Main Menu

నిద్ర సమయం కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ!

Spread the love

ఉదయాన్నే నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్‌ తీసుకొని వాట్సప్‌ మెసేజ్‌లు చదవడం అలవాటా? రాత్రి పడుకునే ముందు కూడా స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉండాల్సిందేనా..? యువతరంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఇంకేం లేకున్నా బతికేస్తాం కానీ.. స్మార్ట్‌ ఫోన్‌ లేకుంటే, వాట్సప్‌ వాడకుంటే బతకలేం అనే స్థితికి వచ్చేశాం. రోజులో సగటున 200 సార్లు స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తున్నామట. అంటే ప్రతి ఆరున్నర నిమిషాలకు ఓసారైనా ఫోన్‌ చూడాల్సిందేనన్న మాట. 73 శాతం మంది బ్రిటిషర్లయితే రోజులో కనీసం ఒక్కసారైనా ఫోన్‌ లేదా కంప్యూటర్‌ చూడకుండా ఉండలేకపోతున్నారు.

మన యువతది కూడా దాదాపు అదే పరిస్థితి. నలుగురిలో ఒకరైతే నిద్రపోయే సమయం కంటే ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. దీన్ని బట్టే స్మార్ట్‌ ఫోన్‌కు మనం ఎంతగా బానిసలమయ్యామో అర్థం చేసుకోవచ్చు. ఇక 16 నుంచి 24 ఏండ్ల మధ్య వయసులో 70 శాతం మంది మాట్లాడం కంటే చాటింగ్‌ చేసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట. సగటున ఒక్కో టీనేజర్‌ బెడ్‌ మీది నుంచే నెలలో 3400 ఎలక్ట్రానిక్‌ మెసేజ్‌లను పంపిస్తున్నారట. వీటి వల్ల ఎన్ని సమస్యలు ఉన్నాయంటే..?

– పదే పదే వాట్సప్‌ మెసేజ్‌లను చెక్‌ చేయడం కోసం ఫోన్‌ చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. క్లాస్‌లో లెక్చరర్‌ చెప్పింది బుర్రకు ఎక్కదు. ఎదుటి వ్యక్తి చెప్పింది శ్రద్ధగా వినలేం.

– తను ఆన్‌లైన్‌లోనే ఉంది, కానీ రిప్లరు ఇవ్వట్లేదు, అంటే నన్ను పట్టించుకోవడం లేదనే తొందరపాటు అభిప్రాయాలకు వచ్చే వీలుంది. దీని వల్ల అనుబంధాలు దెబ్బతింటాయి.






Related News

హ‌నీతో అందం..

Spread the loveమొటిమలు రావడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అలాగే సూర్యరశ్మి చర్మం మీద ఎక్కువగా పడటంRead More

నిద్ర సమయం కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ!

Spread the loveఉదయాన్నే నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్‌ తీసుకొని వాట్సప్‌ మెసేజ్‌లు చదవడం అలవాటా? రాత్రి పడుకునే ముందుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *