Updateap

 

న‌ష్ట‌పోయిన తెలుగు మీడియా..!

barc tv rating

ఓవైపు నోట్ల ర‌ద్దు తర్వాత తెలుగు మీడియా క‌ష్టాలు రెట్టింప‌య్యాయి. వేత‌నాల చెల్లింపు కూడా స‌మ‌స్యగా త‌యారవుతోంది. యాడ్ రెవెన్యూ ప‌డిపోవ‌డంతో ఇక్క‌ట్లు త‌ప్ప‌డం లేదు. దానికితోడుగా ఇప్పుడు తాజాగా జీఆర్పీలు కూడా భారీగా ప‌డిపోయాయి. రెండు వారాల వ్య‌వ‌ధిలో 300కి పైగా బార్క్ రేటింగ్ పాయింట్లు తెలుగు న్యూస్ చానెళ్లు న‌ష్ట‌పోయాయి. అందులో టాప్ 4 చానెళ్ల‌లోనే ఎక్కువ న‌ష్టం క‌నిపించింది. అందులో ప్ర‌ధానంగా టీవీ5 ఏకంగా వంద పాయింట్ల వ‌ర‌కూ కోల్పోగా, టీవీ9 50 జీఆర్పీలు న‌ష్ట‌పోయింది. ఎన్టీవీ, 10టీవీ కూడా అదే రీతిలో న‌ష్టాల పాల‌య్యాయి. మొత్తంగా తెలుగు న్యూస్ చానెళ్ల‌కు సంవ‌త్సరాంతంలో కొంత క‌ష్టకాల‌మే క‌నిపిస్తోంది. ఇక తాజాగా 51వ వారం వివ‌రాలిలా ఉన్నాయి. (BARC AP/TS TOTAL Mkt) – GRPs: WEEK: 51 ALL 15+ 1. TV9:Read More


హెచ్ ఎం టీవీ నుంచి అత‌డు అవుట్..!

hmtv venkata

ఎట్ట‌కేల‌కు హెచ్ఎంటీవీ ఊగిస‌లాట వీడింది. వెంక‌ట‌కృష్ణ పై వేటు వేసింది. చాలాకాలంగా అటూ ఇటూ అంటూ కాల‌యాప‌న చేసిన హైద‌రాబాద్ మీడియా యాజ‌మాన్యం నిర్ణ‌యం తీసుకుంది. వెంక‌ట‌కృష్ణ కు గుడ్ బై చెప్పేసింది. కొత్త ఏడాది నుంచి ఆఫీసుకు రావద్దని చెప్పేసింది. ప్ర‌స్తుతం తెలుగు మీడియా వ‌ర్గాల్లో ఇదో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర‌లేపింది. చాలాకాలంగా వెంకట‌కృష్ణ‌కు ఊస్టింగ్ ఖాయ‌మ‌నే ప్ర‌చారం ఉన్న‌ప్ప‌టికీ ఎట్ట‌కేల‌కు 2016 చివ‌ర్లో ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం ద్వారా హెచ్ఎంటీవీ కొత్త ద‌నానికి శ్రీకారం చుట్టింది. వెంక‌ట‌కృష్ణ మీద చాలా ఆరోప‌ణ‌లున్నాయి. ముఖ్యంగా భూకబ్జా స‌హా అనేక విమ‌ర్శ‌లున్నాయి. కంగా హెచ్‌ఎంటీవీ యాజమాన్యానికి సన్నిహిత ఎమ్మెల్యేనే బెదిరించి క‌ల‌క‌లం రేపిన‌ట్టు ఆరోప‌ణ‌లొచ్చాయి. అయినా యాజ‌మాన్యం భ‌రించింది. ఉద్యోగుల వేత‌నాల పేరిట వ‌సూళ్ల‌కు పాల్ప‌డిన‌ట్టు కూడా ప్ర‌చారం సాగింది. ఏకంగా త‌న అనుచ‌రులును ఎక్కువ వేత‌నాల‌కుRead More


చేతులు కాల్చుకున్న క‌మ‌లం..!

sasikala-759

త‌మిళ రాజ‌కీయాల తీరే వేరు. అక్క డ అమ్మ‌ల ప‌ట్టు అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉన్న‌ప్ప‌టికీ, గ‌వ‌ర్న‌ర్ త‌మ చేతిలో ఉన్న‌ప్ప‌టికీ అన్నాడీఎంకే అంతా త‌మ సొంత‌మే అవుతుంద‌ని ఆశించిన వారికి చేదు అనుభ‌వ‌మే ఎదుర‌య్యింది. క‌నీసం ఆపార్టీ చిక్కుల్లో ప‌డితే తాము స్వాహా చేద్దామ‌ని ఆశిస్తే ఆశాభంగ‌మే అయ్యింది. దాంతో ఎవ‌రు పీఠం ఎక్క‌కూడ‌ద‌ని బీజేపీ నేత‌లు ఆశించారో అదే చిన్న‌మ్మ ఇప్పుడు సీఎం కాబోతున్నారు. క‌మ‌లం నేత‌ల‌కు ఈ వ్య‌వ‌హారం కంట‌గింపు క‌లిగించే రీతిలో జ‌య‌ల‌లిత వార‌సురాలిగా శ‌శిక‌ళ హ‌వా ప్రారంభం అయిన‌ట్టే భావించ‌వ‌చ్చు. రెండాకుల పార్టీని ఇప్పుడు రెండు చేతుల‌తో న‌డిపించ‌డానికి శ‌శిక‌ళ స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం తాత్కాలిక సీఎంగా ఉన్న ప‌న్నీరు సెల్వం బీజేపీకి కొంత సానుకూలంగా ఉన్నారు. దాంతో ఆయ‌న్నే సీఎంగా కొన‌సాగించాల‌ని తొలుతRead More


జ‌న‌సేనాని సినిమాలో కాంగ్రెస్ నేత‌..!

pawan

జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ల్యాణ్ తాజా సినిమా కాట‌మ‌రాయుడు ఉగాదికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఆత‌ర్వాత త్రివిక్ర‌మ్ సినిమాల‌కు స‌న్నాహాలు సాగుతున్నాయి. అయితే ఈ సినిమాలో సీనియ‌ర్ కాంగ్రెస్ నేత ఓ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఆ విష‌యాన్ని స్వ‌యంగా ఖుష్బూ వెల్ల‌డించారు. ఒక‌నాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో క్రియాశీల‌క‌లంగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఓ తెలుగు సినిమాకు ఆమె సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా ఆమె తెలియజేశారు. ‘‘తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఓ తెలుగు సినిమాని చేస్తున్నానని అధికారికంగా ప్రకటిస్తున్నా. త్రివిక్రమ్‌, పవన్ కల్యాణ్‌ కలిసి చేస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రంలో చేయబోతున్నా’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. ఆ సినిమా కోసం త్రివిక్రమ్‌ బ్రిలియంట్‌ స్ర్కిప్ట్‌ తయారుచేశారన్నారు. ‘‘నాది చాలా పవర్‌ఫుల్‌ కేరక్టర్‌. మెగాస్టార్‌Read More


నీ సంగ‌తి తేలుస్తానంటు పోలీస్ కి ఎమ్మెల్యే వార్నింగ్

kamareddy mla

‘‘నేను అధికార పార్టీ ఎమ్మెల్యేను. నేనెవరో తెలియదా? నా పేరు చెప్పినా నా మనుషులను వదిలిపెట్టావా? నీ సంగతి తేలుస్తా’’ అంటూ విధినిర్వహణలో ఉన్న ఓ ఎస్సైతో ఎమ్మెల్యే ఏనుగురవీందర్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. చివరకు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి తనవాళ్లను విడిపించు కెళ్లారు. కామారెడ్డి నిజాంసాగర్‌ చౌరస్తాలో ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముగ్గురిని పోలీసులు ఆపారు. త్రిబుల్‌ రైడింగ్‌ చేస్తున్నందుకు జరిమానా కట్టాలని ఎస్సైచెప్పారు. తాము ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరులమని, వదిలేయాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని నడిపినందున జరిమానా కట్టాల్సిందేనని ఎస్సై అన్నారు. వెంటనే ఆ వ్యక్తులు ఎమ్మెల్యేకు ఫోన్‌ చేయడంతో ఆయన సంఘటన స్థలానికి వచ్చారు. విషయం ఏమిటో తెలుసుకోకుండా ఎస్సైతోనూ, సిబ్బందితోనూ వాగ్వాదానికి దిగారు. నాRead More


రామ్ చ‌ర‌ణ్ తో మ‌హేష్.!

mahesh

సూప‌ర్ మ‌హేష్ బాబు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లుసుకున్నారు. ఇద్ద‌రు కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేశారు. ఈ విష‌యాన్ని మ‌హేష్ త‌న అబిమానుల‌తో పంచుకున్నారు. ట్విట్ట‌ర్ లో ఓ ఫోటో పెట్టి సంతోషం వ్య‌క్తం చేశారు. హ‌ద్దుల్లేకుండా..అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. రామ్ చ‌ర‌ణ్ తో పాటు మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్. ఆయ‌న బావ‌, ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్, గ‌ల్లా వార‌సుడు కూడా ఈ ఫోటోలో ఉన్నారు. ఈ న‌లుగురు క‌లిసి స‌ర‌దా సంద‌ర్బంలో తీసుకున్న ఫోటోని ఫ్యాన్స్ కోసం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం ద్వారా మ‌హేష్ కొత్త బంధానికి తెర‌లేపారు. మెగా ఫ్యామిలీ మువీస్ తో పోటీప‌డుతున్న మ‌హేష్ దానిని కేవ‌లం సినిమాల వ‌ర‌కే స‌రిపెట్టి రియ‌ల్ లైఫ్ లో అంతా స్నేహితుల‌మే అన్న‌ట్టుగా బియాండ్ ది బౌండ‌రీస్ అంటూ క‌లిసి పోవ‌డంRead More


అండ‌గా నిలిచిన ర‌కుల్- రానా…

Tamanna hot images (5)

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పై డైరెక్ట‌ర్ సూర‌జ్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌మిళ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మంలో త‌మ‌న్నా పొట్టి దుస్తులు వాడ‌కంపై సూర‌జ్ వ్యాఖ్య‌లపై ఇప్ప‌టికే క్ష‌మాప‌ణ‌లు చెప్పినా వాటి ప్ర‌భావం చ‌ల్లార‌లేదు. దాంతో ఇప్పుడు త‌మ‌న్నాకి అండ‌గా రానా, ర‌కుల్ వంటి వారు నిలుస్తున్నారు. ప్ర‌చారంలో పొట్టి దుస్తులు వేసుకోవ‌డానికే హీరోయిన్ల‌కు అద‌నంగా రెమ్యునేష‌న్ ఇస్తున్నామంటూ ఆ డైరెక్ట‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మండిప‌డుతున్నారు. ‘ఒక్కడొచ్చాడు’లో విశాల్‌ నటించారు కాబట్టి, ఆయ‌న ఈ వివాదంలో తమన్నాకు మద్దతు ఇచ్చి ఉంటారనుకోవచ్చు. ఇతర హీరోలు కూడా సురాజ్‌ని తప్పుబడుతున్నారు. ఈ వివాదం గురించి ఆలస్యంగా తెలుసుకున్న రానా వెంటనే ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ‘‘సురాజ్‌ వ్యాఖ్యల గురించి ఇప్పుడే తెలిసింది. ఇలాంటి వ్యక్తుల మధ్య పని చేస్తున్నందుకు అవమానంగా ఉంది’’ అని హీరోయిన్లకు మద్దతుగా నిలిచారు.Read More


అత‌డితో సై అని చెప్పిన స‌మంత‌

samantha

అక్కినేని స‌మంత‌గా నాగ్ చైత‌న్య ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్న స‌మంత ఇటీవ‌ల సినిమాల‌కు దూరంగా ఉంటోంది. కొత్త ప్రాజెక్ట్ ల‌ను అంగీక‌రించిన దాఖ‌లాలు లేవు. మ‌హానటి సావిత్రి ఓకే అన్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ అది వెన‌క్కి పోయింది. దాంతో స‌మంత సినిమా ప్రాజెక్టుల‌పై చ‌ర్చ సాగుతోంది. అయితే అనూహ్యంగా కోలీవుడ్ ప్రాజెక్ట్ ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. సూప‌ర్ స్టార్ విజ‌య్ తో సినిమాకి స‌మంత సై అన్న‌ట్టు చెబుతున్నారు. దాంతో ఇదో ఆస‌క్తిక‌ర అంశంగా మారింది. తమిళ యువహీరో విజయ్ నటిస్తున్న 61వ చిత్రం పట్ల సినీ అభిమానుల్లో ఎంతటి క్రేజ్ వుందో వేరే చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త బయటికొచ్చినా సంచలనంగా మారుతోంది. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు జ్యోతిక, కాజల్ అగర్వాల్, సమంత నటిస్తారన్న విషయం ఇపుడు చర్చనీయాంశమైంది. స్టార్ హీరోయిన్లయినRead More


మ‌ళ్లీ సీఐఐ స‌మ్మిట్..!

chandrababu-naidu

ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మళ్లీ పెట్టుబ‌డుల వేట ప్రారంభిస్తోంది. గ‌తంలో చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ ప‌లించ‌క‌పోయిన‌ప్ప‌టికీ మ‌ళ్ళీ అదే ప‌నిలో ప‌డుతోంది. గ‌త ఏడాది నిర్వ‌హించిన స‌మ్మిట్ సారాంశం క‌నిపించ‌క‌పోయినా మ‌రోసారి శ్రీకారంచుడుతోంది. తాజాగా విశాఖ‌లో ఇన్విస్టిమెంట్స్ స‌మ్మిట్ 2017 కి స‌న్నాహాలు ప్రారంభ‌మ‌య్యాయి. జనవరి 27,28న విశాఖలో సిఐఐ సమ్మిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాస్‌రావు వెల్లడించారు.జనవరి 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌ను జరుపబోతున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ ఉత్సవాల్లో స్థానిక కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ఆయన వివరించారు. మూడు రోజుల ఉత్సవాలను ఒకే వేదికపై నిర్వహిస్తామన్నారు. ప్రజలను భాగస్వాములుగా చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది నుంచే విశాఖ ఉత్సవ్ పురస్కారాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.


ఏపీలో కొలువ‌ల జాత‌ర‌

APPSC

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. చంద్ర‌బాబు స‌ర్కారు ఎట్ట‌కేల‌కు స్పందించింది. నోటిఫికేష‌న్ల కు శ్రీకారం చుట్టింది. ఖాళీస్థాన‌ల భ‌ర్తీకి రంగం సిద్దం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కొలువుల జాతర మొదలైంది. ఏపీపీఎస్సీ ద్వారా 611 ఉద్యోగాలకు 5 నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 504 అధ్యాపకులు, 95 సహాయ గణాంక అధికారుల పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. మరో 3 రోజుల్లో గ్రూప్‌-1, గ్రూప్‌-3 నోటిఫికేషన్ల విడుదలకు సన్నాలు జరగుతున్నాయి. గ్రూప్‌-3 ద్వారా వెయ్యికి పైగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు. 150 వరకు గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.