Updateap

 

కోర్టు తీర్పు ఉండడంతో వాయిదా వేసిన జగన్

pk jagan

వైఎస్ జగన్ పాదయాత్ర ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆరు నెలల పాటు కోర్టు వాయిదాలకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరడంతో రేపు కోర్ట్ తీర్పు వెలువడబోతోంది. అన్న వస్తున్నాడు అనే పేరుతో పాదయాత్ర కోసం జగన్ ముహూర్తం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే చర్చ సాగుతోంది. ఇప్పటికే వారంలో 5 రోజులు పాదయాత్ర చేసి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అన్న ప్రతిపాదనలు కోర్టులో వినిపించిన నేపథ్యంలో కోర్ట్ జగన్ అవకాశం ఇస్తుందా లేదా అన్నది జగన్ యాత్ర భవితవ్యాన్ని నిర్దేశించబోతోంది. అయితే రేపు కోర్ట్ తీర్పు ఉండడంతో వైఎస్సార్సీపీ శాసనసభా పక్ష సమావేశాన్ని వాయిదా వేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన ఎల్పీ మీటింగ్ వాయిదా వేసినట్టు తాజాగా ప్రకటించడంRead More


పాపం..రాజా దిగ్రేట్

raviteja

సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం ఆవహించింది. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా.. రిలీజ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సినిమా రిలీజ్ అయిన రెండో రోజే పైరసీ వెబ్ సైట్లలో సినిమాల లింకులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన రవితేజ సినిమా రాజా ది గ్రేట్ కు కూడా పైరసీ బారిన పడింది. ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా పేజ్ ద్వారా స్పందించారు. ఓ అభిమాని ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటోను అనిల్ రీ ట్వీట్ చేశారు. శ్రీనివాస్ కుమార్ అనే వ్యక్తి ‘ ఎయిర్ పోర్ట్ లాంజ్ లో మేడమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరి చూస్తున్నారు రాజా ది గ్రేట్ సినిమా. చాలా బాధగా ఉంది. సినిమాలను బతికించండి, కిల్ పైరసీ’ అంటూ ట్వీట్ చేశాడు.Read More


జనసేన ప్లీనరీ

pspk janasena

పవన్ కల్యాణ్ పార్టీ పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అక్టోబర్ నుంచి పూర్తిగా రాజకీయాల్లో ఉంటానని చెప్పినప్పటికీ ఆయన ప్రస్తుతం పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా ఉన్నారు. అయితే తాజగా పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనసేనను బలోపేతం చేయడానికి తగ్గట్టుగా సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా విజయవాడలో జనసేన ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వచ్చే ఆరు నెలల్లో పార్టీ పరంగా చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాలపై పార్టీ నేతలతో అధినేత పవన్ కల్యాణ్ చర్చించారు. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. పార్టీ ప్లీనరీ సమావేశాలు.. అనంతరం పవన్ జిల్లాల పర్యటన ను పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ప్లీనరీ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు. అయితే ప్లీనరీ విషయంలోRead More


ఇల్లూ బేబీ పెళ్లి…

ileana-759

గోవా బ్యూటీ ఇలియానా రహస్యంగా పెళ్లిచేసేసుకుందా? అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇలియానా.. ఆస్ట్రేలియాకి చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం గురించి ఇలియానా కూడా చాలా సార్లు మీడియా ముందు అధికారికంగా వెల్లడించింది. కొన్నిరోజుల క్రితమే ఇలియానా ఆండ్రూని ఆస్ట్రేలియాలో స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసేసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే ఈ విషయాన్ని మీడియాకి తెలీనివ్వడంలేదట. అదీకాకుండా ఆండ్రూ అంటే తనకి చాలా ఇష్టమని తననే పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇలియానా గతంలో చాలా సార్లు వెల్లడించింది. ఇలియానా ‘బాద్‌షాహో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు రాబట్టింది.


జవాన్ ముహూర్తం రెడీ

sai dharam tej jawan

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం ‘జవాన్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవలే రిలీజ్ చేసిన టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని నిర్మాతలు తెలుపుతున్నారు. టీజర్ లో మాస్ కమర్షియల్ అంశాల్ని మేళవించడంతో పాటు… కొంతమంది మనుషులు కలిస్తే కుటుంబం అవుతుంది. కొన్ని లక్షల కుటుంబాలు కలిస్తే దేశం అవుతుంది. దేశభక్తి అనేది కిరీటం కాదు. కృతజ్ఞత అంటూ, దర్శకుడు చెప్పిన కాన్సెప్ట్ కి అందరూ కనెక్ట్ అయ్యారు. సాయి ధరమ్ తేజ్ ని కొత్తగా చూపించబోతున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. సాయిRead More


జనసేన నాయకుడు అరెస్ట్

janasena

జనసేన పార్టీ పూర్తిగా ఓ కొలిక్కి రాకముందే కొందరు నేతలమని చెప్పుకుంటున్న వారి తీరుతో జనసేనకు ఇబ్బందులు తప్పడం లేదు. ఐ ఫోన్‌ 7 అమ్ముతానని ఓఎల్‌ఎక్స్‌ డమ్మీ ఫోన్‌ అమ్మినట్టు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. గతంలో జనసేన నాయకుడినంటూ కొంత కాలం పాటు హల్ చల్ చేసిన కళ్యాణ్‌ సుంకర అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాన్నే మార్గంగా ఎంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు చెబుతున్నరు. ఓఎల్‌ఎక్స్‌ వైబ్‌సైట్‌ ఐ ఫోన్‌ 7ను అమ్మడానికి ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి చాలామంది అతన్ని సంప్రదించారు. ఇది చూసిన ఓ వ్యక్తి దానిని కొనుగోలు చేశాడు. తిరా చూస్తే అది డమ్మీ ఫోన్‌ అని అతనికి తెలిసింది. విషయం తెలుసుకుని డమ్మీRead More


సీనియర్ హీరోతో మెహరీన్

Mehreen-Pirzada-1

యంగ్ హీరోలతో ప్రారంభించి ఇప్పుడు సీనియర్లకు చేరుకుంటోంది మోహరీన్. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది అందాల భామ మెహరీన్ ఫీర్జాదా. తాజాగా రవితేజతో చేసిన ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈమె ఇప్పుడు టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారింది. వరుసగా మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాల విజయంతో జోరుమీదున్న మెహరీన్ అటు నటిగా, ఇటు గ్లామర్ పరంగా కూడా తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది. తాజాగా ఈమెకు మరో క్రేజీ అవకాశం దక్కింది. ప్రముఖ హీరో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఆ వివరాల్లోకి వెళితే, వెంకటేష్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం త్వరలో సెట్స్‌పైకి రానుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ తరువాత తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో వెంకటేష్Read More


హాత్ వే తో యూప్ టీవీ

download

భారతదేశంలో అతి పెద్ద కేబుల్ బ్రాండ్ ప్రొవైడర్ హాత్వే , ప్రపంచంలో అత పెద్ద ఓవర్ ది టాప్ సౌత్ ఆసియన్ కంటెంట్ ప్రొవైడర్ యప్ టీవీతో చేతులు కలిపింది. వినియోగదారులకు లైవ్ టీవి, ఆన్ డిమాండ్ నాణ్యమైన వినోదం కంటెంట? అందించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నుట్ల హాత్‌వే సంస్ధ ఎండి రాజన్ గుప్తా తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న వినోదపు మార్కెట్‌లో తమ ఇంటర్నెట్ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఈ ఒప్పందం ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. 12 భాషల్లో 200కుపైగా ప్రత్యక్ష ప్రసార టీవీ చానళ్లు, అత్యల్ప ధర వద్ద హై స్పీడు ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్‌తో నాణ్యమైన కంటెంట్‌నదు పొందేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందనానరు. యప్ టీవీ వ్యవస్ధాపకులు ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ హై స్పీడ్ ఇంటర్నెట్‌తో ప్రేక్షకులకు దగ్గరవుతామన్నారు.


మట్టికరిచిన పాక్

hockey'

పాకిస్తాన్ జట్టు మట్టికరిచింది. మళ్లీ ఓటమి పాలయ్యింది. ప్రత్యర్థి పాక్ పై టీమిండియా ఆటగాళ్లు సంపూర్ణ ఆధిక్యాన్ని సంపాదించారు. చివరిలో చెలరేగి చిత్తు చేశారు. తొలి మూడు భాగాల్లో 1 గోల్ చేసిన టీమిండియా చివరి భాగంలో మాత్రం ఏకంగా 3 గోల్స్ సాధించింది. దాంతో పాకిస్తాన్ ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. వరుస దాడులతో ఊపిరిసలపకుండా చేసిన టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇటీవల కాలంలో వరుసగా పాకిస్తాన్ ని ఓడిస్తున్న జట్టు మరోసారి పై చేయి సాధించి ఆసియాక‌ప్ హాకీ ఫైన‌ల్‌ లో అడుగుపెట్టింది. ఆసియా క‌ప్ సూప‌ర్‌-4 లో పాకిస్ధాన్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. 4-0 గోల్స్ తేడాతో పాకిస్ధాన్‌పై భార‌త్ విజ‌య భేరీ మోగించి ఆసియాక‌ప్ హాకీ చివరి అంకానికి సిద్ధమయ్యింది.


జగన్ గూటికి కోట్ల: ముహూర్తం సిద్ధం

kotla suryaprakash

కర్నూలు ఎంపీ సీటుపై క్లారిటీ రావడంతో మాజీ కేంద్ర మంత్రి వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుక టీడీపీ బుట్టలో పడడంంతో వైసీపీకి అక్కడ ఖాళీ ఏర్పడింది. దానిని భర్తీ చేయడానికి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నెలాఖరున వైసీపీ కండువా కప్పుకోబోతున్నట్టు ఆయన అనుచరులు ప్రచారం ప్రారంభించారు. కర్నూలు ఎంపీ టికెట్ ను కోట్లకు కేటాయించడానికి జగన్ అంగీకరించడంతో ఆయన ఫ్యాన్ పంచన చేరడం ఖాయం అనే ప్రచారం ఊపందుకుంది. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ రాజకీయాల్లో కొనసాగుతున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మాజీ సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. పెద్దరికంతో వ్యవహరిస్తారని పేరుంది. కానీ ఆయనకు తగిన గుర్తింపు మాత్రం రాలేదు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ దాదాపుగా కొడగొట్టుకుపోవడంతో వచ్చే ఎన్నికల్లోRead More