పార్టీ పరువు తీసుకుంటున్న వైసీపీ నేతలు

ysrcp
Spread the love

ఏపీలో వైసీపీ పరిస్థితి అసలే అంతంతమాత్రంగా ఉంది. వరుస ఎదురుదెబ్బలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. నంద్యాల, కాకినాడ ఓటములతో తీవ్రంగా ఇరకాటంలో పడింది. గట్టెక్కడానికి ఏం చేయాలనే విషయంలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. అందరి వేళ్లూ అధినేత వైపే ఉన్న తరుణంలో ఆయన ఏమేరకు మారతారనే చర్చ మొదలయ్యింది. కానీ ఈలోగానే ఆపార్టీ నేతలు ఉన్న పరువు కూడా బజారున పడేసుకుంటున్నారు. పార్టీని అభాసుపాలుజేస్తున్నారు.

తాజాగా విజయవాడ వ్యవహారం దానికి నిదర్శనం. ఆపార్టీ కార్మిక విభాగం నేత గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వంగవీటి రంగాకి వ్యతిరేకంగా గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో దుమారం రేపాయి. అసలే పార్టీ పరిస్థితి సమస్యాత్మకంగా మారడంతో తాజాగా గౌతమ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఓ సామాజికవర్గం, ముఖ్యంగా విజయవాడలోని వైసీపీ నాయకుడిగా ఉన్న వంగవీటి రాధా వర్గమే తీవ్రంగా స్పందించడం ఖాయం.అనుకున్నట్టేగా వంగవీటి రాధా అలజడి రేపారు. తన సొంత పార్టీ నాయకుడు చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించినప్పుడు తొలుత పార్టీ అధిష్టానం ముందుకు తీసుకెళ్లాలి. ఆతర్వాత చర్యలు తీసుకోకపోతే రాధా స్పందించి ఉండాలి. కానీ నేరుగా సొంత పార్టీ నాయకుడి తీరు మీద మరో నాయకుడు రోడ్డెక్కే ప్రయత్నం చేయడం. పోలీసులు అడ్డుకోవడం, ఆ సందర్భంగా వంగవీటి రత్నకుమారి కింద పడిపోవడం తీవ్రంగా కలకలం రేపాయి.

అయితే అదే సమయంలో వైసీపీ అధిష్టానం గౌతమ్ రెడ్డిని సస్ఫెండ్ చేసింది. పార్టీ నాయకుడే అయినప్పటికీ వేటు వేసింది. దాంతో వైసీపీ పార్టీకి మరింత నష్టం కలగకుండా చర్యలు తీసుకుంది. కానీ ఈలోగా ఇద్దరు నేతల తీరుతో ఆపార్టీ మరింత అభాసుపాలయినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి విజయవాడలో గత ఎన్నికల్లో గౌతమ్ రెడ్డిని సెంట్రల్ సీటు నుంచి నిలబెట్టి వైసీపీ సాహసం చేసింది. చివరకు చేతులు కాల్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కార్మికవిభాగానికి రాష్ట్రనేతగా కొనసాగిస్తూ పార్టీలో తగిన గౌరవం కల్పిస్తున్నారు. అయినా గౌతమ్ రెడ్డి మాత్రం తన తీరు మార్చుకోకపోగా తీవ్ర వ్యాఖ్యలకు దిగి వైసీీపీని ఇరకాటంలో నెట్టారు.

ఇక అదే సమయంలో వంగవీటి రాధా కూడా వచ్చే ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి తనకు పోటీ అవుతారని భావిస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకి ఖాయం చేయడంతో ఇక మిగిలిన తూర్పు నియోజకవర్గంలో గౌతమ్ రెడ్డి వేలు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే తాజా వివాదంతో వంగవీటి రాధా వీరంగం చేయడం వైసీపీకి ఇబ్బందికరంగా తయారయ్యింది. ఒకరు మాటలతో, మరికొరు తన చర్యలతో ప్రతిపక్ష పార్టీ పరువు తీసినట్టయ్యింది.« (Previous News)Related News

DO6VyfFVoAMHVAK

సోషల్ మీడియాపై చంద్రబాబు కన్ను…

Spread the love2Sharesఇప్పటికే రాజకీయ పార్టీలు సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెంచుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా తన విధానాలRead More

Chintamaneni

సిగ్గుపడాల్సిందేగా…?

Spread the love11Sharesఏపీ రాజధాని ప్రాంతంలో తన గేదెలు మేపుకోవడానికి మంచి అవకాశం దొరికిందంటున్నారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. విచిత్రRead More

 • బెజవాడ వైసీపీలో హీటు రాజేసిన పాదయాత్ర
 • చంద్రబాబుని నిలదీసిన సినీ దర్శకుడు
 • నిర్లక్షానికి పరిహారం పర్యాటకుల ప్రాణాలు
 • వైసీపీ అధినేతపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
 • వారికి తలుపులు మూసేసిన జనసేన
 • డిజైన్లు ఖరారు: 26న శంకుస్థాపన
 • మళ్లీ నోట్ల రద్దు చేయాలన్న చంద్రబాబు
 • జగన్ తొలి అడుగు పడింది..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *