Main Menu

జ‌గ‌న్ కేరాప్ బెజ‌వాడ‌

Spread the love

ఏపీలో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ రూటు మారింది. హైద‌రాబాద్ నుంచి ఆయ‌న అడ్ర‌స్ అమ‌రావ‌తికి మారుతోంది. ఈనెలలో ఇప్ప‌టికే వాయిదా ప‌డిన గృహ ప్ర‌వేశం తేదీ ఖ‌రార‌య్యింది. లండ‌న్ నుంచి రావ‌డంతోనే 27న ఆయ‌న కొత్త ఇంట్లో అడుగుపెడుతున్నారు. దాంతో ఇక వైసీపీ వ్య‌వ‌హారాల‌కు కొత్త రాజ‌ధాని కేరాఫ్ కాబోతోంది.

జ‌గ‌న్ ఇల్లు, ఆఫీస్ కూడా క‌లిపి లోట‌స్ పాండ్ త‌ర‌హాలోనే నిర్మించిన త‌రుణంలో వైసీపీ కార్యక‌లాపాల‌న్నీ ఇక అమ‌రావ‌తి కేంద్రంగా జ‌ర‌గ‌బోతున్నాయి. అంత‌గాకుండా జ‌గ‌న్ గెలిస్తే రాజ‌ధాని మారుస్తార‌నే సందేహాల‌కు ఇప్ప‌టికే ఓ ఇంట‌ర్వ్యూలో జ‌గ‌న్ స్ప‌ష్ట‌త ఇచ్చేశారు. మార్చేట్ట‌యితే నేనెందుకు అక్క‌డ ఇల్లు క‌ట్టుకుంటాన‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. చంద్రబాబు ఇల్లు హైద‌రాబాద్ లో క‌ట్టుకుంటే తాను మాత్రం అమ‌రావ‌తిలో నిర్మించి కుంటున్న‌ట్టు అప్ప‌ట్లో తెలిపారు.

ఇక జ‌న‌సేన అధినేత కూడా సొంత ఇల్లు అమ‌రావ‌తిలో సిద్ధం చేసుకున్నారు. దాంతో ఇద్దరు ప్ర‌తిప‌క్ష నేత‌లు సొంత ఇళ్లు ఇక్క‌డ ఏర్పాటు చేసుకోగా, చంద్రబాబు మాత్రం లింగ‌మ‌నేని ఎస్టేట్స్ లో క్యాంప్ కార్యాల‌య‌మే సొంతంగా చేసుకుని సాగుతున్నారు. ఏపీకి జ‌గ‌న్ ఎంట్రీ త‌ర్వాత వైసీపీలో ప‌లుమార్పులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.






Related News

మంగ‌ళ‌గిరిలో టీడీపీకి షాక్

Spread the love1Shareఏపీ సీఎం త‌న‌యుడు నారా లోకేశ్ స్వ‌యంగా రంగంలో దిగిన మంగ‌ళ‌గిరిలో తెలుగుదేశం పార్టీకి షాక్ త‌గిలింది.Read More

టీడీపీ ఎంపీ అభ్య‌ర్థులు వీరే..!

Spread the love24 మంది లోక్ స‌భ‌ అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్ర‌బాబు విడుద‌ల చేశారు. ఈ జాబితాలో ప‌లువురుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *