Main Menu

ఆ ఎమ్మెల్యేకి హ్యాండివ్వబోతున్న చంద్రబాబు

Spread the love

ఏపీ రాజధాని రాజకీయాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులోనూ బెజవాడ పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. అందుకు తగ్గట్టుగానే తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వ్యవహారాలు తెరమీదకు వచ్చాయి. ఒక్క డైలాగ్ తో రాష్ట్రమంతా పాపులర్ అయిపోయిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కి ఝలక్ ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. బీకాంలో ఫిజిక్స్ చదివానంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చిరవకు ఆయన్ని మంత్రి పదవికి దూరం చేశాయి. తాజాగా ఎమ్మెల్యే సీటుకి కూడా ఎసరు తెస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం మొదలయిన కసరత్తులో భాగంగా వెస్ట్ నియోజకవర్గంలో జలీల్ ఖాన్ స్థానంలో కొత్త అభ్యర్థి కోసం వేట సాగిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఆయన స్థానంలో మరొకరి పేరు ప్రతిపాదించాల్సి వస్తే పలువురి పేర్లు ముందుకొస్తున్నాయి. అందులో జలీల్ ఖాన్ కుమార్తె కూడా ఉన్నట్టు సమాచారం. తనను కాదంటే కూతురు పేరు పరిశీలించాలని ఇప్పటికే అధిష్టానం ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఆమె ఇండియాకు తిరిగి రావడానికి సంసిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

అయితే టీడీపీ నేతలు మాత్రం మరో ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. విజయవాడలో బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించుకున్న దానికి తగ్గట్టుగా వెస్ట్ నుంచి ఓ ఎన్ఆర్ఐకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆఖరి నిమిషంలో ప్రస్తుతం పెనమలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బోడే ప్రసాద్ పేరు పరిశీలించినా ఆశ్చర్యం లేదంటున్నారు. పెనమలూరు నారా లోకేష్ కి కేటాయించాల్సి వస్తే అలాంటి పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు. అయినా సామాజిక సమీకరణాలు ప్రసాద్ కి అంత సానుకూలంగా కనిపించడం లేదు. ఏమయినా జలీల్ ఖాన్ కి మాత్రం హ్యాండిచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు. చూడాలి..పాపం మరి పార్టీ ఫిరాయించిన జలీల్ ఖాన్ టికెట్ దక్కుతుందో లేదో






Related News

ఆర్కే ప్ర‌త్య‌ర్థి అత‌డే..!

Spread the loveవ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అన్ని పార్టీలు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్నారు. వ‌చ్చే మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఈసీRead More

జ‌న‌సేనాని..ఓ సారి వెన‌క్కి చూసుకో..!

Spread the loveరాజ‌కీయ మార్పు కోసం అంటూ ముంద‌డుగు వేసిన జ‌న‌సేనానికి అనేక ప్ర‌త్యేక‌త‌లున్నాయి. ఏపీలో స‌మీక‌ర‌ణ కోసం ఏరీతినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *