కాషాయదళంలో జగన్ కి మద్ధతు

china jeeyar
Spread the love

హిందూ మత బోధకుల్లో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కి మద్ధతు పెరుగుతోంది. గత ఎన్నికల ముందు ఆయన మీద క్రిస్టియన్ ముద్ర వేయడం ద్వారా ఒక సెక్షన్ ని ఆయనకు దూరం చేయడంలో ప్రత్యర్థి పార్టీ సక్సెస్ అయ్యింది. ఫలితం కూడా సాధించింది. కానీ ఇటీవలి పరిణామాలు దానికి భిన్నంగా ఉన్నాయి. జగన్ ప్రయత్నాల వల్ల కొంత సానుకూలత ఏర్పడింది. ముఖ్యంగా విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందతో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం రుషికేష్ లో ప్రత్యేక యాగం కూడా నిర్వహించారు.

ఆ తర్వాత , అంతుకు ముందు కూడా ఒంటిమిట్ట రామాలయం సహా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఇక తాజాగా చినజీయర్ స్వామి కాళ్లకు మొక్కడం ద్వారా కొత్త చర్చకు తెరలేపారు. అంతలోనే మరోసారి ఆయనతో ప్రత్యేకంగా సమావేశం కావడం ద్వారా కాషాయి దళాధిపతుల ఆదరణ పొందుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఇంట్లో కొద్దిరోజుల క్రితం జగన్, చినజీయర్ సమావేశమయినట్టు ప్రచారం సాగింది. అయితే తాజాగా మరోసారి భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సందర్భంగా వైయస్సార్ పెట్టిన అనేక పథకాల్నిస్వామీజీ గుర్తు చేయడం విశేషం . దేవాలయాల పునరుద్దరణకు మంచి పథకాల్ని పెట్టాలని అలాగే పూజారులందరికి నెలా నెలా తండ్రి హయాంలో ఇచ్చినట్లుగానే గౌరవ వేతనం ఇచ్చే విధంగా పధకాలు రూపొందించాలని చినజీయర్ సూచించినట్టు తెలుస్తోంది . ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చాక తిరుమలలో టీటీడీని ప్రక్షాలని చేసి రాజకీయాలకి దూరంగా పెట్టి , హిందూ ధార్మిక సంస్థలకి చెందిన స్వామీజీలనే టీటీడీ చైర్మన్ గా నియమించే ఉద్దేశ్యంలో ఉన్నట్లు జగన్ వెల్లడించారు .

వచ్చే నెల మొదటివారంలో జగన్ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. అదే సమయంలో చంద్రబాబుతో చినజీయర్ కి చాలాకాలంగా విబేదాలున్నాయి. గతంలో సీఎంగా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఏర్పడిన విబేధాలు నేటికీ కొనసాగుతున్నాయి. దాంతో చినజీయర్ తో చంద్రబాబుకి ఉన్న విబేధాలను జగన్ సొమ్ము చేసుకుంటున్నారనే వాదన బయలుదేరింది. వాస్తవాలు ఏమయినప్పటికీ జగన్ కి ఆ తరగతిలో ఆదరణ పెరగడం, స్వామీజీలకు ప్రతిపక్ష నేత దగ్గర కావడం మాత్రం రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలకు మరింత దగ్గర కావడానికి ఈ పరిణామాలు తోడ్పడవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


Related News

jaleelkhan

బాబు క్లాస్ లంచ్ లోనూ వదల్లేదు..

Spread the loveఇటీవల టీడీపీ ఎల్పీ మీటింగ్ తర్వాత ఆసక్తికర పరిణామం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా క్లాస్Read More

chandra

చంద్రబాబు ఇమేజ్ పెంచడానికి 25 కోట్లు ..

Spread the loveఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్నారు. తప్పేముందనుకుంటున్నారా..అందుకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రం కోసమేRead More

 • జైలుకి పోతారని హెచ్చరించిన బీజేపీ నేత
 • కస్సుమన్న కేవీపీ
 • అసెంబ్లీ వద్ద కలకలం
 • ఏపీలో కొత్త జిల్లాలు లేవు..
 • పెళ్ళి ఎఫెక్ట్: ఖాళీ అయిన అసెంబ్లీ
 • అఖిలప్రియకు అండగా చినబాబు
 • సోషల్ మీడియాపై చంద్రబాబు కన్ను…
 • సిగ్గుపడాల్సిందేగా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *