Main Menu

మారిన రాజ‌కీయం: ఉప ఎన్నిక‌ల‌కు దారితీసేనా?

Telugu-image
Spread the love

ఎట్ట‌కేల‌కు లోక్ స‌భ స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించారు. గ‌త నెల చివ‌రిలోనే రాజీనామాలు ఆమోదిస్తార‌ని భావించిన‌ప్ప‌టికీ దాదాపుగా ఇర‌వై రోజులు జాప్యం చేసి రాజీనామాలు ఆమోదించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి వైసీపీ ఎంపీలు ఏప్రిల్ మొద‌టి వారంలో రాజీనామాలు చేశారు. ఆవెంట‌నే ఆమోదించి ఉంటే ఉప ఎన్నిక‌లు అనివార్యంగా మారేవి. క‌నీసం మే నెల చివ‌రిలోనైనా రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నిక‌లు జ‌ర‌పాల్సిన ప‌రిస్థితి ఉండేది. కానీ అభిప్రాయం పేరుతో పిలిచిన స్పీక‌ర్ , తాము రాజీనామాలు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని వైసీపీ ఎంపీలు స్ప‌ష్టం చేసిన‌ప్ప‌టికీ వాటిని ఆమోదించ‌కుండా జాప్యం చేశారు. ఎట్ట‌కేల‌కు తాజాగా ఆమోదిస్తూ ప్ర‌క‌ట‌న చేయ‌డం ద్వారా ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారం నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌ల ప‌రిస్థితి రాకుండా చూసుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని ప‌రిశీల‌కుల అభిప్రాయం.

ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఐదుగురు ఎంపీలు ఇచ్చిన రాజీనామాలు ఆమోదం పొందాయి. ఏప్రిల్ 6న ఎంపీ పదవులకు రాజీనామా చేస్తూ వైసీపీ నేత‌లు సమర్పించిన లేఖలు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. కాగా, గత నెలలో ఇచ్చిన రాజీనామా లేఖలపై తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులేదని, రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని, మే 29న స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిసి వైఎస్సార్‌సీపీ నేతలు వివరించారు. రాజీనామాలపై పునరాలోచించుకోవాలని సుమిత్రా మహాజన్‌ కోరినా… హోదా పోరులో వైఎస్సార్‌సీపీ నేతలు వెనక్కి తగ్గక పోవడం గమనార్హం. పార్లమెంట్‌ సమావేశాల అనంతరం మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డిలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.






Related News

pawan

జ‌న‌సేనానికి కంటి స‌మ‌స్య‌లు

Spread the loveజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయ‌న్ని కంటి స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి. ఇప్ప‌టికేRead More

Chandu Sambasiva Rao2

ప‌ర‌కాల ప్లేస్ లో ఆయ‌నేనా..?

Spread the loveచంద్ర‌బాబుకి పెద్ద చిక్కొచ్చింది. ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తుండ‌డంతో చాలామంది నేత‌లు ప్ర‌త్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ప‌ద‌వుల పంపిణీలో త‌గినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *