మ‌ళ్లీ ఢుమ్మా కొడుతున్న వైసీపీ..!

ys jagan
Spread the love

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల‌కు రంగం సిద్ధ‌మ‌య్యింది. అధికార పార్టీ స‌క‌ల ఏర్పాట్లు చేస్తోంది. ప్ర‌త్యేక హోదా వేడి రాజుకుంటున్న నేప‌థ్యంలో విప‌క్షానికి అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డ‌మే కాకుండా, మిత్ర‌ప‌క్షంతో వైరం విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

వాస్త‌వానికి గ‌త శీతాకాల స‌మావేశాలను విప‌క్షం బాయ్ కాట్ చేసింది. ఫిరాయింపుల విష‌యంలో చంద్ర‌బాబు సర్కారు తీరుపై నిర‌స‌న‌గా అసెంబ్లీ బహిష్క‌ర‌ణ నిర్ణ‌యం తీసుకుంది. దానిని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించింది బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కూడా దూరం కావాల‌ని భావించింది. ఈ విష‌యాన్ని జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌త్రికా ముఖంగా తెలిపారు. దాంతో బ‌డ్జెట్ స‌మావేశాల‌కు కూడా వైఎస్సార్సీపీ దూరం అవుతుంద‌న్న వాద‌న బ‌ల‌ప‌డింది.

అయితే జ‌గ‌న్ తీరు మీద ప‌లువురు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఉండ‌వ‌ల్లి వంటి వారు కూడా త‌ప్పుబ‌డుతున్నారు. దాంతో జ‌గ‌న్ పున‌రాలోచ‌న‌లో ఉన్నార‌నే వాద‌న బ‌య‌లుదేరింది. సందిగ్ధంలో ఉన్నార‌నే ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ఏం చేయాల‌నే దానిమీద మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్టు చెబుతున్నారు. అయినా చివ‌ర‌కు ఢుమ్మా కొట్ట‌డం ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. త‌ద్వారా ఫిరాయింపు విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌గ‌ల‌మ‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎమ్మెల్యేలకు వ‌ల వేయ‌కుండా చూసుకోగ‌ల‌మ‌న్న అంచ‌నా వైసీపీ నేత‌ల్లో ఉంద‌ని అంటున్నారు. మ‌ళ్లీ ఢుమ్మా కొడుతున్న వైసీపీ..!


Related News

shivaji

శివాజీ కామెంట్స్ చుట్టూ ర‌చ్చ‌

Spread the loveఅప‌రేష‌న్ గ‌రుడ‌..ఆప‌రేష‌న్ ద్రావిడ‌..రెండు రోజులుగా ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశాలుగా మారాయి. దానికి కార‌ణం సినీ న‌టుడు శివాజీRead More

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316

ప‌వ‌న్ ఫ్యాన్స్ కి దొరికిన క‌త్తి మ‌హేష్

Spread the loveఫిల్మ్ క్రిటిక్ గా కెరీర్ ప్రారంభించి కొంత కాలంగా పొలిటిక‌ల్ ఎనాలిసిస్ కి సిద్ధ‌ప‌డుతున్నారు. అంతేగాకుండా అవ‌కాశంRead More

 • త‌న అభిప్రాయంతో జ‌నం ఏకీభ‌వించ‌డంలేదంటున్న ప‌వ‌న్
 • కాబోయే మంత్రి ఎవ‌రు..?
 • మీడియాను భ‌య‌పెడుతున్న మంత్రి!
 • కామినేనిపై క‌త్తిలాంటి సెటైర్
 • ఏపీ స‌మ‌స్య‌ల‌న్నింటికీ జ‌గ‌నే కార‌ణం….
 • రివ‌ర్స్ ఎటాక్ ప్రారంభించిన క‌మ‌ల‌నాధులు
 • టీడీపీ రాజీనామాల నిర్ణ‌యం:దూరంగా ఉన్న‌మంత్రి
 • ఏపీకి టోపీ పెట్టేశారు…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *