సత్య నాదెళ్ల ఫిదా స్టోరీ తెలుసా?

కట్టుకున్న భార్య కోసం తాను అమెరికా గ్రీన్‌కార్డుతో పాటు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థను కూడా వదులుకొనేందుకు సిద్ధపడినట్టుగా ఆ సంస్థ సీఈవో ప్రవాస భారతీయుడు సత్యా నాదెళ్ల తాజాగా వెల్లడించారు. నాదెళ్లకు 1993లో అనూతో వివాహమైంది. వివాహానంతరం ఆయన అనూను తనతో పాటు అమెరికాకు తీసుకుపోయి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. కానీ అమెరికాలో ఉన్న వీసా నిబంధనల ప్రకారం గ్రీన్‌కార్డు హోల్డర్‌ను వివాహం చేసుకుంటే.. వారి భాగస్వామి హెచ్1బీ వీసాకు కొత పడుతుంది. ఈ నిబంధన కారణంగా అనూ అమెరికాకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం పట్ల ఎంతో కలత చెందిన నాదెళ్ల తన భార్య అనూ కోసం గ్రీన్‌కార్డుతో పాటుగా తాను పని చేస్తున్న సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను వదులుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈ విషయాన్ని ఆయన తాజాగా విడుదలైన తన ‘హిట్ రీఫ్రెష్’ పుస్తకంలో పేర్కొన్నారు.
ఒక సంఘటనతో హీరో అయిపోయా..
తన భార్య అనూను ఎలాగైనా అమెరికాకు తీసుకు వచ్చేందుకు గల అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తాను ఒక మెట్టుదిగి గ్రీన్‌కార్డు హోదాను వదులుకొని హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిపారు. 1994లో తాను తిరిగి భారత్‌కు వచ్చి గ్రీన్‌కార్డు వదులుకొని.. హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న దౌత్య కార్యాలయ అధికారులు తన నిర్ణయం చూసి హతాశ్చర్యులవుతూనే నవ్వుకున్నారని ఆయన వివరించారు. తన పథకం ప్రకారం ఇద్దరికీ వీసా లభించడంతో అనూ తనతో పాటు అమెరికాకు రాగలిగిందని ఆయన అన్నారు. తాను బలంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగినందునే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మైక్రోసాఫ్ట్‌లో తన పేరు మారుమ్రోగిపోయిందని నాదేళ్ల పేర్కొన్నారు. కంపెనీలో ఎవరికి వీసా సమస్యలు వచ్చినా వారు తన వద్దకు వచ్చి సలహాలు తీసుకోవడం మొదలుపెట్టారని ఆయన అన్నారు. ఒక్క సంఘటన తనను మొత్తం మైక్రోసాఫ్ట్ సంస్థలో హీరోను చేసేసిందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు క్రికెట్ ఆడాలన్నదే కోరిక..
హైదారబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్)లో చదువుకున్న ప్రవాస తెలుగువాడు సత్యా నాదెళ్ల తనకు విద్యనేర్పిన పాఠశాల అంటే ఎంతో ఇష్టమని స్వీయ పుస్తకంలో రాసుకున్నారు. 12వ తరగతిలో ఉండగా హైదరాబాద్ కోసం క్రికెట్ ఆడడం.. ఒక మంచి బ్యాంకు ఉద్యోగం చూసుకొని స్థిరపడడమే తన జీవిత స్వప్నంగా ఉండేదని తెలిపారు. తన తండ్రి ప్రోద్బలంతోనే తాను విదేశాల్లో ఉద్యోగాల వైపు దృష్టి సారించానని తెలిపారు. ఇంజినీరింగ్ చేయడంతో ఉద్యోగాల నిమిత్తం పాశ్చాత్యానికి తరలడం వల్ల తన కోరికలు నెరవేకుండా పోయాయని ఆయన తెలిపారు. తన పాఠశాల నుంచి ఎంతో మంది ప్రముఖులుగా ఎదిగారని వారి పేర్లను తన పుస్తకంలో ప్రస్థావించడం విశేషం.
Related News

హనీతో అందం..
Spread the loveమొటిమలు రావడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అలాగే సూర్యరశ్మి చర్మం మీద ఎక్కువగా పడటంRead More

నిద్ర సమయం కంటే ఆన్లైన్లోనే ఎక్కువ!
Spread the loveఉదయాన్నే నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్ తీసుకొని వాట్సప్ మెసేజ్‌లు చదవడం అలవాటా? రాత్రి పడుకునే ముందుRead More