Main Menu

భార‌తి విష‌యంలో బ‌హిరంగ‌లేఖ‌తో జ‌గ‌న్ !

Spread the love

వైఎస్ జ‌గ‌న్ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. బ‌హిరంగ‌లేఖ‌తో రాష్ట్ర ప్ర‌జ‌లు, ప్ర‌జాస్వామిక వాదులు స్పందించాల‌ని కోరారు. ఆయ‌న రాసిన బ‌హిరంగ‌ లేఖ ప్ర‌కారం త‌న కుటుంబాన్ని కూడా వేధించ‌డానికి జ‌రుగుతున్న ప్ర‌య‌త్నాల‌పై ఆయ‌న ఆవేద‌న, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ‌కు నోటీసులు కూడా రాలేద‌ని, క‌నీసం కోర్టుకి కూడా చేర‌లేద‌ని, జడ్జికి కూడా తెలియ‌న తెలియ‌న విష‌యాలు మీడియాకు ఎలా తెలిశాయంటూ ఆయ‌న నిల‌దీశారు. త‌న‌ను రాజ‌కీయంగా ఎద‌ర్కోలేక తెలుగుదేశం ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ఆయ‌న వాపోయారు. తొలుత త‌న తండ్రిని టార్గెట్ చేశార‌ని, ఆత‌ర్వాత త‌న‌ను వేధించార‌ని, తాజాగా త‌న భార్య భార‌తి మీద గురిపెట్టారంటూ జ‌గ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తెలుగుదేశం పార్టీ బీజేపీతో కుమ్మ‌క్క‌య్యి ఇలాంటి త‌ప్పుడు కేసుల‌తో వేధిస్తోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.ప‌గ‌లు కాంగ్రెస్, రాత్రి బీజేపీతో టీడీపీ సంసారం చేస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వైసీపీ త‌రుపున కాకుండా వ్య‌క్తిగ‌తంగానే తాను ఈ లేఖ రాసిన‌ట్టు ఆయ‌న చెప్ప‌డం విశేషంగా క‌నిపిస్తోంది.

జ‌డ్జి ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఈడీ నుంచి ఉమా శంక‌ర్ గౌడ్, గాంధీ వంటి ఇద్ద‌రు అధికారులు త‌న‌ను వేధిస్తున్నార‌ని ఆయ‌న ఈ లేఖ‌లో పేర్కొన్నారు. చంద్ర‌బాబు ఆదేశాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తున్న ఈ ఇద్ద‌రి తీరుతో విసిగిపోయి పీఎం మోడీకి కూడా ఫిర్యాదు చేసిన‌ట్టు తెలిపారు. వారిద్ద‌రు త‌న మీద త‌న కుటుంబం మీద చంద్ర‌బాబు ప్ర‌యోగించిన ఆయుధాల‌ని పేర్కొన్నారు. భార‌తిని కూడా కోర్టుల చుట్టూ తిప్పాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారా అంటూ ఆయ‌న నిల‌దీశారు. త‌న మీద పెట్టిన కేసుల‌తో ఏడేళ్లుగా ఎన్న‌డూ భ‌య‌ప‌డ‌లేద‌ని, కానీ ఇప్పుడు త‌న కుటుంబం మీద కుట్ర ప‌న్న‌డం తీవ్రంగా క‌లచివేస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జాస్వామిక వాదులంతా ఇలాంటి దారుణాల‌పై స్పందించాల్సి ఉంటుంద‌న్నారు.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *