీ అప్‌డేషన్‌పై దృష్టిపెడుతూ వైస్క్రీన్స్‌ కాస్త వై స్క్రీన్స్‌ ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లుగా (YSTD Centers) రూపాంతరం చెందింది. ఇన్వెస్టర్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ.. పెట్టుబడులకి జవాబుదారీగా నిలుస్తోంది. ఇప్పటికే ఏపీలో 45సెంటర్లకి మౌఖిక ఒప్పందాలు, 19 సెంటర్లలో రాతపూర్వక ఒప్పందాలు జరిగిపోయాయి. రానున్న కాలంలో ముందుగా 145 మేజర్‌ మున్సిపాల్టీ సెంటర్లలో, తర్వాత 175 ద్వితీయ శ్రేణి పట్టణాలు ఇలా మొత్తం 6 సంవత్సరాల కాలంలో 670 మండలాల్లో ట్రేడ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లను నిర్మిస్తామని ఘంటాపథంగా చెప్తున్నారు వైస్క్రీన్స్‌ సిఎండి యార్లగడ్డ రత్నకుమార్‌.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని 670మండలాల్లో 1000థియేటర్లు ఏర్పాటు చేసి మండలానికో పారిశ్రామికవేత్తని తయారు చేయాలన్నదే తన విజన్‌ అని వైస్క్రీన్స్‌ ఫౌండర్‌ అండ్‌ సిఎండి వైవీ రత్నకుమార్‌ చెప్పారు. తమ బిజినెస్‌ మోడల్‌కి ఆకర్షితులైన పలువురు ఇప్పటికే వైస్క్రీన్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు.

దేశంలోనే అతిపెద్ద సినిమా డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ యు.ఎఫ్‌.ఓ సైతం వైస్క్రీన్స్‌తో యుఎఫ్‌ఓ నోవాజ్‌ పేరుతో టెక్నాలజీ ఒప్పందం కుదుర్చుకుంది. 2020నాటికి రాష్ట్రవ్యాప్తంగా 239వైఎస్‌టిడి సెంటర్లు, 500 స్క్రీన్స్‌ ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. విజన్‌ 2020 లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోతున్నట్లు వైస్క్రీన్స్‌ ఫౌండర్‌ అండ్‌ సిఎండి వైవీ రత్నకుమార్‌ చెప్పారు. వైస్క్రీన్స్‌ మోడల్‌ని మెచ్చుకొని కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్రలాంటి రాష్ట్రాలు… తమ వైస్క్రీన్స్‌ని అనుసరిస్తున్నాయన్నారు. మరోవైపు వైస్క్రీన్స్‌ బిజినెస్‌ కార్యకలాపాలు త్వరలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరింపజేస్తున్నట్లు తెలిపారు.

రెండు రాష్ట్రాల్లో మొత్తం వెయ్యి థియేటర్లకి కావాల్సిన ఆర్థిక వనరులను సమీకరించుకోవడంలో ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతున్నామన్నారు. ఈ మేరకు తమపై నమ్మకం ఉంచిన భాగస్వాములకు అన్ని అనుమతుల్ని అనుకున్న సమయానికే సాధించిపెడుతున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంనుంచి సింగిల్‌ విండో అనుమతుల్ని సాధించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నట్లు డిజిటల్‌ ఇండియా టెక్నాలజీని వాడుకోవడంలో తమ వైస్క్రీన్స్‌ అగ్రభాగాన ఉందని చెప్పారు.


Related News

హ‌నీతో అందం..

Spread the loveమొటిమలు రావడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అలాగే సూర్యరశ్మి చర్మం మీద ఎక్కువగా పడటంRead More

నిద్ర సమయం కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ!

Spread the loveఉదయాన్నే నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్‌ తీసుకొని వాట్సప్‌ మెసేజ్‌లు చదవడం అలవాటా? రాత్రి పడుకునే ముందుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *