విజ‌య‌సాయిరెడ్డి మ‌రో రికార్డ్..!

VijaySaiReddy
Spread the love

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో రికార్డ్ సృష్టించారు. పార్ల‌మెంట్ చ‌రిత్ర‌లోనే ఓ మెట్టు ఎక్కారు. అరుధైన ఘ‌న‌త సాధించారు. తాజాగా జ‌రిగిన వ‌ర్షాకాల పార్లమెంట్ స‌మావేశాల్లో విజ‌యసాయి రెడ్డి ప్ర‌తిభ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. పార్ల‌మెంట్ లో ఆయ‌న తీరు చూసిన చాలామంది ఆశ్చ‌ర్య‌ప‌డాల్సి వ‌స్తోంది. అలాంటి అనూహ్య‌రీతిలో విజ‌య‌సాయిరెడ్డి రికార్డుల‌కెక్క‌డం వ్య‌తిరేకుల‌కు మింగుడుప‌డ‌క‌పోయినా ఆయ‌న తీరు మాత్రం పార్ల‌మెంట్ పెద్ద‌ల దృష్టిలో ప్ర‌ధానంగా మారుతోంది.

వాస్త‌వానికి విజ‌యసాయిరెడ్డి గెలిచింది ఓ ప్రాంతీయ పార్టీ త‌రుపున‌. అందులోనూ వైసీపీ నుంచి ఆయ‌న తొలి రాజ్య‌స‌భ స‌భ్యుడు కావ‌డం కూడా విశేషం. అలాంటి స‌మ‌యంలో విజ‌యసాయిరెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడు పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. పంజాబ్ లో ని అకాలీద‌ళ్ నుంచి త‌మిళ‌నాడు అన్నాడీఎంకే వ‌ర‌కూ అన్ని పార్టీల‌తోనూ ట‌చ్ లో ఉంటూ ఆయ‌న విస్తృతంగా న‌డుపుతున్న రాజ‌కీయాలు చాలామందికి విస్మ‌యం క‌లిగిస్తున్నాయి. అదే స‌మ‌యంలో బీజేపీలో కీల‌క‌పెద్ద‌ల‌తో ఆయ‌న సంబంధాలు కూడా ఏపీ రాజ‌కీయాల మీద తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. ఇటీవ‌ల విజ‌య‌సాయిరెడ్డి పావులు క‌ద‌ప‌డంతోనే జ‌గ‌న్ కి పీఎం అపాయింట్ మెంట్ ద‌క్క‌డం, ఆత‌ర్వాత బీజేపీ, టీడీపీ సంబంధాలు కాస్త తెగుతున్నాయ‌న్న ప్ర‌చారం ఊపందుకోవ‌డం గ‌మ‌నార్హం.

అవ‌న్నీ ఒక ఎత్తు అయితే స‌భ బ‌య‌టే కాకుండా స‌భలోప‌ల కూడా విజ‌య‌సాయిరెడ్డి పెద్ద‌ల స‌భ‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారుతుండ‌డం విశేషం. ఇటీవ‌ల వ‌ర్షాకాల స‌మావేశాల్లో విజయసాయి రెడ్డి ఒక అరుదైన చరిత్ర సృష్టించారు. పార్లమెంట్ లోఆయన ఒక్కడే నూట అరవై తొమ్మిది ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించడం అనూహ్య రికార్డ్ గా చెబుతున్నారు. ఒకే స‌భ్యుడు ఇన్ని ప్ర‌శ్న‌లు అడిగిన అనుభ‌వం గ‌తంలో ఎవ‌రికీ లేదు. నలభై అయిదు అంశాలపై సాగిన చర్చల్లో ఆయ‌న ప్ర‌ధాన భూమిక పోషించారు. వాటికి తోడుగా అయిదు ప్రయివేట్ బిల్లులను కూడా ప్రతిపాదించారు. దాంతో విజ‌య‌సాయిరెడ్డి తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. హోమ్ వ‌ర్క్ చేసి మ‌రీ ఆయా అంశాల మీద విజ‌య‌సాయిరెడ్డి మాట్లాడిన తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ఆడిట‌ర్ గానూ అద్భుత ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన విజ‌యసాయిరెడ్డి ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లో వ‌రుస‌గా చెల‌రేగిపోతున్న తీరు ప్ర‌త్య‌ర్థి పార్టీని బెంబేలెత్తిస్తోంది. కానీ వైసీపీకి విస్తృత ప్ర‌యోజ‌నాలు క‌లిగించేలా విజ‌య‌సాయి తీరు సాగుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు. జాతీయ రాజ‌కీయాల్లో విజ‌య‌సాయిరెడ్డి త్వ‌ర‌లోనే కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.


Related News

jaleelkhan

బాబు క్లాస్ లంచ్ లోనూ వదల్లేదు..

Spread the loveఇటీవల టీడీపీ ఎల్పీ మీటింగ్ తర్వాత ఆసక్తికర పరిణామం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం గట్టిగా క్లాస్Read More

chandra

చంద్రబాబు ఇమేజ్ పెంచడానికి 25 కోట్లు ..

Spread the loveఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్నారు. తప్పేముందనుకుంటున్నారా..అందుకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రం కోసమేRead More

 • జైలుకి పోతారని హెచ్చరించిన బీజేపీ నేత
 • కస్సుమన్న కేవీపీ
 • అసెంబ్లీ వద్ద కలకలం
 • ఏపీలో కొత్త జిల్లాలు లేవు..
 • పెళ్ళి ఎఫెక్ట్: ఖాళీ అయిన అసెంబ్లీ
 • అఖిలప్రియకు అండగా చినబాబు
 • సోషల్ మీడియాపై చంద్రబాబు కన్ను…
 • సిగ్గుపడాల్సిందేగా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *