Main Menu

ముఖ్య‌మంత్రి అనాలా..ముఖ్య కంత్రీ అనాలా?

DGTnRsPUIAACrRo
Spread the love

జీవితంలో ఒక్క అబ‌ద్ధం కూడా చెప్ప‌ని వాడిని స‌త్య హ‌రిశ్ఛంద్రుడు అంటామని, కానీ ఒక్క నిజం కూడా చెప్ప‌ని వాడిన నారా చంద్ర‌బాబు అంటామ‌ని వైఎస్ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. క‌న్న త‌ల్లికి తిండి పెట్ట‌ని వాడు, పిన‌త‌ల్లికి బంగారు గాజులు కొనిస్తాన‌న్న‌ట్టుగా చంద్ర‌బాబు తీరు ఉంద‌ని మండిప‌డ్డారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయ‌ని చంద్ర‌బాబు నంద్యాల‌ని అభివృద్ధి చేస్తాన‌ని చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. సీఎం హోదాలో క‌ర్నూలు వ‌చ్చి చెప్పిన హామీల‌ను జ‌గ‌న్ గుర్తు చేశారు. జాతీయ జెండా సాక్షిగా చెప్పిన మాట‌ల‌ను కూడా చంద్ర‌బాబు త‌ప్పార‌ని వ్యాఖ్యానించారు. ఒక్క‌టంటే ఒక్క హామీ అమ‌లుచేయ‌ని వాళ్ల‌ని ముఖ్య‌మంత్రి అనాలా..ముఖ్య కంత్రీ అనాలా అని ప్ర‌శ్నించారు. మాట త‌ప్పిన చంద్ర‌బాబు మీద కేసులుండ‌వు గానీ, మాట అమ‌లు చేయ‌మ‌న్నందుకు కాపుల మీద నిర్బంధం పెట్టార‌ని , కంచాలు మోగిస్తే కేసులు పెట్టార‌న్నారు. లంచాలు మింగిన చంద్ర‌బాబు మీద కేసులుండ‌వ‌న్నారు.

ఒక్క మైనార్టీకి కూడా చంద్ర‌బాబు క్యాబినెట్ లో మంత్రి ప‌ద‌వి లేద‌న్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌లు గుర్తుకురావ‌డంతో ముస్లీంలు గుర్తుకొచ్చార‌న్నారు. హిందూపురంలో అబ్దుల్ ఘ‌నీ సీటు లాగేసుకుని బావ‌మ‌రిదికి ఇచ్చుకున్నార‌న్నారు. లాల్ జాన్ భాషా కి కూడా అన్యాయం చేశార‌న్నారు. ఆదిత్యానాథ్ దాస్ క్యాబినెట్ లో కూడా ముస్లీం ఉన్నార‌ని, చంద్ర‌బాబు క్యాబినెట్ లో లేర‌న్నారు. ఏపీ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు. ఈ ఉప ఎన్నిక‌లు వ‌చ్చేవ‌ర‌కూ ఫ‌రూఖ్ కి క‌నీసం అపాయిట్ మెంట్ కూడా దొర‌క‌లేద‌న్నారు.ఆర్థికంగా వెనుక‌బ‌డిన ముస్లీంల కోసం వైఎస్ శ్ర‌మిస్తే దిక్కుమాలిన చంద్ర‌బాబు పాల‌న‌లో తీవ్ర అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు.

ఎన్నిక‌ల ముందు చెప్పిన మాట‌లు అమ‌లు చేయ‌లేదు. సీఎంగా క‌ర్నూలు వ‌చ్చి చెప్పిన మాట‌లు అమ‌లు చేయ‌లేదు, ఇక నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట‌లు ఎలా అమ‌ల‌వుతాయ‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు ప్ర‌తీ ప‌థ‌కంలోనూ అవినీతి క‌నిపిస్తోంద‌న్నారు. భూమా బావ‌మ‌రిది ఎస్వీ మోహ‌న్ రెడ్డి వంటి వాళ్లే త‌మ ఎమ్మెల్యే కూడా పోతే బాగుంటుంద‌ని చెప్పే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు. ఏపీ అంత‌టా మూడేళ్ల‌లో 35వేల ఇళ్లు క‌డితే నంద్యాల‌లో 13వేల ఇళ్లు క‌డతాన‌ని చెప్ప‌డం వెనుక పెద్ద స్కామ్ ఉంద‌న్నారు. స‌హ‌జంగా ఫ్లాట్ నిర్మించ‌డానికి వెయ్యి, ప‌న్నెండు వంద‌ల‌కు మించి చ‌ద‌ర‌పు గ‌జం నిర్మాణానికి అవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. అలాంటిది చంద్ర‌బాబు బినామీ కాంట్రాక్ట‌ర్ కి అడుగు 2078 రూపాయ‌ల చొప్పున చెల్లిస్తున్నార‌న్నారు. 300 అడుగుల ఫ్లాటు నిర్మాణానికి 3ల‌క్ష‌లు ఖ‌ర్చ‌యితే చంద్ర‌బాబు 6 ల‌క్ష‌లు చెల్లిస్తోంద‌న్నారు. కేంద్రం, రాష్ట్రం ఇచ్చే 3ల‌క్ష‌లు పోనూ, మిగిలిన డ‌బ్బు పేద‌వాడి పేరుతో బ్యాంకుల నుంచి అప్పుగా తెస్తున్నార‌న్నారు. అంటే చంద్ర‌బాబు లంచాల కోసం జ‌నం అప్పుల్లో మునిగిపోవాల్సి వ‌స్తోందన్నారు.

చంద్ర‌బాబు ప‌సుపు-కుంకుమ అంటున్నార‌ని కానీ అది ఉప్పూ కారం స్కీమ్ గా మారింద‌న్నారు. ట్రాక్ట‌ర్ల స్కీమ్ లో కూడా స్వ‌రాజ్ మ‌జ్థా సంస్థ నుంచి మామూళ్లు తీసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు నంద్యాల వ‌స్తే రోడ్డు మీద నిల‌దీసి అడ‌గాల‌ని పిలుపునిచ్చారు. నంద్యాల‌లో వేసే రోడ్ల‌న్నింటికీ అఖిల‌ప్రియే కాంట్రాక్ట‌ర్ అని విమ‌ర్శించారు. రోడ్ల విస్త‌ర‌ణ‌లో స్థానికుల‌ను క‌నీసం చ‌ర్చ‌లు కూడా జ‌ర‌ప‌కుండా ఉప ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్ట‌డానికి రాత్రికి రాత్రే బుల్డోజ‌ర్ తో షాపుల‌ను ధ్వంసం చేశార‌ని వాపోయారు. న‌ష్ట‌ప‌రిహారం అత్యంత దుర్మార్గ‌మ‌న్నారు.


Related News

pawan

జ‌న‌సేనానికి కంటి స‌మ‌స్య‌లు

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయ‌న్ని కంటి స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికేRead More

Chandu Sambasiva Rao2

ప‌ర‌కాల ప్లేస్ లో ఆయ‌నేనా..?

Spread the loveచంద్ర‌బాబుకి పెద్ద చిక్కొచ్చింది. ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తుండ‌డంతో చాలామంది నేత‌లు ప్ర‌త్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ప‌ద‌వుల పంపిణీలో త‌గినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *