Main Menu

కండోమ్ వ‌ద్దంటున్నారు..

Spread the love

కొత్త‌త‌రం కొత్త ఆలోచ‌న‌లు చేస్తోంది. కండోమ్ లాంటి స‌హ‌జ ప‌ద్ధ‌తుల‌కు సెల‌వంటోంది. దాంతో కండోమ్స్ వినియోగం రానురాను త‌గ్గిపోతోంది. తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యం వెల్ల‌డ‌య్యింది. కేంద్ర ప్ర‌భుత్వ కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. శృంగార సమయంలో సంతృప్తి, భావప్రాప్తికి కండోమ్‌ను అడ్డుగా ప‌లువురు భావిస్తున్నారని చెబుతున్నారు, గర్భం రాకుండా ఉండేందుకు పిల్స్‌, కాపర్‌ టీ ఇంజెక్షన్లు, ట్యుబెక్టమీ, వెసక్టమీ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులకే మొగ్గు చూపుతున్నారు తప్ప భావప్రాప్తి విషయంలో రాజీపడట్లేదని ఈ స‌ర్వేలో వెల్ల‌డ‌య్యింది.. ఫలితంగా ఈ ఆరేళ్ల కాలంలో కండోమ్‌ల వినియోగం భారీగా తగ్గిపోయింది.

ఆస్పత్రులు, ఆశా కార్యకర్తల ద్వారా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే కండోమ్‌ల వినియోగం దేశంలోని 19 రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గిందని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయాన్ని తెలిపింది. 2011-12లో ప్రభుత్వం ఉచితంగా 59,61,251 కండోమ్‌లు సరఫరా చేయగా.. 2016-17లో వాటి సంఖ్య 45,76,642కు తగ్గిపోయింది.

అత్యధికంగా రాజస్థాన్‌లో 2011-12లో 10,84,700 కండోమ్‌లను వినియోగించగా.. 2016-17లో ఆ సంఖ్య 6,50,542కు తగ్గింది. కాగా.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం కండోమ్‌ల వినియోగం పెరగడం విశేషం. దాద్రా నగర్‌ హవేలీలో 2011-12లో 1,116 కండోమ్‌లు వినియోగించగా.. 2016-17లో ఆ సంఖ్య 2,680కి పెరిగింది.

దాంతో మ‌రోసారి ఇత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉంద‌నే ఆందోళ‌న మొద‌ల‌య్యింది. ముఖ్యంగా కండోమ్‌ల వినియోగం తగ్గడంతో ఎయిడ్స్‌, ఇతర సుఖవ్యాధులు విజృంభించే అవకాశం ఉందని ప‌లువురు భావిస్తున్నారు. . పిల్స్‌, కాపర్‌ టి వంటి ప్రత్యామ్నాయాలు గర్భం రాకుండా అడ్డుకుంటుంది కానీ సుఖవ్యాధులను నియంత్రించలేదు కదా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంద‌రు వ్యాపార‌వేత్త‌లు మాత్రం ఈ స‌ర్వేల‌ను విశ్వ‌సించ‌లేమ‌ని చెబుతుండ‌డం విశేషం. ఉచితంగా అందించే కండోమ్స్ లో క్వాలిటీ లేనందున వాటి వినియోగం త‌గ్గింద‌ని, అదే స‌మ‌యంలో ఆన్ లైన్ లో కూడా కండోమ్స్ కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంద‌ని చెబుతున్నారు.






Related News

హ‌నీతో అందం..

Spread the loveమొటిమలు రావడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అలాగే సూర్యరశ్మి చర్మం మీద ఎక్కువగా పడటంRead More

నిద్ర సమయం కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ!

Spread the loveఉదయాన్నే నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్‌ తీసుకొని వాట్సప్‌ మెసేజ్‌లు చదవడం అలవాటా? రాత్రి పడుకునే ముందుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *