ట్రంప్ వైఫ్ న్యూడ్ క‌వ‌ర్ స్టోరీ..!

melania trump
Spread the love

‘ది న్యూయార్క్‌ పోస్ట్‌’ టాబ్లాయిడ్‌ కవర్‌పేజీపై డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ న్యూడ్‌ ఫొటోలు ప్రచురించి అందరినీ షాక్‌కు గురిచేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న బిలియనీర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ మూడో భార్య మెలానియా ట్రంప్‌. ఈమె 1990ల్లో మోడలింగ్‌ చేసిన రోజుల నాటి ఫొటోలను ఆదివారం టాబ్లాయిడ్‌పై ప్రచురించడం చర్చకు దారితీసింది. నగ్న ఫొటోతో పాటు ‘ఇలాంటి పొటెన్షియల్‌ ఫస్ట్‌ లేడీని ఎప్పుడూ చూసి ఉండరు’ అని వ్యాఖ్యలు కూడా రాశారు. 1995లో మ్యానహట్టాన్‌లో మెలానియా ఓ ఫ్రెంచ్‌ మ్యాగజీన్‌ కోసం న్యూడ్‌ ఫొటోలు దిగారు. ఫ్రెంచ్‌ ఫొటోగ్రాఫర్‌ అలే డీ బస్సేవిల్లే తీసిన ఫొటోలను న్యూయార్క్‌ పోస్ట్‌ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించి ప్రచురించింది.

ఈ ఫొటోల గురించి ట్రంప్‌ను ప్రశ్నించగా.. ‘మెలానియా విజయవంతమైన మోడల్స్‌లో ఒకరు. కవర్‌పేజీలు, మ్యాగజీన్స్‌తో పాటుగా ఆమె చాలా ఫొటో షూట్స్‌ చేశారు. ఇది మెలానియా తనకు పరిచయం కాక ముందు ఓ యూరోపియన్‌ మ్యాగజీన్‌ కోసం దిగిన ఫొటో. యూరప్‌లో ఇలాంటి ఫొటోలు చాలా ఫ్యాషనబుల్‌, సాధారణమైనవి కూడా’ అని పేర్కొన్నారు. మెలానియా చాలా ప్రొఫెషనల్‌ అని.. ఆమె ఈ ఫొటో షూట్‌లో ఎలాంటి ఇబ్బంది పడలేదని.. ఫ్రెంచ్‌ ఫొటోగ్రాఫర్‌ బస్సేవిల్లే న్యూయార్క్‌ పోస్ట్‌కు తెలపడం గమనార్హం.
యూరప్‌లోని స్లోవేనియాకు చెందిన మెలానియా 1998లో జరిగిన న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ట్రంప్‌ను కలిశారు. 2005లో ఫ్లోరిడాలోని ట్రంప్‌ రిసార్ట్స్‌లో మెలానియా, ట్రంప్‌ల వివాహం జరిగింది. న్యూయార్క్‌ పోస్ట్‌ కవర్‌పేజీపై మెలానియా న్యూడ్‌ ఫొటో ప్రచురించడంపై తమకు ఎలాంటి సమస్య లేదని ట్రంప్‌ ప్రధాన సలహాదారు జాసన్‌ మిల్లెర్‌ వెల్లడించారు. అందులో ఇబ్బంది పడేదేమీ లేదని.. ఆమె అందమైన మహిళ అని అన్నారు.


Related News

condom1

ఈ కండోమ్ గ‌నుక వాడితే…

Spread the loveక‌ల‌ర్ మారే కండోమ్ గురించి మీకు తెలుసా…స‌మ‌స్య ను బ‌ట్టి స్పందించే కండోమ్ ఉంటే ప‌ని తేలికRead More

hruthik roshan

ప్రపంచ అందగాడు మనవాడే…

Spread the loveమిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటీలు సాధించినప్పుడు ఎంత సందడి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. కానీ తాజాగాRead More

 • ఆన్ లైన్ లో కండోమ్స్ కి ఆదరణ
 • వినోదంలో వైస్క్రీన్స్ న్యూ ట్రెండ్
 • సత్య నాదెళ్ల ఫిదా స్టోరీ తెలుసా?
 • అమెరికాను మించిన ఇండియా
 • జుంబా..జుంబారే అంటున్న జ‌న‌రేష‌న్
 • తలైవాను కాపీ కొట్టిన ధోనీ..
 • ట్రంప్ వైఫ్ న్యూడ్ క‌వ‌ర్ స్టోరీ..!
 • పూన‌మ్ పాండే లేటెస్ట్ హాట్..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *