Main Menu

ఈ కండోమ్ గ‌నుక వాడితే…

condom1
Spread the love

క‌ల‌ర్ మారే కండోమ్ గురించి మీకు తెలుసా…స‌మ‌స్య ను బ‌ట్టి స్పందించే కండోమ్ ఉంటే ప‌ని తేలిక అవుతుంది క‌దా…చాలా స‌మ‌స్య‌లు తీరిన‌ట్టే క‌దా. అందుకే ఆ యువ‌కులు అదే ఆలోచ‌న‌తో కొత్త ప‌రిశోధ‌న చేశారు. కండోమ్ వినియోగించిన‌ప్పుడే ప‌లు స‌మ‌స్య‌లు గుర్తించే రీతిలో తీర్చిదిద్దారు. త‌ద్వారా ప‌లు ఆరోగ్య స‌మ‌స్య‌లు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.

లైంగిక కలయిక ద్వారా సంక్రమించే వ్యాధులను గుర్తించడం ఈ కండోమ్స్ ప్ర‌త్యేక‌త‌. స‌మ‌స్య‌ను బ‌ట్టి రంగు మారే కొత్తరకం కండోమ్‌ను యూకే కిచెందిన కొంద‌రు స్కూలు విద్యార్థుల బృందం అభివృద్ధి చేయ‌డం విశేషంగా మారింది. ‘ఎస్‌.టి.ఈవైఈ’ గా వ్యవహరిస్తున్న ఈ కండోమ్‌ సిఫిలిస్‌ తదితర వ్యాధులలోని బ్యాక్టీరియాను గుర్తిస్తుంది. ఈ కండోమ్‌ క్లామీడియాను తాకితే ఆకుపచ్చ రంగుకు, హెర్పెస్ తాకితే పసుపు రంగుకు, పాపిల్లోమా వైరస్ తాకితే ఊదా రంగుకు, సిఫిలిస్‌ తాకితే పసుపు రంగుకుమారుతుంది. ఈ బ్యాక్టీరియాను తాకిన ప్రతిసారీ కండోమ్‌ రంగు మార్చుకుంటుంది. తద్వారా ఒకరినుంచి మరొకరికి లైంగిక వ్యాధులు సోకకుండా నిరోధించేలా, ఓ హెచ్చరికగా పనిచేసేందుకే ఈ కొత్తరకం కండోమ్‌ను తయారుచేసినట్లు యూకే బృందం పేర్కొంది.

ఈ కండోమ్ వాడ‌కం ద్వారా ప‌లు స‌మ‌స్య‌లకు దూరం కావ‌చ్చ‌ని వైద్యులు కూడా ధృవీక‌రిస్తున్నారు. ప‌లు ప‌రిశోధ‌న‌ల అనంత‌రం రూపొందించిన కండోమ్ మూలంగా బ్యాక్టిరీయా వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని చెబుతున్నారు. ఇక వైర‌స్ నియంత్ర‌ణ మీద ఈ ప‌రిశోధ‌న దృష్టిపెడ‌తామ‌ని చెబుతున్న నేప‌థ్యంలో ఆస‌క్తిగా మారింది. ఎయిడ్స్ లాంటి స‌మ‌స్య‌ల‌కు కూడా త్వ‌ర‌లో ప‌రిష్కారం ఉంటుంద‌నే ఆశాభావం వ్యక్తం అవుతోంది






Related News

condom1

ఈ కండోమ్ గ‌నుక వాడితే…

Spread the loveక‌ల‌ర్ మారే కండోమ్ గురించి మీకు తెలుసా…స‌మ‌స్య ను బ‌ట్టి స్పందించే కండోమ్ ఉంటే ప‌ని తేలికRead More

hruthik roshan

ప్రపంచ అందగాడు మనవాడే…

Spread the loveమిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటీలు సాధించినప్పుడు ఎంత సందడి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. కానీ తాజాగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *