బాబుపై దండ‌యాత్ర‌కు మ‌రో నేత‌

vadde sobhanadri
Spread the love

ఏపీ సీఎంకి ఇప్పుడు రాజ‌కీయ పార్టీల‌తోనే కాదు, ఏపార్టీలోనూ లేని సీనియ‌ర్ నేత‌ల‌తోనూ త‌ల‌నొప్పి త‌ప్ప‌డం లేదు. ఇప్ప‌టికే ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం మంట రేపుతున్నారు. ఉండ‌వ‌ల్లి అరుణ కుమార్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా ద‌గ్గుపాటి వెంక‌టేశ్వ‌ర రావు రెడీ అయ్యారు. వీళ్లంతా ఉద్దండ రాజ‌కీయులే. కానీ చాలాకాలంగా పార్టీ ర‌హితంగా ప‌నిచేస్తున్నారు. ఇప్పుడు వారికి మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు తోడ‌వుతున్నారు. ఇప్ప‌టికే అమ‌రావ‌తి వంటి అంశాల మీద చంద్ర‌బాబు తీరును త‌ప్పుబ‌డుతున్న ఆయ‌న ఈసారి నేరుగా ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌కు క‌దం తొక్కుతున్నారు. ఎంపీగా, మంత్రిగా సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాల్లో ఉన్న వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర రావు ఇప్పుడు మ‌రోసారి క్రియాశీలం కావాల‌ని ఆశిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతున్నారు.

ఆయ‌న భూముల అంశం మీద రైతుల‌ను క‌దిలించే ప‌నిలో ప‌డ్డారు. త్వ‌ర‌లో విజ‌య‌వాడ కేంద్రంగా భారీగా స‌ద‌స్సు ఏర్పాటు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. త‌ద్వారా అమ‌రావ‌తి రైతుల స‌మ‌స్య‌ల‌ను ఎలుగెత్తి చాట‌డ‌మే ఆయ‌న ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. చంద్ర‌బాబు త‌న‌కు బ‌లం ఉంద‌ని భావిస్తున్న రాజ‌ధాని ప్రాంతంలోనే ఇప్పుడు వ‌డ్డే వారి ఉద్య‌మానికి రంగం సిద్దం కావ‌డం విశేషం. ఆయ‌న కూడా చంద్ర‌బాబు సొంత సామాజిక‌వ‌ర్గానికే చెందిన నాయ‌కుడే కావ‌డం కూడా గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే అసంతృప్తి మొద‌లుకావ‌డంతో అమ‌రావ‌తిలో చిన్న చిన్న అంశాల‌కే జ‌నం క‌దులుతున్నారు. కొద్దిరోజుల క్రితం వాహ‌నాల మూలంగా స‌మ‌స్య వ‌చ్చింద‌న్న కార‌ణంగా మంద‌డంలో రైతులు రోడ్డెక్కారు. ఇలాంటి అంశాల మీద ఉద్య‌మిస్తున్న వారికి వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌రావు తోడ‌యితే వ్య‌వ‌హారం చేజారిపోయినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని టీడీపీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

నిజానికి వడ్డే వారు చాలాకాలంగా భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు. ల్యాండ్ ఫూలింగ్ విధానంపై పలువురితో కలిసి కదులుతున్నారు. ఇక ఇప్పుడు కార్యరంగంలో దిగాలనే ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తోంది. అయితే సీనియర్ నేతగా ఆయ‌నకు గుర్తింపు ఉన్న‌ప్ప‌టికీ రైతుల‌ను న‌డిపించే స్థాయి ప్ర‌స్తుతం ఆయ‌న‌కు లేదు. వృద్ధాప్యంతో పాటు ఇత‌ర వ్య‌వ‌హారాలు కూడా ఆయ‌న‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం లేదు. కాబ‌ట్టి అది పెద్ద స‌మ‌స్యే కాద‌ని పైకి చెబుతున్నా లోలోన మాత్రం తెలుగుదేశం వ‌ర్గాలు త‌ల్ల‌డిల్లుతున్నాయి. దాంతో ఇప్పుడు వ‌డ్డే శోభ‌నాద్రీశ్వ‌ర రావు తీసుకోబోయే నిర్ణ‌యాలు కూడా చంద్ర‌బాబుకి మ‌రో త‌ల‌నొప్పిగా మార‌డం ఖాయం, ఆయ‌న ఎటువంటి కార్యాచ‌ర‌ణ‌తో ముందుకొస్తార‌న్న దానిని బ‌ట్టి టీడీపీ నేత‌ల స్పంద‌న ఉంటుంద‌ని స‌మాచారం.


Related News

ap assembly

అసెంబ్లీపై వైసీపీ అనూహ్య నిర్ణయం

Spread the love3Sharesఏపీ రాజకీయాల్లో వైసీపీ కొత్త కాక రాజేస్తోంది. జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుRead More

pk jagan

కోర్టు తీర్పు ఉండడంతో వాయిదా వేసిన జగన్

Spread the love6Sharesవైఎస్ జగన్ పాదయాత్ర ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఆరు నెలల పాటు కోర్టు వాయిదాలకు మినహాయింపు ఇవ్వాలనిRead More

 • కన్న కూతురిని చంపేసిన టీడీపీ అధ్యక్షుడు
 • టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేల షాక్
 • చై.నా. సంస్థలు మూసేస్తాం…
 • బెజవాడలో రౌడీయిజం
 • లాడ్జీకి రమ్మని ఎస్సై వేధింపులు
 • టీడీపీలో ఇసుక తుఫాన్
 • సోమిరెడ్డికి ఛాంబర్ దక్కింది
 • వైసీపీలో చేేరిన సీనియర్ నేత
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *