Main Menu

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి వెన్నుపోటు?

Spread the love

జ‌న‌సేనానికి వెన్నుపోటు తప్ప‌దా..ఎన్టీఆర్ త‌ర్వాత ఆయ‌న కూడా ఆ జాబితాలో చేర‌తారా..అప్ప‌ట్లో ఎన్టీఆర్ కి వెన్నంటి ఉండి, అధికారాన్ని కాజేసే య‌త్నం చేసిన నాదెండ్ల భాస్క‌ర రావు వార‌సుడే ఇప్పుడు జ‌న‌సేన‌లో అలాంటి ప్ర‌య‌త్నానికి పూనుకుంటున్నారా..ఇదే చ‌ర్చ మొద‌ల‌య్యింది. అయితే ఈ చ‌ర్చ‌కు మూలం రామ్ గోపాల్ వ‌ర్మ కావ‌డం విశేషం. ఈ సినీ ద‌ర్శ‌కుడు జ‌న‌సేన రాజ‌కీయాల‌పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విషయంలో ఇకపై జోక్యం చేసుకోను అని ఆ మధ్య వరుస ట్వీట్లతో చెప్పిన వర్మ.. మరోసారి పవన్ కల్యాణ్‌ను, ఆయన అభిమానులను ఉద్ధేశించి సంచలన ట్వీట్లు చేశారు. ఆయన ట్వీట్లు ఇలా ఉన్నాయి. దాంతో ఇప్పుడు ఇవి సంచ‌ల‌నం అవుతున్నాయి.

ఈ ట్వీట్లు ఇప్పుడు తాజాగా వైర‌ల్ అవుతున్నాయి. అయితే కొంత‌కాలంగా సైలెంట్ గా ఉన్న రామ్ గోపాల్ వ‌ర్మ ఇప్పుడు అనూహ్యంగా ఇలాంటి ట్వీట్ల‌తో మ‌ళ్లీ ప‌వ‌న్ ఫ్యాన్స్ ని కెలికిన‌ట్టుగా ఉంద‌ని కొంద‌రు సందేహిస్తున్నారు. దానికి కార‌ణాలు కూడా లేక‌పోలేద‌ని, త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ఆర్జీవీ సినిమా తెర‌మీద‌కు రాబోతున్న త‌రుణంలో మ‌రోసారి త‌న పేరు చర్చ‌కు రావాల‌నే ఉద్దేశంతోనే వ‌ర్మ ఇలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు ప‌లువురు సందేహిస్తున్నారు.






Related News

పురందేశ్వ‌రి పోటీ ఎక్క‌డ‌?

Spread the loveఏపీ రాజ‌కీయాలు వేగంగా మారుతున్నాయి. సంక్రాంతి త‌ర్వాత మ‌రింత జోరుగా మార్పులు, చేర్పులు ఉంటాయ‌ని చెబుతున్నారు. అందుకుRead More

బుద్ధా వెంక‌న్న వ్యూహాత్మ‌కంగానే వైసీపీలోకి…!

Spread the loveటీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న వ్య‌వ‌హారం ఆది నుంచి చ‌ర్చ‌నీయాంశ‌మే. దుర్గ గుడి వ్య‌వ‌హారాల ఉంచి టీడీపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *