Main Menu

బెజ‌వాడలో వైసీపీ కి కొత్త స‌మ‌స్య‌లా..?

Spread the love

అనూహ్య సంఘ‌ట‌న సాక్షాత్క‌రించింది. 15 ఏళ్ల క్రితం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర సంద‌ర్భంగా గోదావ‌రి తీరంలో క‌నిపించిన దృశ్యం ఇప్పుడు జ‌గ‌న్ యాత్ర‌లో కృష్ణా తీరానికి త‌ర‌లివ‌చ్చింది. అనూహ్య ప్ర‌జాస్పంద‌న‌తో కృష్ణా వార‌ధి జ‌న‌వార‌ధిగా మారింది. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర సంద‌ర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మ‌య్యింది. గుంటూరు నుంచి కృష్ణాజిల్లాలో అడుగుపెడుతున్న సంద‌ర్భంగా జ‌గ‌న్ యాత్ర‌కు ల‌భించిన అపూర్వ స్వాగ‌తం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వైసీపీ శ్రేణుల‌కు క‌నుల పండుగ లాంటి దృశ్యం క‌నిపించింది.

జ‌గ‌న్ పాద‌యాత్ర ఏ స్థాయిలో విజ‌య‌వంతం అవుతుందో తాజాగా విజ‌య‌వాడలో క‌నిపించిన దృశ్య‌మే సాక్ష్యంగా చెప్ప‌వ‌చ్చు. అయితే వైసీపీకి ఈ పాద‌యాత్ర ల‌భిస్తున్న ఊపు నిర్మాణ‌ప‌రంగా ఉన్న లోపాల‌ను ఏమేర‌కు అధిగ‌మించ‌గ‌ల‌న్న‌ది పెద్ద స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. ముఖ్యంగా విజ‌య‌వాడ లాంటి కీల‌క ప్రాంతంలో సామాజిక స‌మ‌తూకం అత్య‌వ‌స‌రం. అందుకు త‌గ్గ‌ట్టుగా జ‌గ‌న్ జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ తీసుకున్న నిర్ణ‌యాల‌కు తోడు తాజాగా గౌత‌మ్ రెడ్డి మీద సస్ఫెన్ష‌న్ ఎత్తివేసిన త‌ర్వాత ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఇప్ప‌టికే న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు బ‌ల‌మైన నేత‌లు క్యూలో ఉన్నారు. వెస్ట్ వెల్లంప‌ల్లి శ్రీనివాస్ కి, సెంట్ర‌ల్ మ‌ల్లాది విష్ణుకి దాదాపు ఖాయం అని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈస్ట్ విష‌యంలో వంగ‌వీటి రాధాకృష్ణ‌కు లైన్ క్లియ‌ర్ అని భావిస్తే తాజాగా అక్క‌డికి పోటీగా ఎల‌మంచిలి ర‌వి రెడీ అయ్యారు. దాంతో ఎవ‌రో ఒక‌రికి మొండిచేయి ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. ఇప్ప‌టికే ఒక వైశ్య‌, ఒక బ్రాహ్మ‌ణ సామాజిక‌వ‌ర్గాల‌కు రెండు సీట్లు కేటాయిస్తే కాపు, క‌మ్మ వ‌ర్గాల‌లో ఒక‌రికి ఈస్ట్ సీటు క‌న్ఫ‌ర్మ్ చేయాల్సి ఉంటుంది. కాపుల నుంచి వంగ‌వీటి ధీమాగా ఉండ‌గా, క‌మ్మ నుంచి య‌ల‌మంచిలి ర‌వి రంగంలో దిగ‌డం పోటీ తీవ్ర‌త‌ను పెంచేసింది. వారిద్ద‌రికీ తోడుగా ఇప్పుడు రెడ్డి సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన గౌత‌మ్ రెడ్డి కూడా ఆశావాహుల జాబితాలో ఉంటార‌న‌డంలో సందేహం లేదు.

వాస్త‌వానికి వైసీపీలో కాపు, రెడ్డి సామాజిక‌వ‌ర్గాలనేత‌ల‌కు లోటు లేదు. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల్లో కాపులు, రాయ‌ల‌సీమ అంత‌టా రెడ్లు వైసీపీ ముఖ్య నేత‌లుగా ఉన్నారు. అలాంటి స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గం నుంచి కొంద‌రు కీల‌క నేత‌ల కోసం వైసీపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. య‌ల‌మంచిలి ర‌వి రాక అందులో భాగ‌మే. ఇప్పుడు అలా వ‌చ్చిన నాయ‌కుడికి టికెట్ ఇవ్వాల‌నుకుంటే వంగ‌వీటికి నిరాశ‌త‌ప్ప‌దు. అయితే య‌ల‌మంచిలి ర‌వికి పెన‌మ‌లూరు గానీ మ‌రో చోట గానీ భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంద‌ని ఆశిస్తున్న నేప‌థ్యంలో అదే జ‌రిగితే పెద్ద స‌మ‌స్య ఉండ‌దు గానీ భిన్నంగా సిటీలోనే అయితే మాత్రం స‌మ‌స్య త‌ప్ప‌దు. ఇక గౌత‌మ్ రెడ్డిని సంతృప్తి ప‌ర‌చ‌డం పెద్ద స‌మ‌స్య మాత్రం కాద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇలాంటి ప‌రిణామాల్లో వైసీపీ బెజవాడ రాజ‌కీయాలు చ‌ర్చనీయాంశంగా మారుతున్నాయి.

\


Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the loveఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *