మరో వైసీపీ వికెట్ డౌన్

మరో వైసీపీ ఎమ్మెల్యే జంపింగ్ కి సిద్ధమయ్యారు. ఏకంగా సీఎంతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు రాయబారంతో గుంటూరు ఎమ్మెల్యే ముస్తాఫా నేరుగాచంద్రబాబుని కలిశారు. ఏకాంత చర్చలు జరిపారు. త్వరలో టీడీపీ కండువా కప్పుకోవడానికి క్లారిటీ వచ్చేసినట్టు ప్రచారం సాగుతోంది. చాలాకాలంగా ముస్తాఫా వ్యవహారం చర్చనీయాంశం అయ్యింది. ఆయన మాత్రం కొట్టేశారు. కానీ ఈసారి నేరుగా సీఎంని కలవడంతో సైకిలెక్కడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
గుంటూరులోని ఒమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబును ముస్తఫా హెలిఫ్యాడ్ వద్ద కలుసుకున్నారు. కొద్దిసేపు చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముస్తఫాను చంద్రబాబు వద్దకు ఎంపీ రాయపాటి సాంబశివరావు తీసుకువచ్చారు.
కొంతకాలంగా రాయపాటి, ముస్తఫాను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నసంగతి బహిరంగ రహస్యమే. ఇప్పటివరకు వైసీపీ ఎమ్మెల్యేలు 22 మంది టీడీపీలోకి చేరారు. వీరిలో ముగ్గురికి చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవులు దక్కాయి. ఈ ముగ్గురు రాయలసీమకు చెందిన వారు కావటం విశేషం. అదే సమయంలో వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు మైనార్టీ నేతలు ఇప్పటికే టీడీపీలో చేరగా, ఇప్పుడు ముస్తాఫా మూడో ఎమ్మెల్యే అవుతారు. జలీల్ ఖాన్, ఛాంద్ భాషా తర్వాత ముస్తాఫా కూడా సైకిలెక్కేస్తే ఆయన నేరుగా బీజేపీ, వైసీపీ బంధం మీద వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. దాంతో మరో వికెట్ ఖాయమనే వాదన బలపడుతోంది.
Related News

ఎన్టీఆర్ సినిమా అడ్డుకోండి చంద్రబాబు పిలుపు
Spread the loveఏపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవాలన్నారు. టీడీపీ శ్రేణులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లోRead More

అంబటికి జగన్ ఝలక్!
Spread the loveవైసీపీ లో గట్టిగా పార్టీ వాణీ వినిపించే నేతల్లో అంబటి రాంబాబు ఒకరు. ఆది నుంచి జగన్Read More