Main Menu

హ‌నీతో అందం..

Spread the love

మొటిమలు రావడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అలాగే సూర్యరశ్మి చర్మం మీద ఎక్కువగా పడటం వల్ల కూడా నల్ల మచ్చలు ఏర్పడతాయి. అందుకే బయటకు వెళ్ళేటప్పుడు చర్మానికి సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ అప్లై చేసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడే కాదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మొటిమలు వాటి వల్ల కలిగే మచ్చల నుంచి విముక్తి చెందవచ్చు.

– చలి కాలం చర్మం ముడతలు పడి పొడిబారుతుంది. ఎన్ని మాయిశ్చరైజర్లు రాసిన ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు నెయ్యిని కాస్త వేడి చేసి చర్మానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొద్ది క్షణాల్లోనే చర్మం మృదువుగా మారుతుంది.

– మాయిశ్చరైజర్ల కన్నా నెయ్యిని చర్మ రంధ్రాలు త్వరగా పీల్చుకుంటాయి. నెయ్యి చాలా ఎక్కువ సమయం చర్మాన్ని డీహైడ్రేట్‌ చేయకుండా కాపాడుతుంది. మాయిశ్చరైజర్‌ వల్ల చర్మం త్వరగా పొడిబారుతుంది.

– చలికి చర్మం పొడిబారి ముడతలు పడటం, పెదాలు పగిలిపోవడం సహజం. ఈ సమస్యల నుండి చర్మాన్ని రక్షించుకోవాలంటే విటమిన్‌ ‘ఇ’ ఉండే నెయ్యిని తీసుకోవడం మంచిది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ముడతలు తగ్గించడంతో పాటు చర్మాన్ని యవ్వనంగా తయారు చేస్తుంది.

– ఐదు చెంచాల కొబ్బరి నూనెలో కొద్దిగా నెయ్యి కలిపి వేడి చేసుకోవాలి. ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడే చర్మానికి పట్టించాలి. అంటే స్నానం చేసేకంటే అరగంట ముందే చర్మానికి రాసుకోవాలి. తర్వాత స్నానం చేస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

– నిద్రలేమి, పని ఒత్తిడి వల్ల కండ్లు అలసినట్టు, నిర్జీవంగా కనిపిస్తాయి. కండ్లు అందంగా కనిపించాలంటే కొద్దిగా నెయ్యిని ఒక కప్పులో తీసుకొని మునివేళ్లతో కంటి చుట్టూ నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కంటి చుట్టూ ఉండే నలుపు రంగు, ముడతలు తగ్గుతాయి. అంతేకాదు పెదాలకు కూడా నెయ్యి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెదాలు మృదువుగా, లేత గులాబీ రంగులోకి మారతాయి.






Related News

హ‌నీతో అందం..

Spread the loveమొటిమలు రావడం వల్ల ముఖంపై నల్ల మచ్చలు ఏర్పడతాయి. అలాగే సూర్యరశ్మి చర్మం మీద ఎక్కువగా పడటంRead More

నిద్ర సమయం కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ!

Spread the loveఉదయాన్నే నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్‌ తీసుకొని వాట్సప్‌ మెసేజ్‌లు చదవడం అలవాటా? రాత్రి పడుకునే ముందుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *