Main Menu

ప్రపంచ అందగాడు మనవాడే…

Spread the love

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటీలు సాధించినప్పుడు ఎంత సందడి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. కానీ తాజాగా మన భారతీయుడు ప్రపంచ అందగాడికి నిలిచాడు. మిస్టర్ వరల్డ్ లిస్టులో టాప్ లో నిలిచాడు. అయినా పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడం విశేషంగా భావించాలి. బాలీవుడ్ స్టార్ హీరో హ్రుతిక్ రోషన్ ని ప్రపంచ అందగాడికి గుర్తిస్తూ ప్రకటన రావడమే కాకుండా. ఆ లిస్టులో సల్మాన్ ఖాన్ టాప్ 5లో ఉండడం విశేషంగా భావించాలి.

ఇప్పటికే ‘ఆసియన్‌ సెక్సియస్ట్‌ మేన్, మేన్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌’ వంటి టైటిల్స్‌ హృతిక్‌ రోషన్‌ తాజాగా ఖాతాలో ఉన్నాయి. తాజాగా ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ ఇచ్చిన ‘వరల్డ్‌ టాప్‌ టెన్‌ హ్యాండ్సమ్‌ హీరో’ల ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరడుగుల అందగాడైన ఈ హీరో ప్రముఖ హాలీవుడ్‌ నటులు రాబర్ట్‌ ప్యాటిన్సన్, క్రిస్‌ ఇవాన్స్‌లను వెనక్కి నెట్టి మరీ తొలి స్థానంలో నిలవడం విశేషం.

ఇంతవరకూ ఏ భారతీయుడూ సాధించని ఘనతను హృతిక్‌ సాధించాడంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి. పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు హృతిక్‌ని అభినందిస్తున్నారు. ఇక ఆయన ఫ్యాన్స్‌ ఆనందాలకు అవధుల్లేవు. మా హీరోనే అందగాడు అంటూ పండగ చేసుకుంటున్నారు. ప్రపంచ టాప్‌టెన్‌ హ్యాండ్సమ్‌ హీరోల్లో వరుసగా హృతిక్‌ రోషన్, రాబర్ట్‌ ప్యాటిన్సన్, గాడ్‌ఫ్రే గావో, క్రిస్‌ ఇవాన్స్, సల్మాన్‌ ఖాన్, డేవిడ్‌ బోరియానాజ్, నోవా మిల్స్, హెన్రీ కవిల్, టామ్‌ హిడిల్‌స్టన్, సామ్‌ హ్యూగన్‌ నిలిచారు.






Related News

హ‌నీతో అందం..

Spread the loveమొటిమలు రావడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అలాగే సూర్యరశ్మి చర్మం మీద ఎక్కువగా పడటంRead More

నిద్ర సమయం కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ!

Spread the loveఉదయాన్నే నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్‌ తీసుకొని వాట్సప్‌ మెసేజ్‌లు చదవడం అలవాటా? రాత్రి పడుకునే ముందుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *