Main Menu

అమ‌రావ‌తి వైసీపీలో ఆస‌క్తిక‌ర మలుపు

Spread the love

విప‌క్ష వైసీపీలో వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లాకు చెందిన ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశాల‌వుతున్నాయి. ఇప్ప‌టికే గుంటూరు జిల్లా ప‌రిణామాలు వైసీపీలో తొలుత గంద‌ర‌గోళంగా మారినా, ఆవెంట‌నే మ‌ళ్లీ స‌ర్థుకుంటున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. చిల‌క‌లూరిపేట‌లో ఇప్ప‌టికే అలాంటి స్ప‌ష్ట‌త వ‌చ్చింది. తాజాగా రాజ‌దాని నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఇప్పుడు ప‌రిణామాలు మారుతున్న తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

అమ‌రావ‌తి రాజ‌ధాని నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ‌లో ప్ర‌స్తుతం టీడీపీ ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ స్థానం మీద వైసీపీ క‌న్నేసింది. అందులో భాగంగా నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ ను మార్చడం దానికి నిద‌ర్శ‌నంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన క్రిస్టియానా స్థానంలో కొత్త అభ్య‌ర్థిని ముందుకు తెస్తున్నారు. తాడికొండ ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం ఇన్‌చార్జిగా డాక్టర్‌ శ్రీదేవిని నియమిస్తూ ఉత్తర్వులు విడుద‌లయ్యాయి. కత్తెర క్రిష్టియానాను తప్పించి శ్రీదేవికి బాధ్యతలు అప్పగించారు.

కొత్త నేత తెర‌మీద‌కు రావ‌డం వైసీపీ లో కొంద‌రికి అసంతృప్తి క‌లిగించింది. దాంతో ఆర్థికంగా ద‌న్ను ఉన్న డాక్ట‌ర్ శ్రీదేవికి నేత‌లంతా ఏమేర‌కు స‌హ‌క‌రిస్తార‌న్న‌ది చ‌ర్చ‌కు దారితీస్తోంది.






Related News

ఆంధ్రాలో కేసీఆర్ ప్ర‌చారం ఆ పార్టీ కోస‌మే!

Spread the loveతెలంగాణా ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు పాత్ర‌పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. టీఆర్ఎస్ భారీ మెజార్టీకి చంద్ర‌బాబు కార‌ణ‌మంటూ సోష‌ల్Read More

చంద్ర‌బాబు క‌న్ను ఆరాష్ట్రంపై!

Spread the loveఏపీ సీఎం ప‌క్క చూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌లో టీడీపీ నేతృత్వంలో ఓ బృందం వెళ్లిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *