వైసీపీ రాజీనామాలు: బైఠాయించిన టీడీపీ

ycp
Spread the love

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్ సమావేశాలు స్తంభింపజేసిన పార్టీల నేతలు, వాయిదా తర్వాత కూడా నిరసనలు సాగిస్తున్నారు. సభలో ఆందోళనలకు ప్రభుత్వం దిగిరాకపోవడంతో స్పీకర్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా పార్లమెంట్ లో హోదా విషయాన్ని చర్చించనందుకు నిరసనగా వైసీపీ రాజీనామాలు చేసింది. ఆపార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామాలు సమర్పించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ రాజీనామాలు సమర్పించారు. స్పీకర్ ఫార్మెట్ లో రూపొందించిన రాజీనామాలను నేరుగా తీసుకెళ్లి స్పీకర్ సుమిత్రా మహాజన్ కి అందించారు. తమ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నందున తాము పార్లమెంట్ లో కొనసాగలేమని తేల్చేశారు.

అదే సమయంలో టీడీపీ కూడా రాజీనామాలకు ససేమీరా అన్నప్పటికీ స్పీకర్ ఛాంబర్ లో మాత్రం బైఠాయించింది. నిన్న సెంట్రల్ హాల్ లో నిరసన తెలిపిన నేతలంతా ఈరోజు స్పీకర్ ఛాంబర్ లో బైఠాయించారు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ పట్ల బీజేపీ చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. తొలుత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు, ఆ తర్వాత ముఖద్వారం ముందు, తర్వాత పోడియం ముందు, చివరకు సెంట్రల్ హాల్ లోనూ నిరసనలు తెలిపిన నేతలు సభ నిరవధిక వాయిదా ప్రకటన తర్వాత స్పీకర్ ఛాంబర్ కి చేరారు.

tdp


Related News

akula satyanarayaa

బీజేపీకి ఎమ్మెల్యే గుడ్ బై!

Spread the love8Sharesఏపీలో అస‌లే బీజేపీ ప‌రిస్థితి బాగోలేదు. ఆపార్టీకి అన్నీ ఆటంకాలే అన్న‌ట్టుగా మారింది. హోదా ఉద్య‌మం దావానంలోRead More

BJP-AP

గోదారోళ్ల‌కే ప‌ట్టం క‌డుతున్న పార్టీ

Spread the love4Sharesక‌మ‌లానికి కొత్త సార‌ధి ఖాయం అయ్యింది. త్వ‌ర‌లోనే నాయ‌కుడెవ‌ర‌న్న‌ది తేల‌బోతోంది. ప‌లువురు ఆశావాహులు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు.Read More

 • టీడీపీని కాపాడాలంటూ ఆమ‌ర‌ణ‌దీక్ష‌
 • బెజ‌వాడలో వైసీపీ కి కొత్త స‌మ‌స్య‌లా..?
 • అమ‌రావ‌తి అవినీతిపై మ‌రో పుస్త‌కం
 • బాబుకి షాక్…వైసీపీలోకి కీల‌క నేత‌
 • కాగ్ రిపోర్ట్ ని దాచేసిన ప్ర‌భుత్వం!
 • ప్ర‌భుత్వ తీరుపై టీడీపీ నేత‌ల్లో అస‌హ‌నం
 • వైసీపీ రాజీనామాలు: బైఠాయించిన టీడీపీ
 • అయ్యో..నారా లోకేష్!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *