Updateap

 

జ‌గ‌న్ ని వెన‌క్కి పంపించే య‌త్నం

jagan

వైఎస్సార్సీపీ అదినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి ప‌ట్ల పోలీసుల వైఖ‌రి విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. ఏకంగా ఎయిర్ పోర్ట్ లోనే నిలిపివేయ‌డంతో మొద‌ల‌యిన క‌ల‌క‌లం తీవ్ర ఉద్రిక్త‌త కొన‌సాగుతోంది. 6 గంట‌ల ప్రాంతంలో విశాఖ నుంచి హైద‌రాబాద్ కి ఉన్న రెండు ఎయిర్ పోర్ట్ ల‌లో ఏదో ఒక దానిలో జ‌గ‌న్ ని తిరిగిపంపించే ప్ర‌య‌త్నంలో పోలీసులున్నారు. రెండు గంట‌లుగా వైఎస్ జ‌గ‌న్ ఆధ్వ‌ర్యంలో ఎయిర్ పోర్ట్ లోనే ఆందోళ‌న సాగుతోంది. తొలుత ర‌న్ వేపై బైఠాయించిన జ‌గ‌న్ ను మ‌రో ఫ్లైట్ వ‌స్తుండ‌డంతో ఎయిర్ పోర్ట్ లోకి తీసుకొచ్చారు. అయితే అక్క‌డ లాంజ్ లోకి వెళ్ల‌కుండా అడ్డుకోవ‌డంపై నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇద్ద‌రు ఎంపీలున్న‌ప్ప‌టికీ హ‌క్కులు హ‌రించే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా ఎయిర్ పోర్ట్ స‌మీపంలో ప‌లువురు కార్య‌క‌ర్త‌లుRead More


నిర్బంధంలో జ‌గ‌న్

C3F2S63UcAAuoCt

విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కి పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం సాగింది. ర‌న్ వేపై బైఠాయించిన జ‌గ‌న్ ని అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. ఈసంద‌ర్బంగా అంబ‌టి రాంబాబు ప‌ట్ల దురుసుగా పోలీసులు ప్ర‌వ‌ర్తించ‌డం విశేషం. ఒక పోలీస్ ఏకంగా ఆయ‌న‌పై చేయి కూడా చేసుకోవ‌డంతో జ‌గ‌న్ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చే ప‌రిస్థితి వ‌చ్చింది. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కూడా పోలీసుల‌తో వాగ్వాదానికి దిగింది. త‌న‌ను నిర్బంధించ‌డం ద్వారా ప్ర‌భుత్వం రాజ‌కీయ హ‌క్కులు కాల‌రాస్తోంద‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. చ‌రిత్ర‌లో ఓ ప్ర‌తిప‌క్ష నేత‌ను ఈరీతిలో అరెస్ట్ చేయ‌డం ఇదే తొలిసారి అని మండిప‌డ్డారు. ఎట్లా వ్య‌వ‌హరించాలో తెలియ‌ని వాళ్లు పోలీసులుగా ఎలా ఉన్నారంటూ నిల‌దీశారు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎయిర్ పోర్ట్Read More


ర‌న్ వే పై బైఠాయించిన జ‌గ‌న్

jagan in airport

ఏపీ చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయం ఆవిష్కృత‌మ‌య్యింది. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మాన్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంది. విశాఖ‌లో అయితే ఏకంగా ర‌న్ వైపైనే పోలీసులు మోహ‌రించారు. దాంతో హైద‌రాబాద్ నుంచి వ‌చ్చిన జ‌గ‌న్ విశాఖ ఎయిర్ పోర్ట్ లో ర‌న్ వే పైనే బైఠాయించారు. ఎయిర్ పోర్ట్ ర‌న్ వే మీద చ‌రిత్ర‌లో తొలిసారిగా ఆందోళ‌న‌కు దిగారు. ఆయ‌న‌తో పాటు ఎంపీలు విజ‌య‌సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి స‌హా ప‌లువురు నేత‌లున్నారు. చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి కావ‌డం విశేషం. హైద‌రాబాద్ నుంచి విశాఖ వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న్ని అరెస్ట్ చేయ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నించారు. ఆ సంద‌ర్బంగా జ‌గ‌న్ వారిని ప్ర‌తిఘ‌టించి బైఠాయించారు. వుయ్ వాంంట్ స్పెష‌ల్ స్టేట‌స్ అంటూ నినాదాలు చేశారు. కొద్దిసేప‌ట్లో వైజాగ్ బీచ్ లో జ‌ర‌గాల్సిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొనాల్సిన జ‌గ‌న్ నుRead More


సుజ‌నా ని టార్గెట్ చేసిన నెటిజ‌న్లు..!

C3Ev3U5WgAAX_5r

కేంద్ర‌మంత్రికి నెటిజ‌న్లు షాకిస్తున్నారు. సుజ‌నా చౌద‌రి వ్యాఖ్య‌ల మీద తీవ్రంగా మండిప‌డుతున్నారు. పందుల పోటీలు పెట్టుకోండి కావాలంటే ..అంతే త‌ప్ప జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తి అంటూ మాట్లాడ‌వ‌ద్ద‌న్న మంత్రి తీరును దుయ్య‌బ‌డుతున్నారు. మంత్రి వ్య‌వ‌హార‌శైలిపై సెటైర్ల‌తో కూడా ఆగ్ర‌హాన్ని వెలిబుచ్చుతున్నారు. అగ్రిగోల్డ్ భూములను ఆక్ర‌మించుకున్న స్థ‌లంలో పందుల పోటీ నిర్వ‌హిద్దామా అంటూ ఒక‌రు..ప‌చ్చ‌చొక్కాల‌తో పందుల పోటీ పెడితే ఎలా ఉంటుందో అంటూ మ‌రొక‌రు ఇలా ర‌క‌ర‌కాల తీవ్ర వ్యాఖ్య‌లు కూడా ఎఫ్ బీ, ట్విట్ట‌ర్ల‌లో క‌నిపిస్తున్నాయి. మొన్న‌టి ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ధ‌తిచ్చి త‌ప్పు చేశామంటూ ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. జ‌న‌సేన అదినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా సుజ‌నా తీరును త‌ప్పుబ‌ట్టారు. వెట‌కారం చేసిన ఇలాంటి గ‌ల్లీ నేత‌ల నుంచి అంద‌రినీ గుర్తు పెట్టుకోవాల‌ని యువ‌త‌కు పిలుపునిచ్చారు.


విశాఖ బీచ్ కి చేరుకున్న ఆందోళ‌న‌

16195144_1731883243503833_5215699092181571647_n

పోలీసుల అంక్ష‌లు ప‌నిచేయ‌లేదు. అడ్డంకులు అదుపు చేయ‌లేక‌పోయాయి. ఆఖ‌రికి ఆందోళ‌న ఆర్కే బీచ్ కి చేరింది. ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి నాయ‌కులు చ‌ల‌సాని శ్రీనివాస్ స‌హా ప‌లువురు నేత‌లు బీచ్ కి చేరుకున్నారు. పోలీసుల క‌ళ్లుగ‌ప్పి బీచ్ లోకి రావ‌డంతో వెంట‌నే ఖాకీలు అప్ర‌మత్త‌మ‌య్యారు. నేత‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈసంద‌ర్భంగా ప్ర‌త్యేక హోదా కోసం నినాదాలిచ్చిన నేత‌లు బీచ్ లో జెండాలు పాతారు. జాతీయ జెండాల‌తో త‌మ ఆందోళ‌న తెలిపారు.


వెట‌కారం చేసిన నేత‌లంద‌రినీ గుర్తుపెట్టుకోండి

pawan

ప‌వ‌న్ ట్వీట్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కౌంట‌ర్ల వ‌ర్షం కురుస్తోంది. ఓవైపు టీడీపీ ఎంపీల‌ను విమ‌ర్శిస్తున్న వ‌ప‌న్ మ‌రోవైపు ప్ర‌భుత్వ వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుబ‌డుతున్నారు. పందుల పోటీతో యువ‌త పోరాటాన్ని పోల్చిన కేంద్ర‌మంత్రి సుజాన తీరును దుయ్య‌బ‌ట్టారు. మంత్రి స్థాయికి ఇలాంటి కువ్యాఖ్య‌లు త‌గ‌వ‌న్నారు. ప్ర‌భుత్వం ఈస్థాయిలో దిగ‌జారుతానంటే స‌రే కానివ్వండి అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్ర‌తీ యువ‌కుడు, యువ‌తి కూడా మ‌న‌ల్ని వెట‌కారం చేసే స్థాయి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఈ గ‌ల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వ‌ర‌కూ నాయ‌కులంద‌రినీ గుర్తు పెట్టుకోవాల‌ని ప్ర‌జలంద‌రికీ పిలుపునిచ్చారు.


ఉద్యమంపై మంత్రుల మూకుమ్మ‌డి దాడి..!

TDPFlag

ఏపీలో ప్ర‌త్యేక హోదా కోసం సాగుతున్న ఉద్య‌మంపై మంత్రులు మూకుమ్మ‌డి దాడికి దిగారు. హోదా వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని చెప్పుకొచ్చారు. కేంద్రమంత్రి సుజ‌నా చౌద‌రి అయితో మ‌రో అడుగు ముందుకేశారు. జ‌ల్లిక‌ట్టు స్ఫూర్తి అంటున్న వారంతా త‌మ‌కు ఇష్ట‌మైతే జ‌ల్లు క‌ట్టు ఆడుకోవాలంటూ స‌ల‌హా ఇచ్చారు. కోడిపందులు, పందుల పోటీలు ఆడుకోవాల‌ని సూచించారు. కేంద్రం ఇవ్వాల్సిన‌వ‌న్నీ ఇస్తోంద‌ని..అయినా ఎందుకు ఆందోళ‌నో అర్థం కావ‌డం లేద‌న్నారు. అభివృద్ధిని ఓర్వ‌లేక ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. మ‌రోమంత్రి గంటా శ్రీనివాస‌రావు కూడా జ‌గ‌న్ స‌హా విప‌క్షాల తీరు మీద విరుచుకుప‌డ్డారు. విశాఖ‌ల్లో విచ్ఛిన్నం చేయ‌డానికి కుట్ర సాగుతోంద‌న్నారు. అచ్చెన్నాయుడు కూడా ప్ర‌తిప‌క్షాల‌పై మండిప‌డ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. పెట్టుబ‌డులు రాకుండా ప్ర‌య‌త్నం సాగుతోంద‌న్నారు.


రాష్ట్ర‌మంతా అరెస్టులు..!

cpm

ఏపీలో అరెస్టుల ప‌ర్వం సాగుతోంది. గొంతు తెరిచిన వారంద‌రినీ అరెస్టు చేసే వ్య‌వ‌హారం సాగుతోంది. విశాఖ నుంచి తిరుప‌తి వ‌ర‌కూ అన్ని చోట్లా అరెస్టులు, లాఠీఛార్జీలు సాగుతున్నాయి. విశాఖ‌ను పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసుల ఆంక్ష‌ల‌ను ధిక్క‌రించిన వారంద‌రినీ ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టులు సాగిస్తున్నారు. ఉద‌యం నుంచి ఈ ప‌ర్వం కొన‌సాగుతోంది. ప‌లువురు కార్య‌క‌ర్త‌లు బీచ్ లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. పలువురు యువ‌కులు, విద్యార్థుల‌ను పోలీసుల‌ను ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్ట్ చేయ‌డంతో ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. మ‌రోవైపు కాకినాడ జెన్టీయూ స‌మీపంలో విద్యార్థులు, యువ‌కుల మీద లాఠీఛార్జ్ జ‌రిగింది. ప‌లువురు ఆందోళ‌న‌కారుల మీద పోలీసులు విరుచుకుప‌డ్డారు. విజ‌య‌వాడ‌లోనూ జ‌న‌సేన‌, లెఫ్ట్ నేత‌ల‌ను అరెస్ట్ చేశారు. రాష్ట్ర‌మంతా హౌస్ అరెస్టుల ప‌ర్వం సాగుతోంది.


ఏపీ మంత్రి మిస్సింగ్

AP Govt_cabinet

ఏపీ మంత్రి రావెల తీరు కొన్ని సార్లు ఆశ్చ‌ర్య‌క‌రంగానూ, మ‌రికొన్ని మార్లు ఆందోళ‌న‌క‌రంగానూ మారుతోంది. చివ‌ర‌కు ఆయ‌న భ‌ద్ర‌తా సిబ్బంది కూడా ఆందోళ‌న చెందే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఏకంగా మంత్రి క‌నిపించ‌డం లేదంటూ ఉన్న‌తాధికారుల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింది. ఆ వ్య‌వ‌హారం సీఎం కి చేర‌డంతో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. మంత్రి రావెల కిషోర్ బాబు నాలుగు గంట‌ల పాటు ఎవ‌రికీ చెప్ప‌య‌కుండా మాయమ‌యిన ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని సీఎం ఆదేశించిన‌ట్టు తెలుస్తోంది. ఈ స‌మ‌యంలో మంత్రి ఏం చేశారన్న స‌మాచారం కోసం ఆయ‌న ఆరాతీసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఏపీ మంత్రివ‌ర్గ స‌మావేశానికి ముందు రోజు సాయంత్రం మంత్రి రావెల క‌నీసం భ‌ద్ర‌తా సిబ్బందికి కూడా స‌మాచారం ఇవ్వ‌కుండా నాలుగు గంట‌ల పాటు అదృశ్య‌మ‌య్యారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లింది కూడా తెలియ‌క‌పోవ‌డంతో ఆయ‌న వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా సిబ్బంది జిల్లాRead More


అక్కినేని ఇంటి నుంచి ఆహ్వానం

5972_Naga-Chaitanya-Samantha

వ‌రుస‌గా రెండో వేడుక‌కు అక్కినేని వారి స్వ‌గృహం సిద్ధ‌మ‌వుతోంది. నెల రోజుల క్రితం చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థానికి ఆహ్వాన ప‌త్రిక‌లు పంచిన నాగార్జున ఇప్పుడు మ‌ళ్లీ పెద్ద కొడుకు కోసం ఇన్విటేష‌న్ల‌తో సిద్ధ‌మ‌య్యారు. స్టార్ హీరోయిన్ స‌మంత‌, చైతూల నిశ్చితార్థానికి బంధు మిత్రులంద‌రినీ ఆహ్వానించే ప‌నిలో ఉన్నారు. నాగచైతన్య, సమంతలు వివాహం చేసుకోబోతున్న విషయం అంద‌రికీ తెలిసిందే. ఆ వేడుక త్వరలోనే ఉండబోతుంది. అదీ ఇటలీలో నిర్వహించబోతున్నామని ఇదివరకే చైతన్య తెలిపాడు. అక్కినేని అఖిల్‌, శ్రియా భూపాల్‌ల నిశ్చితార్థం డిసెంబర్‌లో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఈనెల 29న చైతూ, సమంతల నిశ్చితార్థ వేడుకను జరపనున్నారట. ఇప్పటికే ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అక్కినేని, చిరంజీవి, భూపాల్‌, ప్రభు ఫ్యామిలీలతోపాటు ఇంకా పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరౌతున్నట్లు తెలిసింది.