Updateap

 

అలా చేస్తే జుట్టు ఊడిపోతుంది…

bath

ఈ రోజుల్లో మనుషులకు సాధారణంగా ఉండే సమస్య జుట్టు ఉడిపోవడం దీనికి చాలా కారణాలు ఉన్నాయి. జట్టు వాతవారణ కాలుష్య వల్ల గానీ ఎప్పుడు షాంపులు వాడడం వల్ల గానీ, చుండ్రు వల్ల గానీ, నీరు వల్ల గానీ ఉడిపోతుంది. అయితే మనం స్నానం చేసే నీటిలో ఉప్పు శాతం అధికంగా ఉంటే జుట్టు చిట్లి వెంట్రుకాలు పొడిబారి ఉడిపోతాయి. కాబట్టి స్నానం చేసే నీరు ఉప్పు నీరు కాకుండా చూసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఓ జగ్ నీటిలో నీరు తీసుకుని అందులో డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా కలపాలి నూరగా వస్తే నీరు మంచిదని అర్థం లేకుంటే ఆ నీరు స్నానానికి పనికి రాదు.


పవన్ కల్యాణ్ పర్యటనలో ఏం ఒరిగింది

pawan

పవన్ కల్యాణ్ కి బీజేపీ బంపరాఫర్

pawantt_4127

జనసేన అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంగోలులో జరిగిన పార్టీ సమన్వయకర్తల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యవహారం ఒకటి బయటపెట్టారు. తనకు కమలనాధుల నుంచి వచ్చిన ఆఫర్ గురించి చెప్పుకొచ్చారు. అయితే దానిని తాను తిరస్కరించినట్టు చెప్పడం విశేషం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకు హైదరాబాదులో అమిత్ షా తనను కలిసినట్టు పవన్ తెలిపారు. ఆ సందర్భంగా ఆయన తనతో మాట్లాడుతూ, ఇకపై దేశ భవిష్యత్తు ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉండదని, కేవలం జాతీయ పార్టీల చేతుల్లోనే ఉండబోతోందని… అందువల్ల బీజేపీలో చేరాలంటూ తనతో చెప్పారని తెలిపారు. అవకాశవాద రాజకీయ నాయకుడిగా తనను అర్థం చేసుకున్నారని… కానీ, తాను అలాంటివాడిని కాదని అన్నారు. అధికారం లేకపోయినా, పేరు ప్రఖ్యాతులను కోల్పోయినా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోననిRead More


బాబు క్లాస్ లంచ్ లోనూ వదల్లేదు..

jaleelkhan

ఇటీవల టీడీపీ ఎల్పీ మీటింగ్ తర్వాత ఆసక్తికర పరిణామం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా క్లాస్ పీకారు. ఎన్నికల గడువు సమీపిస్తున్నా ఇంకా చాలామంది పరిస్థితి బాగోలేదని హెచ్చరించారు. శాసనసభాపక్షం సమావేశం ముగిసిన తర్వాత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఎమ్మెల్యేలందరికీ లంచ్ ఏర్పాటు చేశారు. మటన్…చికెన్ బిర్యానీ…కైమా వంటి ప్రత్యేక వంటలతో శాసనసభ లాబీలో ఏర్పాటు చేసిన లంచ్ తింటూనే కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు హెచ్చరికలపై చర్చించుకున్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితి బాగోలేదని గ్రహించిన ఎమ్మెల్యేలు మాత్రం జలీల్ ఖాన్ ఇచ్చిన విందును ఆస్వాదించలేకపోయారు. కడుపార ఆరగించలేకపోయారు. చంద్రబాబు చేసిన హెచ్చరికలు వారికి కడుపులో తెమిలినట్టు చేశాయి. అంతకుముందు రోజే శాసనసభా సమావేశాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలస్యంగా వచ్చారు. ఆ రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే సరికి కేవలం 51 మంది శాసనసభ్యులు మాత్రమేRead More


బాబు భవితవ్యం తేల్చేసిన పవన్

chandrababu pawan

ఏపీ రాజకీయాల్లో స్పష్టత వచ్చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలు షురూ అంటూ సాగిన ప్రచారానికి తగ్గట్టుగానే పరిణామాలున్నాయి. ఏపీలో పవన్ కల్యాణ్ నాలుగు రోజుల పర్యటనలో చాలా వరకూ క్లారిటీ వచ్చేసింది. జనసేన అధినేత కామెంట్స్ మీద చంద్రబాబు తీరు కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. దాంతో మిత్రపక్షాల స్నేహం మరింత చిగురించే దిశలో పరిణామాలున్నాయి. రాజకీయంగా టీడీపీ, జనసేన బంధం బలపడుతున్నట్టు స్పష్టం అవుతోంది. అదే సమయంలో సామాజికంగా కమ్మ, కాపు కాంబినేషన్ కోసం కుస్తీపడుతున్నట్టు కనిపిస్తోంది. కానీ అది ఏమాత్రం సాధ్యం కాదనే అభిప్రాయమే సర్వత్రా ఉంది. ఇక 2014లో చేతులు కలిపిన పవన్ , చంద్రబాబు తమ అనుబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారనడానికి తగ్గట్టుగానే చంద్రబాబు కార్యదక్షతకు తాను మద్ధతిస్తున్నట్టు పవన్ మాటలున్నాయి. గతంలో ఆయన అనుభవానికి అండగా ఉన్నానని చెప్పినRead More


తమన్నాకి అలాంటి స్థితిలో పడిపోలేదట..

tamannasexbattle-647x450

బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా వైరల్ అవుతున్న సబ్జెక్ట్ కాస్టింగ్ కౌచ్. పరిశ్రమలో అవకాశాలు రావాలన్నా, నిచ్చెనలు ఎక్కినట్టుగా అగ్రస్థానానికి ఎగబ్రాకాలన్నా కాస్టింగ్ కౌచ్‌లో నటీమణులు త్యాగాలు చేయాల్సి వుంటుందని రాధిక ఆప్టే చేసిన వ్యాఖ్యలపై దుమారాలు రేగుతున్నాయి. రాధిక ఆప్టే ఓ చిన్న మాటను చెప్పి సైలెంట్ నిశ్శబ్దంగా వుంటే, మిగతా హీరోయిన్లు అంతా భుజాలు తడిమేసుకుంటున్నారు. తమకు ఎప్పుడూ అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని, తమ ప్రతిభ చూసే అవకాశాలు వచ్చాయని ఢంకా భజాయించి మరీ చెబుతున్నా రు. మనం ఎంచుకునే మార్గం ఖచ్చితంగా వుంటే ఎలాం టి సమస్యలు రావని, తాను ఎప్పుడూ అలాంటి అనివార్యమైన పరిస్థితుల్లో పడిపోలేదని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్నా నటించిన ‘క్వీన్’ చిత్రం విడుదలవుతోంది.


మోడీ ఖర్చు చూస్తే ముక్కున వేలేసుకుంటారు..

09THPOSTER

కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొందరికి కొన్ని అవసరంగా మారతాయి. మరికొన్ని ఆడంబరాలు తోడవుతాయి. ప్రధాని మోడీని చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అందులో ఆయనకు ప్రచార ప్రీతి బాగా ఎక్కువ. ఎన్నికల ముందు త్రీడీలలో హామీలు గుప్పించి ఆ తర్వాత కేవలం మీడియా ప్రచారంతో మభ్యపెట్టడానికి ఆయన సిద్ధపడుతున్నారనే వాదన ఉంది. దానికి తగ్గట్టుగానే తాజాగా బయటపడిన లెక్కలున్నాయి. ఆర్టీఐలో కేంద్రం అధికారికంగా చెప్పిన లెక్కలు గమనిస్తే మనం ముక్కున వేలేసుకోక తప్పదు. మోడీ ఏం చేసినా అది ప్రచారార్భాటంతోనే ఉంటుంది. అందుకే ప్రజావసరాల కన్నా పబ్లిసిటీకి ప్రాధాన్యతనిస్తారనే పేరుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని ఏడు వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ మోడీ సర్కారు తొలుత కేవలం జిల్లాకో 50 కోట్లు చొప్పున 350 కోట్లుRead More


గంటా మీద గురిపెట్టినట్టా..

ganta srinivas

ఇదే చర్చ సాగుతోంది. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవికి అన్యాయం చేసిన వారిపై తాను ప్రతీకారం తీర్చుకుంటానంటూ పవన్ కల్యాణ్ చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.. అయితే ఇప్పటికే పవన్ మాటల ప్రకారం ఆ జాబితాలో పరకాల ప్రభాకర్ ప్రధమస్థానంలో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే పరకాల మీద నా సూటి వ్యాఖ్యలు చేసేశారు. చివరకు ఆయన భార్యను కూడా వదలకుండా పవన్ ప్రస్తావించారు. ఆ తర్వాత పవన్ గురి గంటా శ్రీనివాసరావు మీదేనా అనే చర్చ సాగుతోంది. వాస్తవానికి గంటా చివరి వరకూ చిరంజీవి వెంటే ఉన్నారు. ఇప్పటికీ చిరుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. చివరకు చిరంజీవి చిన్నకుమార్తె రెండో పెళ్లి విషయంలో కూడా గంటా కీలకంగా వ్యవహరించారు. అయినప్పటికీ పవన్ కల్యాణ్ మాత్రం గంటా మీద గుర్రుగానే ఉన్నట్టు కొందరు అనుమానిస్తున్నారు. దానికిప్రధాన కారణం గంటా వంటి వారి ప్రోద్భలంతోనేRead More


సప్తగిరి మువీ రివ్యూ

Sapthagiri-LLB-Movie-Stills

సినిమా : సప్తగిరి ఎల్.ఎల్ బి నటీనటులు : సప్తగిరి, కషిష్ వోహ్రా, సాయి కుమార్ , శివ ప్రసాద్, శకలక శంకర్ తదితరులు నిర్మాత : డాక్టర్ కే.రవికిరణ్ దర్శకత్వం : చరణ్ లక్కాకుల సంగీతం ; విజయ్ బుల్గానిన్ కమెడియన్ గా చిత్ర పరిశ్రమకి పరిచయమైన సప్తగిరి కామెడి టైమింగ్స్ తో ప్రేక్షకులని అలరించాడు. కమెడియన్ లు హీరోలుగా మారుతుండడం కొత్తేమి కాదు. అలా సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో తోలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు సప్తగిరి. ఓ వైపు హాస్యనటుడిగా రాణిస్తూనే హీరోగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన జాలీ ఎల్.ఎల్.బి సినిమాని రీమేక్ చేశాడు సప్తగిరి. మరి ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. చిత్ర కథ :Read More


ఒక్కరోజుకే మరచిపోతే ఎలా పవన్?

janasena pawan kalyan

నాలుగు రోజుల పర్యటన కోసం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, మధ్యాంధ్ర ప్రాంతాల్లో పర్యటనలు పూర్తి చేసుకుని దక్షిణాంధ్ర వైపు పవన్ కళ్యాణ్ కదులుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన పలు కీలక సమస్యలను ప్రస్తావించారు. డీసీఐ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానికి గట్టి హెచ్చరికలే పంపించారు. బీజేపీ ఓటమికి విశాఖ నుంచే బీజం పడకుండా చూసుకోవాలని సూటిగానే చెప్పేశారు. అయితే దానిమీద బీజేపీ నేతలు మాత్రం పెద్దగా స్పందించకపోవడంతో పవన్ కి ఇబ్బంది రాలేదు. కానీ అదే సమయంలో పోలవరం విషయంలో చంద్రబాబు మాత్రం పవన్ కి కౌంటర్ ఇచ్చేశారు. వాస్తవానికి పవన్ ఏపీ సర్కారుని తప్పుబట్టారు. పోలవరం విషయంలో కేంద్రానికే కాకుండా తనకు కూడా సందేహాలు పెరుగుతున్నాయన్నారు. మన బంగారం మంచిదయితే అంటూ మాట్లాడి..కేంద్రాన్ని తాను నిలదీయాలంటే ముందు చంద్రబాబు చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. శ్వేతపత్రం విడుదల చేసి, అఖిలపక్షRead More