అమెరికాను మించిన ఇండియా

fb
Spread the love

అమెరికాను భారత్‌ మించిపోయింది! ఔను.. ఫేస్‌బుక్‌ వాడకంలో అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది! భారత్‌లో ఫేస్‌బుక్‌ యూజర్ల సంఖ్య 24 కోట్ల 10 లక్షలకు చేరుకుంది. జూలై 13 నాటికి అమెరికాలో ఇది 24 కోట్లు కాగా.. భారత్‌ ఆ మార్కును దాటిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతినెలా 200 కోట్ల మంది వినియోగిస్తున్నారని ఫేస్‌బుక్‌ ప్రకటించిన కొన్ని రోజులకే టాప్‌ ర్యాంకింగ్‌లో మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.

గత ఆరు నెలల వ్యవధిలోనే భారత్‌లో ఫేస్‌బుక్‌ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 27 శాతం (5 కోట్ల మందికి పైగా) పెరిగింది. ఇదే కాలంలో అమెరికాలో 12 శాతం (2కోట్ల 60 లక్షల మంది) మాత్రమే పురోగతి కనిపించింది. భారత్‌లో ఫేస్‌బుక్‌ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా వేగం మాత్రం తక్కువగానే ఉంది. గతనెల దేశ జనాభాలో 19 శాతం మాత్రమే ఫేస్‌బుక్‌ వినియోగించారు. ఇది అమెరికాలో 72 శాతం, ప్రపంచసగటు 42శాతం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్‌లో సగం మంది యాక్టివ్‌ యూజర్లు 25 ఏళ్లలోపువారే.






Related News

yscreens

వినోదంలో వైస్క్రీన్స్ న్యూ ట్రెండ్

Spread the loveవ్యాపార రంగంలో వినూత్న ఒరవడి వైస్క్రీన్స్‌. భారతదేశంలోనే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంస్థ వైస్క్రీన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌Read More

satya nadella

సత్య నాదెళ్ల ఫిదా స్టోరీ తెలుసా?

Spread the loveకట్టుకున్న భార్య కోసం తాను అమెరికా గ్రీన్‌కార్డుతో పాటు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థను కూడా వదులుకొనేందుకుRead More

  • అమెరికాను మించిన ఇండియా
  • జుంబా..జుంబారే అంటున్న జ‌న‌రేష‌న్
  • తలైవాను కాపీ కొట్టిన ధోనీ..
  • ట్రంప్ వైఫ్ న్యూడ్ క‌వ‌ర్ స్టోరీ..!
  • పూన‌మ్ పాండే లేటెస్ట్ హాట్..!
  • ట్రంప్కు వ్యతిరేకంగా నగ్నం నిరసన…!
  • ఐటీలో ఉద్యోగాలు హాం ఫ‌ట్..!
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *